కర్పూరంతో 10 ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్

By Mallikarjuna
Subscribe to Boldsky

భారతీయ సంప్రదాయంలో పూజగదిలో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో కర్పూరం ఒకటి. కర్పూరంను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు, దేవుడి పూజకు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా తలనొప్పి, దగ్గును నివారించడంలో దీన్ని ఉపయోగిస్తారు.

కర్పూరం తెల్లగా, ట్రాన్స్ పరెంట్ గా ఉంటుంది, దీన్ని కర్పూరం లోరెల్ అనే మొక్క నుండి సేకరిస్తారు. ముఖ్యంగా ఆసియా దేశం దీని రాజధాని. ఆసియా దేశాల్లోనే ఎక్కువగా పండిస్తుంటారు.

10 Benefits & Side Effects Of Camphor

తెల్లకర్పూరంనే పచ్చకర్సూరం అని కూడా పిలుస్తారు. ఇందులో మెడిసినల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల దీన్ని పురాతన కాలం నుండే వాడుకలో ఉన్నది. ఇందులో ఉండే మేజర్ కాంపోనెంట్స్ వల్ల ఫేమస్ విపరబ్ లలో కూడా ఉపయోగిస్తుంటారు. ముక్కుదిబ్బడ మరియు జలుబు నివారించడానికి కూడా కర్పూరం ఉపయోగిస్తారు.

అయితే కర్పూరం విషపూరితమైనది. పరిమితికి మించి వినియోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదం జరగవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యానికి ఉపయోగించడానికి ముందుగా ఇందులో ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందాం!

#1 దగ్గు నివారిస్తుంది

#1 దగ్గు నివారిస్తుంది

చెప్పడానికి ఏం లేదు, ముక్కుదిబ్బడ, జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరంను ఉపయోగించడం వల్ల ముక్కుదిబ్బడను నివారిస్తుంది. చాతీలో, ముక్కులో అసౌకర్యాన్ని తొలగిస్తుంది. చాలా వరకూ జలుబు, దగ్గు మెడిసినల్ రబ్స్ లో కర్పూరాన్ని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. ఒక చుక్క కర్పూరం నూనెను ఒక టీస్పూన్ బాదం నూనెతో మిక్స్ చేసి సున్నితంగా మర్ధన చేయాలి. చాతీకి రుద్దడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది.

#2 మొటిమలను నివారిస్తుంది

#2 మొటిమలను నివారిస్తుంది

మొటిమల నివారణకు సలూన్లకు వెళ్ళడానికి బదులుగా ఈ ఎఫెక్టివ్ మార్గాన్ని ఎంపిక చేసుకోండి. ఇది బ్రేక్ అవుట్స్ ను నివారిస్తుంది. తర్వాత మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండంటం వల్ల వాపు, చర్మం కందడాన్ని తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ కర్పూరం నూనెను ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు

#3 ముక్కుదిబ్బడను క్లియర్ చేస్తుంది

#3 ముక్కుదిబ్బడను క్లియర్ చేస్తుంది

ముందుగా చెప్పినట్లు కర్పూరం శ్వాసనాళంలో అడ్డంకులను క్లియర్ చేస్తుంది. ఇందులో ఉండే స్ట్రాంగ్ స్మెల్ వల్ల ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. బ్లాక్ అయిన ముక్కులను క్లియర్ చేసి, సౌకర్యవంతంగా మార్చుతుంది. కొద్దిగా కర్పూరం నూనెలో గోరువెచ్చని ఆవనూనెను కలపి, ముక్కు దగ్గరగా , చాతీ మీద అప్లై చేయాలి. చాలా తక్కువగా మాత్రమే ఉపయోగించాలి.పరిమితికి మించి ఉపయోగిస్తే ప్రమాదం.

#4 చర్మంలో, పగుళ్ళను తగ్గిస్తుంది

#4 చర్మంలో, పగుళ్ళను తగ్గిస్తుంది

చర్మంలో పగుళ్ళు సహజం. ముఖ్యంగా జ్వరం, జలుబు వచ్చినప్పుడు పగుళ్ళు సహజంగా ఏర్పడుతుంటాయి. ఇవి చాలా బాధాకరంగా , అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కర్పూరం కోల్డ్ సోర్ ను ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తుంది. ఇది తాత్కాలికంగా నొప్పి మరియు దురదను నివారిస్తుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది వాపును తగ్గిస్తుంది. ఇది ఒక టీస్పూన్ కర్పూరం నూనెను స్వచ్చమైన కొబ్బరి నూనెలో మిక్స్ చేసి అప్లై చేయాలి

#5 తలలో పేలను తొలగిస్తుంది

#5 తలలో పేలను తొలగిస్తుంది

ఇది కొంత వింతే అయినా కానీ, తలలో పేలు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇది ఎవరికైనా జరగవచ్చు. తల పొడి బారడం, తలలో దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పేలను నివారించడంలో కర్పూరం చాలా ఉపయోగకరమైనది. కొబ్బరి నూనె కొద్దిగా కర్పూరం నూనెను కలిపి తలకు అప్లై చేయడం వల్ల పేలు నివారించబడుతాయి. కొద్దిగా కర్పూరంను నూనెలో వేసి గోరువెచ్చగా చేసి తలకు అప్లై చేసి కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయాలి.

