For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుష్కలమైన పోషకాలతో నిండిన ఆరోగ్య ప్రదాయని కాలే : కాలే రకాలు, పోషక విలువలు, మరియు రెసిపీలు

ఇది సాధారణంగా లభించే కాలే రకం, ఇది సామాన్యంగా ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగులో ఉంటుంది. ఆకులు ఎక్కువగా ముడతలు పడినట్లుగా కనిపిస్తుంటాయి. క్రమంగా వాటిని సులభంగా కాండం నుండి వేరుచేసేలా ఉంటాయి. లాసినాట

|

కాలే దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, ఒక సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. ఇది శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన, ప్రపంచంలోని గొప్ప పోషకభరితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది.

కాలే క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలలో ఒకటి (బ్రసికాసియే). ఇది తక్కువ కొవ్వు పదార్ధాలను మరియు తక్కువ కాలరీలను కలిగి ఉండి, పోషకాలలో అధికంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడుకుని పోషకభరితమైన ఆహారంగా ఉంటుంది.

Kale: Types, Nutritional Benefits & How To Eat

కాలే రకాలు :

కాలేలో పోషకాలు మరియు ఫ్లేవర్ల స్వల్ప తేడాలతో కూడుకుని అనేక రకాలుగా లభిస్తుంటాయి. వాటిలో కొన్ని ఇచ్చట పొందుపరచబడ్డాయి.

కర్లీ కాలే -

ఇది సాధారణంగా లభించే కాలే రకం, ఇది సామాన్యంగా ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగులో ఉంటుంది. ఆకులు ఎక్కువగా ముడతలు పడినట్లుగా కనిపిస్తుంటాయి. క్రమంగా వాటిని సులభంగా కాండం నుండి వేరుచేసేలా ఉంటాయి.

Kale: Types, Nutritional Benefits & How To Eat

లాసినాటో లేదా డైనోసార్ కాలే -

ఇది సాధారణంగా ముదురు నీలం మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ఎక్కువ ఆకులు మరియు పొలుసులతో కూడిన నిర్మాణంతో ఉంటుంది. కాలే చిప్స్ తయారీకి వీటిని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంటుంది.

రెడ్ రష్యన్ కాలే -

ఈ రకానికి చెందిన ఆకులు తీపి మరియు పులుపు రుచిని కూడుకుని ఉంటాయి. ఈ కాలే కాండం కొద్దిగా ఊదా రంగులో ఉంటుంది. మరియు ఆకులు ఎర్రటి ఛాయతో ఉంటాయి. ఆకులు దాదాపు ఓక్ ఆకులను పోలి ఉంటాయి. సలాడ్లు, జ్యూసులు మరియు, సాండ్ విచ్ తయారీకి రెడ్ రష్యన్ కాలే వినియోగించడం జరుగుతుంది.

కాలే పోషక విలువలు :

100 గ్రాముల పచ్చి కాలేలో 89.63 గ్రాముల నీరు మరియు 35 కిలో కాలరీల ఎనర్జీ కలిగి ఉంటుంది.

Kale: Types, Nutritional Benefits & How To Eat

అంతేకాకుండా కింది పోషకాలను కూడా కలిగి ఉంటాయి -

● 2.92 g ప్రోటీన్

● 1.49 g లిపిడ్ (fat)

