For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించడం నుండి క్యాన్సర్ నివారణ వరకు, ముల్లంగి ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి

|

ముల్లంగిని సాధారణంగా భారతదేశంలో ' మోలి ' అనే పేరుతో ఎక్కువగా పిలుస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం ముల్లంగిగానే సుపరిచితం. వీటిని అనేకరకాల కూరలు, పరాటాలు, పప్పు కూరలు, సాంబారు, పచ్చడి లేదా సలాడ్ల వంటి రెసిపీల తయారీలో విరివిగా వినియోగించడం జరుగుతుంది. అనేకరకాల పోషకాలు మరియు విటమిన్లతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వగలిగే ఉత్తమ కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి.

ఈ ముల్లంగి యొక్క సాంకేతిక నామం రాఫానస్ సాటివస్. ముల్లంగి ఘాటైన రుచిని కలిగిన వేరు లేదా దుంప జాతికి చెందిన కూరగాయగా ఉంటుంది. ముల్లంగి మొక్క భాగాలైన ఆకులు, పువ్వులు, విత్తనాలు, కాయలు వంటి భాగాలను కూడా అనేకరకాల రెసిపీలలో వినియోగించడం జరుగుతుంటుంది.

Radish

శతాబ్దాలుగా, వాపు, మంట, గొంతు సమస్యలు, జ్వరం మరియు పిత్త దోష సంబంధిత రుగ్మతల వంటి అనేక ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఆయుర్వేద మరియు సాంప్రదాయక చైనీయుల వైద్యంలో ముల్లంగిని వినియోగించడం జరుగుతూ ఉంది.

ముల్లంగిలోని రకాలు :

• డైకాన్

• గులాబీ లేదా ఎరుపు రంగు ముల్లంగి

• నల్ల ముల్లంగి

• ఫ్రెంచ్ బ్రేక్ ఫాస్ట్ ముల్లంగి (ఇది కూడా ఒక ముల్లంగి రకం)

• గ్రీన్ మీట్

ముల్లంగిలోని పోషక విలువలు :

100 గ్రాముల పచ్చి ముల్లంగిలో 95.27 గ్రాముల నీరు, 16 కిలోకాలరీల శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రింది పోషకాలు కూడా గణనీయ మొత్తాలలో ఉంటాయి.

• 0.68 గ్రాముల మాంసకృత్తులు

• 0.10 గ్రాముల హెచ్.డి.ఎల్ కొవ్వులు

• 3.40 గ్రాముల కార్బోహైడ్రేట్స్

• 1.6 గ్రాముల పీచు

• 1.86 గ్రాముల పంచదార

• 25 మిల్లీగ్రాముల కాల్షియం

• 0.34 మిల్లీగ్రాముల ఇనుము

• 10 మిల్లీగ్రాముల మెగ్నీషియం

• 20 మిల్లీగ్రాముల భాస్వరం

• 233 మిల్లీగ్రాముల పొటాషియం

• 39 మిల్లీగ్రాముల సోడియం

• 0.28 మిల్లీగ్రాముల జింక్

• 14.8 మిల్లీగ్రాముల విటమిన్ C

• 0.012 మిల్లీగ్రాముల థయామిన్

• 0.039 మిల్లీగ్రాముల రిబోఫ్లేవిన్

• 0.254 మిల్లీగ్రాముల నియాసిన్

• 0.071 మిల్లీగ్రాముల విటమిన్ B6

• 25 మైక్రోగ్రాముల ఫోలేట్

• 7 ఇయు విటమిన్ ఎ (ఇంటర్నేషనల్ యూనిట్స్ (1ఐయు = 0.025 మైక్రోగ్రామ్స్))

• 1.3 మైక్రోగ్రాముల విటమిన్ కె

ముల్లంగితో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు :

1. బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది :

1. బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది :

ముల్లంగి ఫైబర్ నిల్వలకు మంచి వనరుగా చెప్పబడుతుంది. ఇది మీ ఆకలిని తీర్చడమే కాకుండా, ఇతర ఆహారాల మీదకు మనసు వెళ్ళకుండా, మరియు అతిగా ఆహారాన్ని తీసుకోకుండా నిరోధించగలుగుతుంది. క్రమంగా మీ బరువును నియంత్రించడం సులభతరం అవుతుంది. ఫైబర్ ప్రేగు కదలికలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. మలబద్ధక సమస్యలను నివారించడంలో కూడా ఉత్తమంగా సహాయపడుతుంది. మరియు తక్కువ సాంద్రత వద్ద లిపోప్రొటీన్స్ కట్టడి చేయడం ద్వారా ఎల్.డి.ఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

2. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది :

2. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది :

ముల్లంగిలోని విటమిన్ సి నిల్వలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా సంరక్షిస్తుంది. మరియు పర్యావరణ విషతుల్యాల కారణంగా జరిగే కణ నష్టాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిలో కూడా కీలకపాత్రను పోషిస్తుంది. క్రమంగా ఆరోగ్యవంతమైన చర్మం మరియు రక్తనాళాలను నిర్వహించడానికి దోహదపడుతుంది.

