For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీరంలోని విషపదార్ధాలను బయటకు నేట్టేసే క్యారెట్, పాలకూర మరియు నిమ్మరసం పానీయం

|

శరీరం లోపల పేరుకున్న విషపదార్థాలున చర్మంపై దద్దుర్లు, మొటిమలు మరియు అలసట వంటివి కలుగజేస్తాయి. ఈ విషపదార్థాలను కాలేయం, మూత్రపిండాలు మరియు ప్రేగులు, మనం తాగే నీరు వంటి ద్రవాలను ఉపయోగించుకోవడం ద్వారా తొలగిస్తాయి. అటువంటి పానీయాలలో క్యారట్, పాలకూర మరియు నిమ్మరసం పానీయం ఒకటి.

ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం, కాలేయం, మూత్రపిండాలు మరియు ప్రేగులు శుభ్రపరుస్తుంది.

Why It Is Important To Remove Toxins From The Body?

శరీరం నుండి విషాన్ని తొలగించడం ఎందుకు ముఖ్యం ?

మన శరీరంలో విషాలు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఈ కింద ఇవ్వబడ్డాయి:

. మద్యపానం మరియు ధూమపానం

. ఒత్తిడి మరియు ఆందోళన

. పర్యావరణ కాలుష్యంమద్యం మరియు పొగాకు

. ఒత్తిడి మరియు ఆందోళన

. పర్యావరణ కాలుష్యం

. పురుగుమందుల వంటి రసాయనాలు మొదలైనవి.

. ఆర్సెనిక్, పాదరసం, సీసం, మొదలైన భారీ లోహాలు

1. క్యారెట్

1. క్యారెట్

క్యారట్లలో, బీటా-కెరోటిన్, ఫోలిక్ ఆమ్లం, ఫాస్పరస్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి కనుక ఇది పునరుజ్జీవ ఆహారంగా పనిచేస్తుంది. విటమిన్ ఎ ఉన్నందున, ఈ నారింజ-రంగు కూరగాయని శక్తివంతమైన డిటాక్సిఫైయర్గా పనిచేస్తుంది. ఇది విష కారకాలను నాశనం చేస్తుంది.

శరీర pH సమతుల్యతను నిర్వహించడం ద్వారా, క్యారెట్లు శరీరాన్ని ఆల్కలైజ్ చేయడానికి కూడా సహాయపడతాయి. ఇవి మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. మీ చర్మం మరియు జుట్టు యొక్క అందాన్ని పెంచుతాయి.

2. పాలకూర

2. పాలకూర

ఈ ఆకుపచ్చ ఆకు కూరలో ఉండే పిగ్మెంట్లు, కాలేయం యొక్క నిర్విషీకరణకు అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూర ఒక మూత్రవిసర్జకంగా, ఒక విరేచనకారిగా మరియు ఒక ఆల్కలైజర్ గా పరిగణించబడుతుంది. దీనిలోని ఇనుము మరియు యాంటిఆక్సిడెంట్లు, రక్తలేమిని తరిమేయటానికి మరియు అకాల వృద్ధాప్యం నిరోధించడానికి సహాయ పడతాయి.

దీనిలో ఇనుము, ఫోలేట్, విటమిన్ B6 మరియు విటమిన్ K ఉండటం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పాలకూరలో ఉన్న ఈ పదార్థాలన్ని అద్భుతమైన రక్త శుద్ధికారులుగా పనిచేస్తాయి.

3. నిమ్మకాయ

3. నిమ్మకాయ

విటమిన్ సి మరియు పీచుపదార్ధం అధికంగా ఉండటం వలన, నిమ్మకాయ శరీర ప్రక్షాళనకారిగా పనిచేస్తుంది. ఇది మూత్రపిండాలు, కాలేయం మరియు ప్రేగులు నిర్విషీకరణకై అద్భుతంగా పనిచేస్తుంది.

అంతేకాక, నిమ్మరసం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్లు మరియు కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

ఎందువలన క్యారెట్, పాలకూర మరియు నిమ్మరసం పానీయం ఆరోగ్యకరమైనది?

ఈ ఆహార పదార్థాలలో ఉన్న నిర్విషీకరణ లక్షణాలు, మూత్రపిండాలు, కాలేయం మరియు ప్రేగులను శుభ్రపరచి సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి.

అంతేకాకుండా, ఈ రసంలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం మరియు శరీరం లోనికి సులభంగా శోషింపబడుతుంది కనుక పోషకాహార లోపాలను నిరోధిస్తుంది.

క్యారెట్, పాలకూర మరియు నిమ్మరసం పానీయం తయారీ విధానం:

క్యారెట్, పాలకూర మరియు నిమ్మరసం పానీయం తయారీ విధానం:

ఈ నిర్విషీకరణ పానీయం యొక్క తయారీ చాలా సులభం.

కావలసిన పదార్థాలు:

2 క్యారట్లు

బచ్చలికూర 50 గ్రా (2 గుప్పెళ్ళు)

1 నిమ్మకాయ రసం

1 టీస్పూన్ తేనె

1 గ్లాసుడు నీరు

తయారీ విధానం:

తయారీ విధానం:

నిమ్మకాయ పిండి మరియు రసం వెలికితీయండి.

ఒక బ్లెండర్ లో, ఇతర పదార్ధాలను చేర్చి, తరువాత నిమ్మరసం కలపండి. దీనిని బ్లెండ్ చేసి మృదువైన మిశ్రమంగా తయారు చేయండి.

మీరు దీనిని ఒక స్మూతీలా తయారు చేయాలంటే, 2 టేబుల్ స్పూన్లు పెరుగును కలపండి.

క్యారెట్, పాలకూర మరియు నిమ్మకాయ రసం తాగడానికి ఉత్తమ సమయం ఎప్పుడు?

క్యారెట్, పాలకూర మరియు నిమ్మకాయ రసం తాగడానికి ఉత్తమ సమయం ఎప్పుడు?

ఉదయం పరకడుపున, అల్పాహారం తినడానికి కనీసం అరగంట ముందు, ఈ పానీయం తాగడం మంచిది.

ఖాళీ కడుపుతో ఈ రసం త్రాగటం వలన, మీ శరీరం పోషకాలను మెరుగుగా గ్రహిస్తుంది మరియు దాని ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుంది.

ఒక వారం పాటు దీనిని త్రాగి, ఫలితాలను మీరే గమనించండి. ఇది మీ శారీరక శక్తిని పెంచడమే, కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

English summary

Why It Is Important To Remove Toxins From The Body?

Toxins inside the body cause skin rashes, acne and chronic fatigue. These toxins can be eliminated through the liver, kidneys and intestines by drinking fluids and one of them is the carrot, spinach and lemon juice. This delicious and healthy drink aids in cleansing the liver, kidneys and intestines.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more