For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగ పిండితో కూడిన 9 అద్భుత ప్రయోజనాలు.

శెనగ పిండితో కూడిన 9 అద్భుత ప్రయోజనాలు.

|

శెనగపిండిని, సాధారణంగా భారతదేశంలో బేసన్ అని కూడా పిలుస్తారు. అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది కూడా. సౌందర్య ప్రయోజనాలకే కాకుండా, అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలకు కూడా ప్రసిద్ది చెందింది. వీటి గురించి అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ముడి లేదా వేయించిన శెనగపప్పును పొడిగా చేసి, భారతీయ వంటకాల్లో ప్రధాన ఆహార పదార్ధంగా వినియోగించడం జరుగుతుంది.

Gram Flour: 9 Health Benefits You Need To Know

శెనగపిండి వాడకం మంచిదేనా?

శెనగ పిండి గోధుమ రహిత ఉత్పత్తిగా ఉంటుంది. ఫైబర్ మరియు ఇతర పోషకాలలో అధికంగా ఉంటుంది. 100 గ్రాముల శెనగ పిండిలో, 11 గ్రా సునిసిత ఫైబర్ నిల్వలు కలిగి, 22 గ్రా ప్రోటీన్, 11 గ్రా చక్కర, 7 గ్రా కొవ్వులు, 58 గ్రా కార్బోహైడ్రేట్లు, 45 మి.గ్రా కాల్షియం, 166 మి.గ్రా మెగ్నీషియం, 846 మి.గ్రా పొటాషియం, 4.9 మి.గ్రా ఇనుము మరియు 41 IU విటమిన్-ఎ, సెలీనియం, రాగి, మాంగనీస్, ఫాస్పరస్ మరియు జింక్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటుంది.

శెనగ పిండి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

1. మధుమేహాన్ని నియంత్రిస్తుంది

1. మధుమేహాన్ని నియంత్రిస్తుంది

శెనగ పిండి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ విలువలను కలిగి ఉంటుంది. ఇది మధుమేహం తగ్గించడంలో గొప్ప ప్రయోజనాలను కలిగి ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహార పదార్ధాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేవిలా ఉంటాయి. శెనగ పిండి, మీ ఇన్సులిన్ స్థాయిలను అసమతౌల్యానికి గురికాకుండా కాపాడుతుంది. చపాతీలు లేదా పరోటాలు చేసే క్రమంలో శెనగ పిండిని ఉపయోగించవచ్చు.

2. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

2. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

శెనగ పిండి, శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో పాటు, శరీర జీర్ణశక్తిని ప్రోత్సహించే డైటరీ ఫైబర్లకు మంచి మూలంగా ఉంది. 100 గ్రా శెనగపిండిలో 846 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం, శెనగ పిండి బరువు తగ్గడంలో ఉత్తమంగా సహాయపడుతుందని తేలింది. మీ జీర్ణక్రియలు సవ్యంగా జరిగేలా చూసే, ఫైబర్ మరియు ప్రొటీన్ల ఉనికి కారణంగా బరువు తగ్గడంలో సహాయపడగలదని తేలింది. చెడు కొలెస్ట్రాల్ LDL స్థాయిలను తగ్గించడం మరియు మంచి కొలెస్ట్రాల్ HDL స్థాయిలను పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. క్రమంగా జీవక్రియలు మెరుగుపడి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో ధోక్లా మరియు చిలా వంటి శెనగ-ఆధారిత ఆహారాలు చేర్చడం మంచిదిగా సూచించబడుతుంది. అంతేకాకుండా శెనగ పిండి లేదా శెనగ పప్పు జోడించిన సలాడ్, సూప్, లేదా చాట్ తీసుకోవడం కూడా మంచిది.

Most Read:<strong>భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235</strong>Most Read:భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235

4. మానసిక స్థితులను మరియు ఆకలిని నియంత్రిస్తుంది

4. మానసిక స్థితులను మరియు ఆకలిని నియంత్రిస్తుంది

బేసన్, న్యూరల్ ట్రాన్స్మిటర్ అయిన సెరటోనిన్ సంశ్లేషణలో ముఖ్య భాగమైన విటమిన్ B6 యొక్క అద్భుతమైన మూలంగా ఉంది. సెరటోనిన్ అనేది మానసిక స్థితి మరియు ఆకలిని నియంత్రించడానికి సహాయపడే హాపీ హార్మోన్.