3. క్యాన్సర్ సమస్యను నివారిస్తుంది :

3. క్యాన్సర్ సమస్యను నివారిస్తుంది :

ముల్లంగి యాంటి క్యాన్సర్ లక్షణాలతో కూడిన ఆంతోసియానిన్స్ మరియు ఇతర విటమిన్లను కలిగి ఉంటుంది. ఒక అధ్యయనంలో, ముల్లంగి వేరు సారం క్యాన్సర్ కణాల మరణానికి కారణమయ్యే ఐసోథియోసైనేట్స్ ను కలిగి ఉందని కనుగొనడం జరిగింది. ఐసోథియోసైనేట్స్ శరీరం నుండి క్యాన్సర్ కారక పదార్థాల తొలగింపును పెంచుతుంది మరియు కణితి అభివృద్ధిని నిరోధిస్తుంది.

4. గుండె ఆరోగ్యానికి మద్దతు :

4. గుండె ఆరోగ్యానికి మద్దతు :

ముల్లంగిలో ఉండే ఆంథోసియానిన్స్ అనే ఫ్లేవొనాాయిడ్స్, కార్డియోవాస్క్యులర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చెడు (LDL) కొలెస్ట్రాల్ను సైతం తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్ట్రోక్ యొక్క ప్రాధమిక కారణంగా ఉంటుంది.

5. మధుమేహాన్ని నియంత్రించగలుగుతుంది :

5. మధుమేహాన్ని నియంత్రించగలుగుతుంది :

ముల్లంగి అనేది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారంగా చెప్పబడుతుంది. అంటే దీనిని తీసుకోవడం ద్వారా , ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు. ముల్లంగి రసాన్ని తరచుగా తీసుకోవడం ద్వారా డయాబెటిక్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలపై సానుకూల ప్రభావం కనిపించిందని అనేక అధ్యయనాలలో తేలింది కూడా.

6. రక్తపోటును తగ్గిస్తుంది :

6. రక్తపోటును తగ్గిస్తుంది :

ముల్లంగి పొటాషియం యొక్క అద్భుతమైన వనరుగా ఉంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం రక్తనాళాలను వ్యాకోచించేలా చేసి, నిలకడగా రక్తప్రవాహం కొనసాగేలా ప్రోత్సహిస్తుంది. ఇది ముడుచుకుపోయిన రక్తనాళాలను సైతం వెడల్పు చేయగలుగుతుందని చెప్పబడింది. క్రమంగా రక్తం తేలికగా ప్రవహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

7. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది :

7. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది :

ముల్లంగి యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉండే యాంటీ ఫంగల్ ప్రోటీన్ అయిన RsAFP2 ను కలిగి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, RsAFP2, కాండిడా అల్బికాన్స్ లో కణాల మరణానికి కారణమవుతుంది. యోని వద్ద ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు, ఓరల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు మరియు ఇన్వాసివ్ కాన్డిడియాసిస్ సమస్యకు గల ప్రాధమిక కారణంగా చెప్పబడుతుంది.

8. కాలేయాన్ని డీటాక్సిఫై చేస్తుంది :

8. కాలేయాన్ని డీటాక్సిఫై చేస్తుంది :

ఒక అధ్యయనం ప్రకారం తెల్ల ముల్లంగిలోని ఎంజైమ్లు, కాలేయం విషపూరితం కాకుండా సంరక్షిస్తాయని చెప్పబడింది. బయోమెడికల్ అండ్ బయోటెక్నాలజీ జర్నల్లో ప్రచురించిన మరో అధ్యయనంలో, నల్ల ముల్లంగి కొలెస్ట్రాల్తో కూడిన పిత్తాశయ రాళ్లను నివారించడంలో, మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించగలవని కనుగొన్నారు.

