For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేనోలా ఆయిల్ వలన కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

|

కేనోల ప్లాంట్ నుండి లభ్యమయ్యే గింజలను క్రష్ చేసి సేకరించబడిన కేనోల ఆయిల్ ను గత దశాబ్దం నుంచి హెల్తీయర్ ఆయిల్ గా పరిగణిస్తున్నారు.

ఈ ఆయిల్ లో ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్ మరియు లినొలెనిక్ యాసిడ్ అనే వైటల్ ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో విధాలా మంచివి.

కేనోల ఆయిల్ ను కుకింగ్ తో పాటు మరెన్నో విధాలుగా ఆరోగ్యం కోసం వాడతారు. చర్మం మరియు శిరోజాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు దీనిని వాడతారు.

ఈ ఆయిల్ లో క్యూరేటివ్ ప్రాపర్టీస్ తో పాటు వ్యాధులను అరికట్టే సామర్థ్యం కూడా క్లూడ్. దీని గుణాల వలన ఇది వెర్సటైల్ ఆయిల్ గా ప్రసిద్ధి చెందింది. అందువలన, ఈ ఆయిల్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.

కాబట్టి, ఇక్కడ ఈ ఆయిల్ ద్వారా లభించే వివిధ ఆరోగ్యప్రయోజనాల గురించి వివరించాము.

1. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది:

1. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది:

గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఆయిల్స్ లో కేనోలా ఆయిల్ ముఖ్యస్థానాన్ని పొందింది. ఈ ఆయిల్ లో ఆరోగ్యకరమైన గుండెకు శ్యాచురేటెడ్ యాసిడ్స్ అనేవి తక్కువ మోతాదులో లభిస్తాయి.

ఈ ఆయిల్ లో లభించే స్టెరాల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండె ఆరోగ్యానికి మంచివి. కొలెస్ట్రాల్ అనేది లేకపోవటం వలన ఈ ఆయిల్ ని హెల్తీ ఛాయిస్ గా పరిగణించవచ్చు.

ఈ ఆయిల్ లో లభించే ఫైటోస్టెరాల్స్ అనేవి మిగతా ఫుడ్ ద్వారా కొలెస్ట్రాల్ అబ్సర్ప్షన్ ని తగ్గించి కొలెస్ట్రాల్ ఫార్మేషన్ ని తగ్గిస్తుంది.

2. ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది:

2. ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది:

కేనోలా ఆయిల్ అనేది ఇంఫ్లేమేషన్ ని తగ్గిస్తుంది. ఆస్త్మా మరియు ఆర్తరైటిస్ కి ఇది మంచి క్యూర్. జాయింట్ స్టిఫ్ నెస్ ను తగ్గించి మొబిలిటీను పెంపొందిస్తుంది.

3. ఎనర్జీ లెవెల్స్ ని పెంపొందిస్తుంది

3. ఎనర్జీ లెవెల్స్ ని పెంపొందిస్తుంది

ఈ ఆయిల్ అనేది శరీరంలోని మెటబాలిజం ను పెంపొందిస్తుంది. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీ ఎనర్జీ లెవెల్స్ ని తగ్గిపోనివ్వవు. అలాగే, ఈ ఆయిల్ లో కొలెస్ట్రాల్ అస్సలు లభించదు.

4. క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది

4. క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది

ఈ ఆయిల్ అనేది క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కేనోల ఆయిల్ లో లభించే విటమిన్ ఈ కంటెంట్ అనేది క్యాన్సర్ ను అరికట్టేందుకు తోడ్పడుతుంది. అలాగే శరీరంలోని వ్యాధి వృద్ధిని అరికడుతుంది.

5. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది:

5. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది:

కేనోల ఆయిల్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఆరోగ్యకరంగా మెయింటైన్ చేసేందుకు తోడ్పడుతుంది. డయాబెటిస్ పేషంట్స్ లో ఈ ఆయిల్ వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిపబడ్డాయని తెలుస్తోంది. ఈ ఆయిల్ లో మోనో అన్ శ్యాచురేటెడ్ యాసిడ్స్ అధికంగా లభిస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ ని ఇన్సులిన్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయి.

6. మెమరీ లాస్ ని అరికడుతుంది

6. మెమరీ లాస్ ని అరికడుతుంది

కేనోలా ఆయిల్ లో లభించే పదార్థాల వలన మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. తద్వారా బ్రెయిన్ ఏజింగ్ ని ఈ ఆయిల్ అరికడుతుంది.

7. చర్మ సంరక్షణను పెంపొందిస్తుంది

7. చర్మ సంరక్షణను పెంపొందిస్తుంది

కేనోలా ఆయిల్ వలన చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇందులో లభించే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి స్కిన్ ని నరిష్ చేసి మాయిశ్చరైజ్ చేస్తాయి. డ్రై స్కిన్ కి ఇది సరైన ఎంపిక. బ్లేమిషెస్, రింకిల్స్ అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేయడానికి కేనోల ఆయిల్ ఉపయోగపడుతుంది. ఇందులో లభించే విటమిన్ ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ల వలన చర్మం మృదువుగా మరియు యవ్వనంగా ఉంటుంది.

8. శిరోజాల ఆకృతిని కాపాడుతుంది

8. శిరోజాల ఆకృతిని కాపాడుతుంది

ఆరోగ్యకరమైన శిరోజాలను పొందేందుకు కేనోలా ఆయిల్ పై ఆధారపడటం మంచిది. ఇది మీ శిరోజాలను అలాగే స్కాల్ప్ ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. డాండ్రఫ్ పై పోరాటాన్ని జరుపుతుంది. కేనోల ఆయిల్ ను వాడి డ్రై మరియు ఫ్రిజ్జీ హెయిర్ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. ఈ ఆయిల్ అనేది స్కాల్ప్ లోపలకి ఇంకిపోయి శిరోజాల క్వాలిటీని పెంపొందిస్తుంది.

హెయిర్ గ్రోత్ ను మెరుగుపరచి హెయిర్ ఫాల్ ను తగ్గించడంలో ఈ ఆయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పైన చెప్పిన కారణాల వలన ఈ ఆయిల్ అనేది మిగతా ఆయిల్స్ కి సరైన ప్రత్నామ్నాయంగా పనిచేస్తుంది.

అందువలన, హెల్తీ ఆయిల్ కోసం కేనోలా ఆయిల్ కు మారడం మంచిది.

English summary

8 Health Benefits Of Canola Oil

Canola oil is one of the versatile oils found to be effective for maintaining health apart from its culinary usage. This oil is used to prevent and cure a number of diseases and also used as a beautifying agent for hair and skin.
Desktop Bottom Promotion