5. అలసటను నిరోధిస్తుంది

5. అలసటను నిరోధిస్తుంది

శక్తిని పెంచడంలో మరియు శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడే శెనగ పిండిని మీ ఆహార ప్రణాళికలో భాగంగా చేర్చడం మంచిది. ఆహారాన్ని శక్తిగా మార్చడంలో మీ శరీరానికి సహాయపడే విటమిన్ థయామిన్. శెనగ పిండి, ధయామిన్ మంచి మూలంగా ఉంది. ఇది అలసటను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

6. పెద్దప్రేగు క్యాన్సర్ నిరోధిస్తుంది

6. పెద్దప్రేగు క్యాన్సర్ నిరోధిస్తుంది

ఒక మెక్సికన్ అధ్యయనం ప్రకారం, ఇది DNA మరియు ప్రోటీన్ల ఆక్సీకరణను తగ్గించడం ద్వారా పెద్ద పేగు కాన్సర్ నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తుందని తేలింది మరియు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రధానకారకమైన ఆంకోజెనిక్ ప్రోటీన్ అయిన బీటా-కేటనిన్ పనితీరును సైతం నిలిపివేయగలదు.

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, శెనగ పిండి పెద్దప్రేగు క్యాన్సర్ను నిరోధించే సపోనైన్స్ మరియు లిగ్నన్స్ మూలకాలను కలిగి ఉంటుంది.

Most Read:నా భార్య అంగంపై ఉన్న పులిపిర్లు చూసి శృంగారంలో పాల్గొనను అంటోంది, బ్లేడ్ తో కోసేసుకోవొచ్చా?Most Read:నా భార్య అంగంపై ఉన్న పులిపిర్లు చూసి శృంగారంలో పాల్గొనను అంటోంది, బ్లేడ్ తో కోసేసుకోవొచ్చా?

7. ఎముకలను దృడంగా చేయడంలో

7. ఎముకలను దృడంగా చేయడంలో

శెనగ పిండిలో కాల్షియం మరియు ఫాస్పరస్ నిల్వలు ఉంటాయి. ఇవి ఎముకలు ఏర్పడటానికి మరియు దృడంగా తయారవడంలో సహాయపడతాయి. కావున, మీ ఆహారంలో సాధ్యమైనంత వరకు మీ ఎముకలను బలోపేతం చేయడానికి శెనగ పిండిని చేర్చుకోండి.

8. ప్రేగు కదలికలను పెంచడంలో, జీర్ణ క్రియలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది

8. ప్రేగు కదలికలను పెంచడంలో, జీర్ణ క్రియలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది

మీరు అపసవ్య ప్రేగు కదలికలు లేదా మలబద్ధకం సమస్యలతో భాదపడుతున్నట్లయితే, ఆహారంలో శెనగ పిండి వినియోగం ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో ఉన్న ఫైబర్ మలబద్ధకం లేకుండా, మృదువుగా సజావుగా స్టూల్స్ పాస్ చేయడంలో సహాయపడుతుంది. క్రమంగా జీర్ణ క్రియలను పెంచడంలో దోహదం చేస్తుంది.

9. రక్తహీనత చికిత్స

9. రక్తహీనత చికిత్స

శెనగ పిండి ఐరన్లో పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల శెనగ పిండిలో 4.9 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. క్రమం తప్పకుండా శెనగ పిండిని మీ ఆహార ప్రణాళికలో తీసుకోవడం ద్వారా, మీ శరీరంలో ఐరన్ లోపాలు రాకుండా కాపాడుతుంది. ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది.

కావున క్రమం తప్పకుండా, సరైన మోతాదులో రోజూవారీ ఆహార ప్రణాళికలో శెనగ పిండిని చేర్చుకోవడం ద్వారా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని పోషకాహార నిపుణులు మరియు వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, చర్మ సౌందర్యం విషయంలో ఎంతగానో మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది కూడా. మనకు అందుబాటు ధరలలో విపణిలో లభించే శెనగ పిండి ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలకు మూలంగా ఉంది.

Most Read:మా ఆయన శృంగారం స్టార్ట్ చేస్తే ఆపడు, ఇక చాలండీ అంటే వినడు, ఎలా తట్టుకోవాలి?

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Gram Flour: 9 Health Benefits You Need To Know

Gram flour or besan is a wheat-free product rich in dietary fibre and nutrients. 100 g of besan flour has 11 g dietary fibre, 22 g protein, 11 g sugar, 7 g total fats, 58 g total carbohydrates, 45 mg calcium, 166 mg magnesium, 846 mg potassium, 4.9 mg iron and 41 IU vitamin A. It has various benefits from losing weight and promoting heart health to controlling diabetes
Desktop Bottom Promotion