For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరైన జీర్ణక్రియలకు సరైన ఆహార పదార్ధాలు

సరైన జీర్ణక్రియలకు సరైన ఆహార పదార్ధాలు

|

మంచి జీర్ణశక్తికి మరియు ఉదర సంబంధ సమస్యల నివారణకు సూచించదగిన ఆహార పదార్ధాలు:

ఆరోగ్యం అనగానే మొట్టమొదటగా కీలకపాత్ర పోషించేది జీర్ణక్రియ. ఒక్క జీర్ణవ్యవస్థ శరీరంలోని అన్ని అవయవాల పనితీరుమీద ప్రభావాన్ని చూపగలదు. కావున జీర్ణవ్యవస్థకు చక్కగా సహాయపడే ఆహారపదార్థాలను ఆహార ప్రణాళికలో చేర్చవలసిన అవసరం ఉంటుంది.

ఈ వ్యాసం మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, హృదయ స్పందనలు, క్రోన్స్, గ్యాస్ట్రో యశోఫగెల్ రిఫ్లెక్స్ వ్యాధి మొదలైన సమస్యల నుండి బయటపడేందుకు దోహదం చేసే ఆహార పదార్ధాల గురించిన వివరాలను తెలియజేసేందుకు సహాయం చేస్తుంది.

best foods to improve digestion

జీర్ణక్రియకు దోహదపడే ఆహారపదార్థాలు తీసుకోవడం వలన జీర్ణంకాని ఆహార పదార్థాలను జీర్ణమయ్యేలా చేయడంలో సహాయపడగలవు.

తద్వారా మీ శరీరం అన్ని రకాల పోషకాలను పూర్తిస్థాయిలో సంగ్రహించి కణాల మరమ్మత్తులో సహాయపడగలదు. క్రమంగా శక్తిని పొందడం ద్వారా శరీరంలోని అంతర్గత అవయవాల పెరుగుదల కూడా ప్రోత్సహిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపరచడానికి తీసుకోదగిన ఆహారపదార్థాల జాబితా:

ఆపిల్ :

ఆపిల్ :

యాపిల్స్ పెక్టిన్ అని పిలిచే ఒక సున్నితమైన ఫైబర్ యొక్క గొప్ప మూలంగా ఉంది. ఈ ఫైబర్ స్నేహపూర్వక బాక్టీరియా(యూబాక్టీరియమ్ ఎలిజెన్స్ అండ్ లాక్నోస్పిరా పెక్టినోస్చిజా) సహాయంతో పెద్దప్రేగులో సులభంగా జీర్ణమవుతుంది. మలం యొక్క వాల్యూమ్ పెరుగుట, మలబద్ధకం మరియు అతిసారవ్యాధులను అడ్డుకోవడం ద్వారా ప్రేగుల కదలికను మెరుగుపరచడంలో పెక్టిన్ సహాయం చేస్తుంది. అంతేకాకుండా పెద్దపేగులో ఎంజైములను పెంచడం ద్వారా, జీర్ణక్రియలు సజావుగా సాగునట్లు చేసి, క్రమంగా వాపు, సంక్రమణ రోగాలు రాకుండా కూడా అడ్డుకోగలదు.

యోగర్ట్ :

యోగర్ట్ :

యోగర్ట్ , ప్రోబయోటిక్స్ లేదా స్నేహపూరితమైన బ్యాక్టీరియాతో కలిసి జీర్ణక్రియనును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్రమంగా ఉబ్బరం, అతిసారం, మలబద్దక సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. యోగర్ట్ లోని లాక్టోస్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

సోపు :

సోపు :

జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సోపులోని ఫైబర్ ఎంతగానో సహాయం చేస్తుంది. అంతేకాకుండా వికారం, అపానవాయువులు మొదలైన సమస్యలను నివారించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అందుచేతనే అనేకమంది భోజనం చేశాక, కొంత సోపును తినడం లేదా ఆహారంలో భాగంగా చేసుకోవడం చేస్తుంటారు.

బొప్పాయి :

బొప్పాయి :

బొప్పాయిలో పపైన్ అని పిలువబడే జీర్ణక్రియలకు దోహదపడే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి ప్రేగు సిండ్రోమ్ (IBS) సంబంధిత అసౌకర్యాల నుండి కాపాడుతుంది.

