రక్తహీనతను నివారించి, త్వరగా ఎర్ర రక్త కణాలను పెంచే మైండ్ బ్లోయింగ్ ఆహారాలు

By Mallikarjuna
Subscribe to Boldsky

తరచూ మీరు ఎక్కువ అలసటకు , ఆందోళనకు గురి అవుతున్నారా?, అయితే దాన్ని మీరు తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది, ఎందుకంటే, అది రక్తహీనతకు సంకేతం కావచ్చు.

రక్తానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల్లో అనీమియా (రక్త హీనత)ఒకటి. ఇది ముఖ్యంగా ఎక్కువగా మహిళకు వస్తుంటుంది. శరీరంలో కండరాలకు, అవయవాలకు ఆక్సిజన్ ప్రసరణకు కావల్సిన ఎర్రరక్తకణాలను సరైన మోతాదులో ఉత్పత్తి చేయపోవడం వల్ల రక్త హీనతకు దారితీస్తుంది.

symptoms of anaemia

రక్తహీనత ఉన్న వ్యక్తులు అలసట, బలహీనతతో బాధపడుతుంటారు. ఇంకా, హార్ట్ బర్న్ స్వెట్టింగ్, కాళ్ళలో వాపులు, మలంలో రక్తం పడటం వంటి లక్షణాలన్నీ కూడా అనీమియా (రక్తహీనత)కు సంబంధించినవి.

శరీరంలో ఐరన్ , విటమిన్ బి12 మరియు ఫోలిక్ యాసిడ్స్ తగ్గినప్పుడు రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి, రక్తహీనతకు గురి కాకుండా ఉండాలంటే, ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలకు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఐరన్ లోపం ఉందని తెలిపే హెచ్చరికలేంటి ? అనీమియాకి హోం రెమిడీస్.. !!

రోజూ తినే ఆహారాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లైతే రక్తహీనతను నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఐరన్ విటమిన్ సి, విటమిన్ బి12 మరియు ఫోలిక్ యాసిడ్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించుకోవచ్చు.

రక్తహీనతతో పోరాడే కొన్ని ఉత్తమ ఆహారాలను ఈక్రింది విధంగా ఉన్నాయి..

1. దానిమ్మ

1. దానిమ్మ

రక్తహీనతతో బాధపడే వారికి దానిమ్మ మంచిది. దానిమ్మలో ఐరన్, క్యాల్షియం, ఫైబర్ మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్యను నివారిస్తాయి.

రోజూ ఒక చిన్న బౌల్ దానిమ్మ విత్తనాలు లేదా ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ లెవల్స్ పెరిగి, రక్తహీనత నుండి ఉపశమనం కలిగిస్తాయి.

2. ఆకుకూరలు:

2. ఆకుకూరలు:

ఆకుకూరలు రక్తహీనతను నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. ఆకుకూరల్లో ఐరన్, న్యూట్రీషియన్స్, ఫైబర్, క్యాల్షియం, బీటా కెరోటిన్స్ ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను చేర్చుకోవడం చాలా అవసరం.

3. త్రుణ ధాన్యాలు:

3. త్రుణ ధాన్యాలు:

త్రుణ ధాన్యాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు, వీటిలో ఇంకా ఐరన్ , ఫోలిక్ యాసిడ్స్ కూడా ఎక్కువే. త్రుణధాన్యాలను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో రక్తం వ్రుద్ది చెందుతుంది. రక్తహీనతను నివారిస్తుంది

త్రుణధాన్యాలతో పాటు, విటమిన్స్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇది శరీరం పూర్తి పోషకాలకు గ్రహించడానికి కూడా సహాయపడుతుంది.

4. నట్స్ :

4. నట్స్ :

అనీమియ నుండి ఉపశమనం పొందాలంటే నట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. పిస్తా, బాదం, వాల్ నట్స్ లలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. గుప్పెడు నట్స్ తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచడానికి అనీమియా నివారించడానికి సహాయపడుతుంది.

5. లెగ్యుమ్స్ :

5. లెగ్యుమ్స్ :

లెగ్యుమ్స్ లో కూడా ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. లెగ్యుమ్ లో ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

అదే విధంగా, లెగ్యుమ్స్ తో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారాల నుండి పోషకాలను గ్రహించడానికి సహాయపడుతాయి.

6. లివర్ :

6. లివర్ :

మాంసాహారులైతే అనీమియాతో బాధపడే వారికి మాంసాహార లివర్ తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా పొందవచ్చు. లివర్ లో ఐరన్ తో పాటు, విటమిన్ బి12, కాపర్, ఫాస్పరస్, జింక్ లు కూడా ఎక్కువ. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో లివర్ తీసుకోవడం మర్చిపోకండి.

అనీమియా (రక్తహీనత) లోపంను నివారించే 18 హోం రెమెడీస్

7. డేట్స్ :

7. డేట్స్ :

డేట్స్ (ఖర్జూరం)లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ. మీ బ్రేక్ ఫాస్ట్ లో ఖర్జూరం చేరచుకోవడం ఉత్తమం, ఓట్ మీల్ తో పాటు ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. అనీమియాను నివారిస్తాయి.

8. ద్రాక్ష:

8. ద్రాక్ష:

ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ లో ఎండు ద్రాక్షను చేర్చడం వల్ల రక్తహీనతను తగ్గించుకోవచ్చు. అలాగే రోజూ సాయంత్రంలో స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఇది హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచడం మాత్రమే కాదు, రక్తహీనతను తగ్గిస్తుంది

9. బీట్ రూట్ :

9. బీట్ రూట్ :

ఐరన్ పుష్కలంగా ఉండే బీట్ రూట్ మనందరికి తెలిసిందే. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలను ఎఫెక్టివ్ గా పెంచుతుంది. ఉదయం పరగడుపును బీట్ రూట్ జ్యూస్ ను తాగడం, బీట్ రూట్ ముక్కలను సలాడ్స్ రూపంలో భోజనం సమయంలో తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి ఉపశమనం పొందవచ్చు.

10. తేనె:

10. తేనె:

తేనె బహు ప్రయోజనకారిని , ఇది ఆరోగ్యానికి అన్నివిధాలుగా ఉపయోగపడటమే కాదు, ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో గ్రేట్ హోం రెమెడీగా దీన్ని సూచిస్తుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Foods That Help Treat Anaemia & Increase The Red Blood Cell Count

    Lack of iron and other essential vitamins can cause anaemia. Dizziness and weakness are the major symptoms of anaemia. Consuming iron-rich foods helps in fighting anaemia.
    Story first published: Wednesday, January 3, 2018, 15:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more