రోజూ ఒక్క గుడ్డూ తినడం లేదా? పచ్చి గుడ్డు తింటే ఏమవుతుంది? ప్రతి మగాడు రోజుకొక పచ్చిగుడ్డు తినాలి!

Written By:
Subscribe to Boldsky

మనం రోజూ ఏవేవో తింటూ ఉంటాం. కొందరు పిజ్జాలు, బర్గర్లు అంటూ నమిలేస్తుంటారు. సరే ఎవరి ఆనందం వారిది. నాలుకకు కూడా కాస్త రుచినివ్వాలని ఒక్కొక్కరు ఒక్కోరకం ఆహారాన్ని తింటారు. జిహ్వకు రోజుకొక రుచిని ఇస్తుంటారు. ఇన్ని తింటున్న మీరు గుడ్డును ఎందుకు తినడం లేదు.

గుడ్డులో కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కూడా ఉంటాయి. రెండు పచ్చిగుడ్ల తీసుకుంటే ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో మీకు తెలుసా? ఒక యాపిల్‌లో కన్నా దాదాపు రెండింతలు ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు అందులో ఉంటాయి.

యాంటీఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి

యాంటీఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి

గుడ్డును ఉడికించినా లేదంటే ఆమ్లెట్ వేసినా అందులోకి యాంటీఆక్సిడెంట్స్ మాత్రం తగ్గిపోతాయి. అయినా యాపిల్‌ తింటే ఎంత శక్తి వస్తుందో గుడ్ల ద్వారా కూడా అంత ఎనర్జీ రావడం కాస్త విశేషమే కదా.

ప్రయోజనం ఏమిటి

ప్రయోజనం ఏమిటి

సరే గుడ్డు తింటాం.. యాంటీఆక్సిడెంట్లు పొందుతాం. మరి యాంటీఆక్సిడెంట్లు ద్వారా ప్రయోజనం ఏమిటని అనుకుంటున్నారా? ఫ్రీరాడికల్స్‌ అనే వాటిపై యాంటీఆక్సిడెంట్లు పోరాడగలవు.

పదిలంగా ఉంచుకోండి

పదిలంగా ఉంచుకోండి

యాంటీఆక్సిడెంట్లు గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి వాటి బారినపడకుండా కాపాడతాయి. ఇక నుంచి రోజుకొక రెండు పచ్చి గుడ్లను తినండి. గుండెజబ్బుల బారిన ఎక్కువగా మగవారే పడుతుంటారు. అందువల్ల ప్రతి మగవారు రోజుకొక్క పచ్చి గుడ్డును అయినా తినాలి. ఇలా మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి. చాలా మంది గుడ్డులో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. దీంతో వాటిని తినకుండా ఉంటారు.

చాలా చవక

చాలా చవక

గుడ్డుతో చాలా ప్రయోజనాలున్నాయి. వాటన్నింటి గురించి తెలుసుకుంటే కచ్చితంగా మీరు రోజూ గుడ్డు తింటారు. గుడ్డు రేట్ కూడా పెద్దగా ఉండదు. చాలా చవకగా ఉంటుంది. గుడ్డు లో విటమిన్‌-సి, పీచు పదార్థం ఈ రెండూ తప్పించి మిగతా అన్ని పోషకాలూ, అన్ని విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి.

కలుషితం కాదు

కలుషితం కాదు

మార్కెట్లో లభించే అన్ని ఆహారాలు కలుషితం కావొచ్చేమోగానీ గుడ్డు మాత్రం కలుషితం కాదు. గుడ్డు పైన గట్టి పెంకు ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఇది కలుషితం కాదు. అలాగే నకిలీ గుడ్లు తయారు చేయడం కూడా కాస్త కష్టమే.

ఉడికించి గుడ్డు

ఉడికించి గుడ్డు

ఒక్క గుడ్డు తినగానే కాస్త కడుపు నిండినట్లు అనిపిస్తుంది. గుడ్డు తిన్న తర్వాత అంతగా ఆకలి వేయదు. ఉడికించి గుడ్డు చాలా మంచిది. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలూ ఇందులో ఎక్కవుగా ఉంటాయి. రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు.

