For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేదవాడి బడ్జెట్లో, పెద్దింటివారు తినేంతటి నాణ్యమైన పోషకాహారం తినడం సాధ్యమేనా?

|

నెలాఖరు రోజుల్లో, మనలో చాలామంది పర్సుల్లో డబ్బుల బరువు తగ్గిపోతుంది. నెల మొదట్లో ఆహారం మీద ఖర్చుపెట్టినట్లు, చివర్లోకి వచ్చినప్పటికి పెట్టలేము. అటువంటి సందర్భంలో ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే, ఆరోగ్యం విషయంలో ఏ విధంగా కూడా రాజీ పడకుండా, మంచి ఆహారం ఎలా తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పేదవాడి బడ్జెట్లో, పెద్దింటివారు తినేంతటి నాణ్యమైన పోషకాలు తినడం సాధ్యమేనా? తెలుసుకోండి ఇప్పుడు!

నిజానికి ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలతో పోల్చిచూస్తే, జంక్ పదార్ధాలను తినడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలు, చాలా ఖరీదైనవి అయ్యి ఉంటాయనే అపోహ కలిగి ఉంటారు. ఇది ఎల్లప్పుడూ నిజం కాదు. మీ డబ్బును తెలివిగా ఆరోగ్యకరమైన ఆహారం పై ఖర్చు పెట్టండి.

అదెలాగంటే.......

మాయా లేదు.. మర్మం లేదు.. ఈ పద్ధతులను పాటించండి. పేదింటి ఖర్చుతో మంచి తిండి తినండి:

1. తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోండి.

1. తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోండి.

శుద్ధి చేయబడిన (రిఫైన్డ్ ) ధాన్యాల కన్నా పూర్తి తృణధాన్యాలు తీసుకోవడం మంచిది, ఎందుకంటే తృణధాన్యాలు పీచుపదార్ధంతో నిండి ఉన్నందువల్ల, మీరు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. ఓట్ మీల్, గోధుమ బియ్యం, జొన్న, సజ్జ, బార్లీ, బక్వీట్ వంటి తృణధాన్యాలు, వీటితో తయారు చేయబడిన సంపూర్ణ గోధుమ రొట్టె, పాస్తా లేదా క్రాకర్లు వంటివాటిని ఒకేసారి కొనుగోలు చేసి, నిల్వ చేయవచ్చు. ఇలా చేస్తే, మీ డబ్బు ఆదా అవుతుంది మరియు మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

2. చవకైన ప్రోటీన్లను తినండి.

2. చవకైన ప్రోటీన్లను తినండి.

ప్రతిరోజు మాంసం తినాలంటే, మీ బడ్జెట్ పెరిగిపోతుంది. కాని ప్రతి రోజు మాంసం తినకుండానే మీ దైనందిన ప్రోటీన్ అవసరాలను తీర్చవచ్చు. మీరు బీన్స్, గుడ్లు, సోయా, పనీర్, మరియు పాలు వంటి ప్రోటీన్ కలిగి ఉన్న కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవచ్చు .

 3. అల్పాహారం ఇంటిలోనే తినండి.

3. అల్పాహారం ఇంటిలోనే తినండి.

ప్రతిరోజు హోటళ్ళలో తయారైన అల్పాహారం తింటే, మీ జేబులో ఖాళీ అవుతుంది. దానికి బదులుగా, మీ రోజును సరైన పద్ధతిలో మొదలుపెట్టడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోండి. ఓట్ మీల్, ఉడికించిన గుడ్లు మరియు ఒక అరటిపండుతో కూడిన సమతుల అల్పాహారం తినడం వల్ల మీ డబ్బు ఆదా కావడంతో పాటు మీ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

4. మీ భోజనాన్ని మీరే సిద్ధం చేసుకోండి.

4. మీ భోజనాన్ని మీరే సిద్ధం చేసుకోండి.

మీ ఇంటి చుట్టుపక్కల ఎంత ఆరోగ్యకరమైన రెస్టారెంట్లు ఉన్నా, అవి అందించే ఆహారం, మీ ఇంట్లో తయారు అయిన ఆహారం కన్నా ఆరోగ్యంగా మరియు చవకగా ఉండవు. ఎందుకంటే, నిజంగా వారు చెప్పుకునేటట్లు, రెస్టారెంట్లలో తయారయ్యే ఆహారపదార్థాలు యొక్క నాణ్యత ఎంతుంటుందో మనకు తెలియదు.

5. మద్యపానం బదులు మంచి నీళ్ళ పానం చేయండి.

5. మద్యపానం బదులు మంచి నీళ్ళ పానం చేయండి.

మద్యం సేవించడం అంటే, మీ అనారోగ్యాన్ని మీరే డబ్బులు వెదజల్లి కొనుక్కుంటున్నట్లే! మద్యం లేదా క్రీడా పానీయాలు లేదా సోడా కలిగి ఉండే పానీయాలలో ఎటువంటి పోషకాలు ఉండవు, పైగా మీరు సులభంగా బరువు పెరుగుతారు. మీ శరీరానికి అవసరం ద్రవం, కేవలం మంచి నీరు మాత్రమే! వీటిని తాగడం వలన మీ ఖర్చుతో పాటు మీ నడుము కూడా చిక్కిపోతుంది.

పేదవాడి ఆహార ప్రణాళిక:

పేదవాడి ఆహార ప్రణాళిక:

ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికలో ఈ క్రింది పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి.

1. పొద్దుట అల్పాహారంలో, హోల్ వీట్ టోస్ట్ బాగా ఉడికించిన గుడ్లు, మరియు ఒక అరటి పండు .

2. భోజన సమయంలో, తేలికైన ప్రోటీన్లు కలిగిన ఆహారం, తాజా ఆకు కూరలు, క్యారట్లు మరియు రాజ్మా .

3. సాయంత్రం చిరుతిండిగా, మీకు నచ్చిన తాజా పండ్లు.

4. రాత్రి కొరకు, బంగాళదుంపలు మరియు తాజా పెరుగుతో కూరగాయలు లేదా చికెన్ తో తయారు చేసిన ఇగురుతో కూడిన కూర.

పేదవాడి ఆహార మార్గదర్శకాలు:

పేదవాడి ఆహార మార్గదర్శకాలు:

1. కొవ్వులు, మాంసకృత్తులు మరియు కార్బోహైడ్రేట్ల వంటి స్థూల-పోషకాలపై దృష్టి పెట్టండి.

2. మీరు సులభంగా మీ క్యారేజీలో సులభంగా తీసుకువెళ్లగలిగే ఆహార పదార్థాలు మీద దృష్టి పెట్టండి.

3. ఎప్పుడు చౌకగా దొరికే ఆరోగ్యకరమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. రిఫ్రిజిరేటర్ లో ఎక్కువకాలం నిలువ చేసుకోగలిగే ఆహార పదార్థాలను కొనుగోలు చేయండి.

English summary

What's The Healthiest Poor Man’s Meal To Eat Every Day?

In the last few days of the month, most of us will be on a tight budget and the poor man's meal is the only choice that we have. That doesn't mean you have to compromise on your health. Here we will discuss the healthiest foods that are part of the poor man's meal.
Story first published: Sunday, August 12, 2018, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more