#6 మజిల్ పెయిన్ తగ్గిస్తుంది:

#6 మజిల్ పెయిన్ తగ్గిస్తుంది:

మజిల్ స్పామ్ తగ్గించడంలో కర్పూరం గ్రేట్ గా సహాయపడుతుంది. కర్పరంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల మజిల్ పెయిన్ మరియు కండరాల చుట్టూ వాపును తగ్గిస్తుంది. అలాగే ఇది సర్క్యులేషన్ మెరుగుపరిచి, కండరాలు స్టిఫ్ నెస్ తగ్గిస్తుంది. దాంతో నొప్పి క్రమంగా తగ్గుతుంది.

#7 పాదాల పగుళ్ళను నివారిస్తుంది

#7 పాదాల పగుళ్ళను నివారిస్తుంది

పాదాల పగుళ్ళు చాలా సాధారణ సమస్య. ఉరుకుల పరుగుల జీవనశైలి, పాదాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది. కర్పూరం ఈ సమస్యకు స్వస్తి చెబుతుంది. పాదాల పగుళ్ళను తగ్గించడంతో పాటు, నొప్పి మరియు పగుళ్ళను నివారిస్తుంది. కర్పూరంను వార్మ్ వాటర్ లో వేసి మీ పాదాలను అందులో డిప్ చేసి , కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి మంచి నీటితో శుభ్రం చేసి తుడుచుకోవాలి.

#8 కార్న్స్ ను ట్రీట్ చేస్తుంది

#8 కార్న్స్ ను ట్రీట్ చేస్తుంది

కండరాలలో కణుతులు ఏర్పడటం వల్ల ఎక్కువగా నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. నడిచినప్పుడు మరింత బాధిస్తుంది. ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి కర్పూనూనె ఉత్తమమైనది. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలుండటం వల్ల ఇన్ఫెక్షన్స్ ను నయం చేసి, క్రిములను నాశనం చేస్తుంది.

#9 కీటకాలు మరియు దోమలను నాశనం చేస్తుంది

#9 కీటకాలు మరియు దోమలను నాశనం చేస్తుంది

కర్పూరం ఎసెన్సియల్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మానవులకు ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కీటకాలను, దోమలను నివారిస్తుంది. గాలిలో, నీటి ద్వారా వ్యాధులను వ్యాపింప చేసే దోమలను, కీటకాలను నివారిస్తుంది. ఇందులో ఉండే ఘాటైన వాసన దోమలను, కీటకాలను నాశనం చేస్తుంది.

#10 రెస్ట్ లెస్ లెగ్ సిడ్రోమ్ ను ట్రీట్ చేస్తుంది

#10 రెస్ట్ లెస్ లెగ్ సిడ్రోమ్ ను ట్రీట్ చేస్తుంది

రెస్ట్ లెస్ లెగ్ సిడ్రోమ్ అసాధారణంగా వచ్చే సమస్య. కాళ్ళను ఊపడం లేదా నిద్రించే సమయంలో కదపడం వంటి లక్షణాలు కనబడుతాయి. ఇది చాలా అసాదారణంగా ఉంటుంది. హెల్తీ స్లీప్ ను డిస్టర్బ్ చేస్తుంది. కర్పూరం థెరఫిటిక్, యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఇన్ఫ్లమేషన్ మరియు రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణాలను నివారిస్తుంది

10 Benefits & Side Effects Of Camphor

కర్పూరం వాడటానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు.

కర్పూరం ఇంజెక్షన్ రూపంలో తీసుకోకూడదు. ఇంజెక్షన్ రూపంలో కర్పూరం వాడటం మంచి పద్దతి కాదు.

అలాగే నోటి ద్వారా కర్పూరం తీసుకోకూడదు.

కర్పూరంను చర్మానికి అప్లై చేసి ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. లేదంటే మరింత డ్యామేజ్ అవుతుంది.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కర్పూరం వాడకూడదు. పిల్లలఆరోగ్యానికి హానికరం.

పిల్లలకు ఎక్కువ కర్పూరంను వాడకూడదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Benefits & Side Effects Of Camphor

    10 Benefits & Side Effects Of Camphor,Dec 29, 2017 - Everyone is aware of the smell of camphor, especially if you are an Indian. Camphor is used in a variety of ways - starting from offering prayers to even curing a headache or cold.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more