For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బఠానీ గింజలతో బఠాణీ-పాలు(పీ-మిల్క్) : డైరీప్రొడక్ట్స్ కు ప్రత్యామ్నాయంగా ఎంత వరకు సూచించవచ్చు?

|

మారుతున్న కాలానుగుణంగా, పాడి పదార్ధాలలోని సమ్మేళనాల కారణంగా ప్రయోజనాలతో పాటు, కొందరు ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కొంటున్న నేపధ్యంలో, ఈ పాడి ఆధారిత పదార్ధాల విషయంలో వైద్యుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భాగంగా పాడి పదార్ధాలకు ప్రత్యామ్నాయంగా బియ్యం, సోయా, గింజలు, కొబ్బరి, జనపనార విత్తనాల పాలు మొదలైనవి అనేకం మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆ క్రమంలో భాగంగానే బఠానీ గింజలతో పీ-మిల్క్, పూర్తి శాకాహార సమ్మేళనాలతో, లాక్టోజ్ రహితంగా మరియు గ్లూటెన్ రహితమై నెమ్మదిగా ప్రజాదరణ పొందుతూ ఉంది.

ఈ పాలు, మొక్క ఆధారిత పాలుగా, పసుపు బఠాణీ గింజల ద్వారా తయారు చేయబడుతుంది. ప్రాసెస్ చేయబడిన బఠానీ గింజల నుండి పిండి పదార్ధాలను, ఫైబర్ను తొలగించి ప్రోటీన్ వేరు చేసి తయారు చేయబడిన పాలు ఇవి. తరచుగా సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉండే ఈ బఠానీ పాలలో కొన్ని రకాల ఫ్లేవర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ రుచీ లేనివిగా కొన్ని ఉంటే, కొన్ని స్వీట్, వెనిలా మరియు చాక్లెట్ రుచులలో లభిస్తున్నాయి. మరియు ఎక్కువ విటమిన్లతో సమృద్ధిగా ఉండే ఈ బఠాణీ పాలు, ఒక ఆరోగ్యకరమైన మరియు పాడి పదార్ధాలకు ప్రత్యామ్నాయంగా ఉందని నిపుణులు సైతం సూచిస్తున్నారు. అసలు, ఏమిటీ బఠానీ పాలు? మరియు అది చేకూర్చే ప్రయోజనం ఏమిటి? సంబంధిత వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

బఠాణీ పాలు:

బఠాణీ పాలు:

బఠాణీ పాలు, పాడి పదార్ధాలకు సంబంధం లేని మొక్క ఆధారిత పసుపు బఠాణీల నుండి వేరు చేసిన ప్రోటీన్ పాలగా ఉంటుంది. పూర్తిగా పాడి పదార్ధాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇక ప్రోటీన్లో డైరీ పాలతో సమానంగా ఉంటూ, కాలరీలలో తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, DHA, ఒమేగా -3 ఫాటీయాసిడ్స్, ఐరన్ మరియు విటమిన్ D లను కూడా కలిగివుంటాయి. క్రమంగా మంచి ఆరోగ్యాన్ని, జీవక్రియలను ప్రోత్సహిస్తాయి. ఇది ఒక ఉత్తమమైన మరియు మట్టి రుచిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా సిల్కీ, క్రీమీ, మరియు భారీ ఆకృతి లేనిదిగా ఉంటుంది. ఈ పాలలో బఠాణీ రుచి కనిపించకపోవడం ఆశ్చర్యకరం.

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

బఠాణీ పాలలో ఆవు పాలతో సమానంగా ప్రోటీన్లను కలిగి ఉంటుంది. క్రమంగా ఇది మంచి శక్తిని అందించేదిగా, మరియు ఎక్కువ సేపు కడుపును నింపి ఉండేలా చూస్తుంది. క్రమంగా ఎక్కువసేపు ఆకలిని దరిచేరకుండా చూస్తుంది.

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

ఈ బఠాణీ పాలు పాడి పదార్దాల వలన కలిగే కొన్ని సామాన్యమైన అలెర్జీలకు దూరంగా ఉంటుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేనిదిగా ఎవ్వరైనా అనుసరించగలిగేలా ఉంటుంది. పూర్తిగా పాడి పదార్ధాలకు ప్రత్యామ్నాయంగా మొక్క ఆధారిత గ్లూటేన్ రహిత పదార్ధంగా ఉంటుంది. లాక్టోస్ మరియు లేదా గింజల అలెర్జీ ఉన్న వారు నిస్సంకోచంగా ఈ బఠాణీ పాలకు మారవచ్చు. పైగా ఆరోగ్యకరమైన జీవక్రియలను ప్రోత్సహిస్తుంది.

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

మీకు బఠాణీ గింజలు నచ్చకపోయినా అనుసరించవచ్చు. ఎందుకంటే, దీనిలో ఎటువంటి బఠాణీ రుచి, రంగు లేదా వాసన ఉండవు. దీనికి కారణం, ఇందులో పిండి పదార్ధాలను మరియు ఫైబర్ తొలగించి కేవలం ప్రోటీన్తో మాత్రమే ఈ బఠాణీ పాలను చేయడం జరుగుతుంది.

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

కొన్ని అధ్యయనాల ప్రకారం, బాదం పాల ఉత్పత్తి సంబంధిత వ్యర్ధాలు కర్భనభరితమై పర్యావరణానికి సైతం హాని కలిగించవచ్చు, బటానీలు, చిక్పీస్ మరియు బీన్స్ వంటి గింజలు మరియు ఇతర పప్పుధాన్యాలు తక్కువ కార్బన్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ బఠాణీ పాలు, పాడి ఆధారిత పాల కన్నా తక్కువ నీటిని తీసుకుంటాయి. మరియు, వీటి వ్యర్ధాలు మట్టికి తిరిగి పోషకాలను అందించే గుణాలను కలిగి ఉంటాయి.

ఇది పాడి ఆధారిత పాల కన్నా, తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు బరువు కోల్పోవాలని భావిస్తున్న ఎడల, మీరు మీ ఆహార ప్రణాళికలో చేర్చదగిన ఉత్తమ పదార్ధంగా ఉండగలదు.

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

బఠాణీ పాల యొక్క ప్రయోజనాలు :

ప్రతిపాదనలు:

పాడిరహిత ప్రత్యామ్నాయాలు కొంచం ఖరీదు ఎక్కువగా ఉంటాయి.

ప్రోటీన్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరుగా ఉన్నప్పటికీ, పాడి ఆధారిత పాలలో ఉన్నన్ని పోషకాలను కలిగి ఉండదు. కానీ పాడి పదార్ధాలతో అలర్జీలు ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా సూచించదగిన ప్రత్యామ్నాయంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

ఈ పాడిరహిత ప్రత్యామ్నాయానికి మారడానికి ముందుగా, ఒక పౌష్టికాహార నిపుణుని సంప్రదించండం మేలు. క్రమంగా ఒక కొత్త రుచిని ఆస్వాదించండి.

English summary

What is pea milk? Why You Should Try?

Pea milk is rich in proteins and calcium content. This is a dairy alternate that keeps up with the other variants such as almond and soy milk. Pea milk does not contain sugar and provides 50 per cent more calcium than the normal milk. Pea milk is low in calories and loaded with nutrients such as iron, calcium, omega-3 fatty acids and potassium.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more