శరీరానికి ఉపయోగపడుతుంది

శరీరానికి ఉపయోగపడుతుంది

ఇక మనం రోజూ రకరకాల ఆహారాలు తీసుకుంటాం కదా. అవి జీర్ణమై వాటిని మన శరీరం గ్రహించి, వినియోగించుకునే క్రమంలో చాలా వ్యర్థాలు బయటకుపోతాయి. కానీ గుడ్డు మాత్రం నూటికి నూరు శాతం మన శరీరానికి ఉపయోగపడుతుంది. మరే ఆహార పదార్థం ఇంత మంచి లాభాల్ని ఇవ్వదు.

మూడు అత్యవసర అమైనో ఆమ్లాలు

మూడు అత్యవసర అమైనో ఆమ్లాలు

గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే గుడ్డులోని మాంసకృత్తులు అమైనో ఆమ్లాలనే ధాతువులతో తయారై ఉంటాయి. సుమారు 20 రకాల అమైనో ఆమ్లాలు కలిస్తే ప్రోటీన్లు తయారవుతాయి. వీటిలో మూడు అత్యవసర అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. బయటి నుంచి ఆహారం ద్వారానే గ్రహించాల్సి ఉంటుంది.

కండరాలు క్షీణించకుండా

కండరాలు క్షీణించకుండా

అత్యవసర అమైనో ఆమ్లాలతో పాటు అమైనో ఆమ్లాలు గుడ్డులో బాగా ఎక్కువగా ఉంటాయి. అందుకే గుడ్డులోని ప్రోటీన్లను సంపూర్ణ మాంసకృత్తులంటారు. ఎదిగే పిల్లలకు అన్నం, పప్పుతో పాటు పాలు, గుడ్డు కూడా అందివ్వాలి. ఇక పెద్దవారిలోనూ ప్రోటీన్‌ కండరాలు క్షీణించకుండా గుడ్డు చాలా ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్‌ల తయారీకి కూడా ప్రోటీన్లు అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ అంటే పెద్దవాళ్లు కూడా రోజుకొక గుడ్డు తినాలి.

ఆరు గుడ్లు తినాలి

ఆరు గుడ్లు తినాలి

చాలామంది వారానికి ఒక గుడ్డు కూడా తినరు. అయితే వారానికి కనీసం ఐదు నుంచి ఆరు గుడ్లు తినాలి. ఇక పిల్లలు, గర్భిణులు కచ్చింగా రోజుకు ఒక గుడ్డు తినాలి. గర్భం దాల్చినప్పుడు, ప్రసవం పూర్తి కాగానే, పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఇలా ప్రతి దశలో స్త్రీలకు గుడ్డు తినండం చాలా మంచిది.

ఉడికించిన పచ్చసొన

ఉడికించిన పచ్చసొన

చిన్నపిల్లలకు గుడ్డు ఏ వయస్సులో నుంచి తినిపించాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. పిల్లలకు ఆరేడు నెలలకు ఘనాహారం పెట్టటం ప్రారంభిస్తారు. కాబట్టి 7 నుంచి 8 నెలల నుంచి ఉడికించిన పచ్చసొన తినిపించొచ్చు. దీనివల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. పిల్లలకు కావాల్సిన పోషకాలూ మొత్తం అందులో లభిస్తాయి. ఇక పిల్లలకు ఏడాది నిండే సరికి పూర్తి గుడ్డు మెత్తగా చేసి తినిపించొచ్చు.

గుడ్డుపైన పెంకు రంగు

గుడ్డుపైన పెంకు రంగు

ఇక కొందరు నాటుకోడి గుడ్లు తింటే మంచిదా? లేదంటే ఫారం కోడి గుడ్లు తింటే మంచిదా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఏ గుడ్డులో అయినా పోషకాలు ఒకటే ఉంటాయి. వాటిలో తేడా ఏమీ ఉండదు. కొందరు గుడ్డుపైన పెంకు రంగు చూసి అనుమానపడుతుంటారు. పెంకుకు గుడ్డులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదు.

నాటు కోడి గుడ్డు

నాటు కోడి గుడ్డు

ఇక నాటు కోడి గుడ్డు తింటే మంచిదని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నాటు కోడి గుడ్డు సైజు చిన్నగా ఉంటుంది. బరువు తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి అందే పోషకాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఫారం గుడ్డు పెద్దదిగా ఉంటుంది కాబట్టి దాన్ని నుంచి అందే పోషకాలు అధికంగా ఉంటాయి. ఫారం కోడికి గుడ్లలో అదనంగా విటమిన్‌-డి కూడా ఉంటుంది.