9. ఆరోగ్యవంతమైన జీర్ణ వ్యవస్థను నిర్వహిస్తుంది :

9. ఆరోగ్యవంతమైన జీర్ణ వ్యవస్థను నిర్వహిస్తుంది :

ముల్లంగి రసాన్ని తరచూ తాగడం, మరియు దాని ఆకులను తరచుగా మీ ఆహార ప్రణాళికలో జోడించుకోవడం ద్వారా, గ్యాస్ట్రిక్ కణజాలాన్ని కాపాడుతూ, గాస్ట్రిక్ అల్సర్స్ తలెత్తకుండా చూడగలుగుతుందని చెప్పబడుతుంది. అంతేకాకుండా, శ్లేష్మ ద్వారాలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముల్లంగి ఆకులు జీర్ణక్రియలను మెరుగుపరచడానికి సహాయపడే ఫైబర్ కు మంచి మూలంగా చెప్పబడుతుంది.

10. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది :

10. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది :

ముల్లంగి అధిక మొత్తాలలో నీటి నిల్వలను కలిగి ఉంటుంది. ఇది వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిని తరచూ తినడం మూలంగా మీ శరీరం హైడ్రేట్ గా ఉంచగలుగుతుంది మరియు మలబద్దకాన్ని నివారించడంలో కూడా ఉత్తమంగా సహాయపడుతుంది.

11. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది :

11. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది :

ముల్లంగిలో ఉండే విటమిన్ సి, జింక్, పాస్పరస్ వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేయడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యకరస్థితిలో ఉంచగలుగుతాయి. అంతేకాకుండా చర్మం పొడిబారడం, మొటిమలు, మరియు దద్దుర్లను నివారించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రకాశవంతమైన, నునుపైన చర్మం కోసం ముల్లంగి ఫేస్ మాస్క్లను ప్రయత్నించవచ్చు.

అంతేకాకుండా, ముల్లంగిలోని పోషకతత్వాల కారణంగా, జుట్టు మూలాలను బలోపేతం చేయడం, జుట్టు రాలడాన్ని నివారించడం మరియు చుండ్రు తొలగించడం ద్వారా మీ జుట్టుకు అనేక రకాల ప్రయోజనాలను అందివ్వగలుగుతుంది.

ముల్లంగిని ఎంచుకోవడం ఎలా?

ముల్లంగిని ఎంచుకోవడం ఎలా?

• దృఢంగా ఉండే ముల్లంగిని మాత్రమే ఎంచుకోవాలి మరియు దాని ఆకులు తాజాగా మరియు వాడిపోకుండా ఉండాలి.

• ముల్లంగి బయటి చర్మం నునుపుగా, పగుళ్లు లేకుండా ఉండేలా చూసుకోవాలి.

ముల్లంగిని మీ ఆహార ప్రణాళికలోకి చేర్చుకోదగిన మార్గాలు :

• మీ గ్రీన్ సలాడ్లో ముల్లంగి స్లైసెస్ జోడించుకోవచ్చు.

• ట్యూనా సలాడ్ లేదా చికెన్ సలాడ్లో గ్రేటెడ్ ముల్లంగిని జోడించుకోవచ్చు. .

• బ్లెండ్ చేసిన గ్రీక్ యోగర్ట్, తరిగిన ముల్లంగి, మిర్చి, వెల్లుల్లి రెబ్బలు జోడించి, రెడ్ వైన్ వెనిగర్ స్ప్లాష్ చేయడం ద్వారా రాడిష్ డిప్ తయారు చేసుకోవచ్చు.

• ఆలివ్ ఆయిల్లో కొన్ని వేయించిన ముల్లంగిని వేసుకుని స్నాక్ గా తీసుకోవచ్చు.

• ముల్లంగి సాంబారు వంటను కూడా ప్రయత్నించవచ్చు.

ముల్లంగి జ్యూస్ రెసిపీ :

కావలసిన పదార్ధాలు :

• 3 ముల్లంగి

• సముద్రపు ఉప్పు (ఆప్షనల్)

తయారుచేసే పద్ధతి :

• ముల్లంగిని తరిగి, వాటిని జ్యూసర్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేయండి.

• దీనిని వడకట్టి, అవసరమైతే ఒక చిటికెడు సముద్రపు ఉప్పును కలిపి తీసుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Health Benefits Of Radish

Radish is an edible root vegetable with a pungent taste. The other parts of the radish plant are consumed as well. For centuries, radishes have been used in Ayurveda to treat many conditions like inflammation, sore throat, fever, and bile disorders. The health benefits of radish are preventing cancer, promoting heart health,
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more