అల్లం:

అల్లం:

కడుపు నుండి చిన్న ప్రేగులకు ఆహారాన్ని తరలించడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి అల్లం ఎంతగానో సహాయం చేస్తుంది. కడుపులో వికారాలను నిరోధించడంలో సహాయపడుతుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

రెడ్ బీట్స్:

రెడ్ బీట్స్:

మీరు, జీర్ణక్రియ వ్యవస్థను సహజ మార్గంలో పెంచుకోవాలనుకుంటే, రెడ్ బీట్స్(ఎరుపు దుంపలు లేదా బీట్ రూట్స్) సహాయం చేస్తాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, మలబద్ధకం మరియు కడుపునొప్పిని తగ్గించటానికి అద్భుతంగా సహాయం చేస్తాయి. ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం నిక్షేపాలు అధికంగా ఉంటూ జీర్ణక్రియలో సహాయపడతాయి.

బీట్ గ్రీన్స్:

బీట్ గ్రీన్స్:

బీట్రూటు మీదనున్న ఆకులు మీ కడుపుకు ఉపశమనం కలిగించుటలో మరియు అజీర్ణం తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతాయి. క్రమంగా జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. ఈ బీట్ గ్రీన్స్ బీటా-కెరోటిన్, కాల్షియం మరియు ఇనుములో అధికంగా ఉంటుంది. ఈ పోషకాలు ఒక ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడంలో సహాయపడతాయి మరియు ప్రేగుల కదలికను సరిచేయడానికి సహాయపడతాయి.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

జీర్ణశక్తికి సూచించదగిన ఉత్తమ ఆహారాలలో అరటిపండ్లు కూడా ఒకటి. అరటిపండ్లు ప్రధానంగా అతిసారం మరియు మలబద్దక సమస్యలను నిర్వహించడానికి సహాయపడుతాయి. జీర్ణక్రియ ప్రక్రియను పెంచే ఎలెక్ట్రోలైట్స్ మరియు పొటాషియం నిల్వలలో ఇవి పుష్కలంగా ఉంటాయి.

చిలగడదుంపలు:

చిలగడదుంపలు:

వీటిని చర్మం లేదా తొక్కతో పాటుగా తీసుకోవడం ద్వారా మీ జీర్ణప్రక్రియ మెరుగుపరచడానికి ఉత్తమంగా ఉంటాయి. ఇవి కూడా కడుపు మరియు ప్రేగు పూతల సమస్యలను నయం చేయడంలో సహాయం చేస్తాయి. క్రమంగా మీ ఆకలి పెరుగుతుంది మరియు ప్రేగు ప్రకోపాల సిండ్రోమ్ సమస్యను ప్రభావవంతముగా ఎదుర్కొనగలదు.

ఓట్స్:

ఓట్స్:

ఇవి రెండు రకాల ఫైబర్(కరిగే మరియు కరగని ఫైబర్స్) నిక్షేపాలతో పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ ఖనిజాలను మరియు విటమిన్-ఇ ని ప్రధానంగా కలిగి ఉంటుంది. ఓట్స్ మీ జీర్ణశక్తిని మెరుగుపరచే ఉత్తమ ఆహారాలలో ఒకటి. ఇవి మీ కడుపును మరియు ప్రేగులను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుతూ, మలబద్ధక సమస్యలు లేకుండా చూస్తుంది.

కావున రోజులో అల్పాహారంగా కానీ, స్నాక్స్ రూపంలో కానీ, ఓట్స్ తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడినది. ఓట్స్ పాలలో, లేదా వేడి నీటిలో ఉడికించి తీసుకోవచ్చు. రుచికోసం, తృణ ధాన్యాలు, తేనె, రస్క్స్ వంటివాటిని జోడించి తీసుకోవచ్చు. దీనిలోని ఫైబర్ నిక్షేపాలు, కడుపు నిండుగా ఉండునట్లు చేసి ఆహారం మీదకు ఎక్కువగా మనసు వెళ్ళకుండా చేయగలదు. క్రమంగా ఊబకాయం తగ్గుటలో కూడా ప్రభావాన్ని చూపుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

best foods to improve digestion

Here are 19 foods which you should include in your diet to improve digestion. These foods help in increasing the population of friendly gut bacteria. Apple, kefir, yogurt, fennel, chia seeds, papaya, peaches, bananas, avocados, sweet potatoes, etc., are some foods which you should include in your diet to improve your gut health and digestion.
Story first published:Thursday, August 23, 2018, 12:58 [IST]
Desktop Bottom Promotion