ఉడికించి తింటే చాలా ప్రయోజనాలు

ఉడికించి తింటే చాలా ప్రయోజనాలు

గుడ్డును పచ్చిగా తింటే కొన్ని రకాల లాభాలే ఉండొచ్చు. కానీ గుడ్డును ఉడికించి తింటే చాలా ప్రయోజనాలుంటాయి. గుడ్డు తెల్లసొనలో ఎవిడిన్‌ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది. పచ్చిగా తింటే ఇది బయోటిన్‌తో కలిసిపోయి దాన్ని శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంటుంది. గుడ్డును ఉడకబెడితే అది బయోటిన్‌ నుంచి విడిపోతుంది. గుడ్డులో ట్రిప్సిన్‌ అనే ఎంజైమ్‌ను పనిచేయకుండా చూసే నిరోధకం కూడా ఉంటుంది. ఉడకబెడితే ఇది కూడా వెళ్లిపోతుంది. రోజూ గుడ్డును తినాలంటే ఉడికించుకుని తింటేనే మంచిది.

పచ్చసొన తినాలా వద్దా?

పచ్చసొన తినాలా వద్దా?

చాలామంది పచ్చసొన తినాలా వద్దా అని అనుకంటూ ఉంటారు. తెల్లసొన మాత్రమే తింటుంటారు. ఒక గుడ్డులో 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా కొలెస్ట్రాల్‌ను నేరుగా రక్తంలో కలవకుండా చూసే లెసిథిన్‌ వంటి రసాయనాలూ గుడ్డులో ఉంటాయి. కాబట్టి గుడ్డుతో సమస్య ఉండదు.

కొలెస్ట్రాల్‌ పెరుగుతుందన్న భయంతో గుడ్డు మానేయ్యాల్సిన అవసరం లేదు.

పచ్చసోనను తినండి

పచ్చసోనను తినండి

గుడ్డులోని తెల్లసొనలో 90% నీరు ఉంటుంది. మిగిలిన 10%లో అల్బుమిన్‌, గ్లోబులిన్‌ వంటి ప్రోటీన్లు, కొద్దిగా రైబోఫ్లావిన్‌ (బీ2) కూడా ఉంటాయి. పోషకాలూ బాగా ఎక్కువగా ఉండేది పచ్చసొనలోనే. మాంసకృత్తులు, కొవ్వు, ఎ-డి-బి12 వంటి రకరకాల విటమిన్లు, ఫోలిక్‌యాసిడ్‌, క్యాల్షియం, ఇనుము, జింకు, సెలీనియం అనే యాంటీఆక్సిడెంటు వంటివన్నీ పచ్చసోనలో ఉంటాయి. అందువల్ల పచ్చసోనను కూడా లిమిట్ గా తినండి.

వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యకరంగా పెరగటానికి

వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యకరంగా పెరగటానికి

గుడ్డులో క్యాల్షియం ఉంటుంది. రైబోఫ్లావిన్‌ (విటమిన్‌ బి2) ఉంటుంది. ఎదుగుదలకు, చర్మం ఆరోగ్యానికి, ఆహారం సరిగా జీర్ణం కావటానికి ఈ రైబోఫ్లావిన్‌ చాలా అవసరం. అలాగే మెదడు, నాడీవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన ఖొలీన్‌ వంటివీ గుడ్డులో ఉంటాయి. వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యకరంగా పెరగటానికి అవసరమైన బయొటిన్‌ ఉంటుంది.

కనీసం ఒక్క గుడ్డు అయినా తినండి

కనీసం ఒక్క గుడ్డు అయినా తినండి

ఇలా గుడ్డు ద్వారా పోషకాహారం అందండంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవొచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి కనీసం ఒక్క గుడ్డు అయినా తినండి. యాంటీఆక్సిడెంట్స్ కోసం మాత్రం పచ్చిగుడ్లను మాత్రం లిమిట్ లో తీసుకోండి. ఉడికించినవి కాస్త బాగానే తినండి. పచ్చసోన కూడా లిమిట్ లో తీసుకోవొచ్చు.

English summary

the health benefits of eggs

the health benefits of eggs
Story first published: Saturday, April 21, 2018, 13:15 [IST]