● 4.42 g కార్బోహైడ్రేట్స్

● 4.1 g ఫైబర్

● 0.99 g చక్కెర

● 254 mg కాల్షియం

● 1.60 mg ఇనుము

● 33 mg మెగ్నీషియం

● 55 mg భాస్వరం

● 348 mg పొటాషియం

● 53 mg సోడియం

● 0.39 mg జింక్

● 93.4 mg విటమిన్ C

● 0.113 mg థయామిన్

● 0.347 mg రిబోఫ్లోవిన్

● 1.180 mg నియాసిన్

● 0.147 mg విటమిన్ B6

● 62 mcg ఫోలేట్

● 4812 ఐయు విటమిన్ ఎ

● 0.66 mg విటమిన్ ఇ

● 389.6 mcg విటమిన్ k

1. గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

1. గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

కాలే ఫైబర్, విటమిన్ b6, విటమిన్ సి మరియు పొటాషియంలలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదపడే పోషకాలుగా ఉన్నాయి. మీరు కొవ్వు లేదా అధిక ప్రోటీన్ నిల్వలు కలిగిన భోజనాన్ని తీసుకున్నప్పుడల్లా, కాలేయం కొవ్వులను పైత్యరస ఆమ్లాలుగా మారుస్తుంది. క్రమంగా కొవ్వును సంగ్రహించడానికి జీర్ణాశయంలోకి పంపబడుతుంది. క్రమంగా పైత్యరస ఆమ్లాలు రక్త ప్రవాహంలోనికి పునఃశోషించబడి, మరలా తిరిగి ఉపయోగించబడతాయి. కాలేలో ఉండే పైత్య రసాలను క్రమబద్దీకరించే నిరోధకాలు, పైత్య ప్రకోపాల పెరుగుదలను గణనీయంగా తగ్గిస్తాయి, మరియు కొవ్వులను తిరిగి శోషించుకోనివ్వకుండా నిరోధిస్తుంది, క్రమంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ కాలే జ్యూస్ తీసుకోవడం మూలంగా, అధిక కొలెస్ట్రాల్ కారణంగా పురుషుల్లో తరచుగా వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది కూడా.

2. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

2. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

కాలేలోని ఫైబర్ ప్రేగుల కదలికలలో అత్యుత్తమంగా సహాయపడుతుంది. క్రమంగా జీర్ణ శక్తిని ప్రోత్సహించడం ద్వారా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను సైతం నివారించగలుగుతుంది. ఫైబర్ మీ మలానికి అధికంగా జోడించబడడం మూలంగా, చిన్నప్రేగులలో తేలికగా ప్రసరించి జీర్ణక్రియలు సజావుగా సాగేలా చూస్తుంది. కానీ కాలే అధిక మోతాదులో తీసుకోరాదు, దీనిలో ఉండే రఫ్నోజ్ అనే కార్బోహైడ్రేట్ జీర్ణక్రియల సమయంలో అంత తేలికగా కరగడం జరగదు.

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది :

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది :

కాలేలోని తక్కువ కేలరీలు మరియు అధిక నీటి నిల్వల కారణంగా, దీనిని తక్కువ శక్తి-సాంద్రత ఆహారంగా పరిగణించబడుతుంది. తక్కువ శక్తి సాంద్రత కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవడం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయం చేయగలవని అధ్యయనాల్లో తేలింది. అంతే కాకుండా, కాలేలో ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ నిల్వలు మీకు కడుపు నిండిన అనుభూతికి లోను చేయడం ద్వారా, అవాంఛిత ఆహార కోరికలను నిరోధించగలుగుతుంది.

4. క్యాన్సర్ నివారణలో :

4. క్యాన్సర్ నివారణలో :

కాలే కాన్సర్ నివారణలో అత్యుత్తమంగా సహాయం చేయగలదని నిరూపించబడింది. పూర్తిగా తగ్గించలేకపోయినా, కాన్సర్ నివారణలో తనవంతు పాత్రను పోషించగలదు. దీనిలోని సల్ఫోరఫేన్, క్యాన్సర్తో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉండి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే కాలేలోని యాంటీ ప్రొలిఫరేటివ్ యాక్టివిటీ ఒక అధ్యయనంలో కనుగొనబడింది. కాలేలోని ఇండోల్ -3-కార్బినాల్ కూడా క్యాన్సర్ను నివారించడంలో సహాయపడే మరో పదార్థంగా ఉందని మరో అధ్యయనంలో పేర్కొనబడింది.

5. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో :

5. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో :

విటమిన్ సి అనేది నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్, ఇది కొల్లాజెన్ను క్రమబద్దీకరించడానికి ఫ్రీ రాడికల్స్ తో పోరాడటం నుండి అనేక ఇతరత్రా పాత్రలను పోషిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు దోహదంచేసే అనేక కణాలు, ముఖ్యంగా T - సెల్స్ మరియు ఫాగోసైట్స్ వాటి వాటి విధులను నిర్వహించేందుకు వీలుగా విటమిన్ C నిల్వలు సహాయం చేస్తాయి. ఇవి కొన్ని వ్యాధి కారక కారకాలకు వ్యతిరేకంగా పోరాడగలిగిన లక్షణాలను కలిగి ఉన్న కారణంగా, అనారోగ్య తీవ్రతను తగ్గించడంలో సహాయపడగలదు.

Most Read :నల్లగా ఉండే యోని తెల్లగా మారాలంటే ఇలా చెయ్యాలిMost Read :నల్లగా ఉండే యోని తెల్లగా మారాలంటే ఇలా చెయ్యాలి

6. కంటి ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది :

6. కంటి ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది :

కాలేలో విటమిన్-ఎ నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. ఇది సరైన కంటి ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది. ఈ కూరగాయల్లోని జియాక్సాంథిన్ మరియు ల్యూటేన్ వంటి కెరోటినాయిడ్లు, రెటీనాకు హానికరమైన అతి నీల లోహిత మరియు, నీలి తరంగదైర్ఘ్యాలను ప్రసరించే కాంతిని ఫిల్టర్ చేసే లక్షణాలను పెంచి, కంటిలోని ఆరోగ్యవంతమైన కణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తాయి. జియాక్సాంథిన్ మరియు ల్యూటేన్ కెరోటినాయిడ్లు కంటి మచ్చల క్షీణతలో సహాయపడడమే కాకుండా, కాటరాక్ట్ సమస్యల ప్రమాదం నుండి కూడా దూరంగా ఉంచగలదు.

7. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :

7. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :

కాలే విటమిన్ k మంచి మూలంగా ఉంటుంది. కాలేలో కనిపించే విటమిన్ కె యొక్క రూపం విటమిన్ k1 (ఫైలోక్వినోన్), ఇది రక్తం గడ్డకట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది, క్రమంగా ప్రమాదాలు జరిగినప్పుడు రక్త ప్రవాహాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఎముకల పటుత్వం పెంచడం, ఎముక మాతృక ప్రోటీన్లను క్రమబద్దీకరించడం, మెరుగైన కాల్షియం శోషణలో సహాయం చేయడం మరియు మూత్ర విసర్జనలో కాల్షియం మొతాదులను తగ్గించడం వంటివి అదనపు ఉపయోగాలుగా ఉన్నాయి.

8. మధుమేహానికి దూరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది :

8. మధుమేహానికి దూరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది :

కాలే అధిక మొత్తంలో ఫైబర్ నిల్వలను కలిగి ఉంటుంది. ఇది టైప్ 1 మధుమేహం మరియు టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తుల్లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలని క్రమబద్దీకరించడంలో దోహదపడుతుంది. అంతే కాకుండా, కాలేలోని ఆల్ఫా-లిపోఇక్ ఆమ్లం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడమే కాకుండా, నరాల నష్టాన్ని కూడా తగ్గిస్తాయి, క్రమంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అదేవిధంగా మధుమేహం వలన కలిగే కంటి నష్టాన్ని నివారిస్తుంది.

9. మంటను తగ్గిస్తుంది :

9. మంటను తగ్గిస్తుంది :

కాలేలోని క్వెర్సెటిన్ మరియు కాంప్ఫెనోల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లేవనాయిడ్లు, దీర్ఘకాలిక వాపును నిరోధించడంలో సహాయం చేస్తాయి. క్రమంగా ఈ ఇన్ఫ్లమేటరీ సంబంధిత గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం మరియు ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి హానికరమైన వ్యాధులు మరియు ఆరోగ్య పరిస్థితుల నుండి కాపాడుతుంది.

10. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది :

10. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది :

కాలే విటమిన్ ఎ యొక్క ఘనమైన వనరుగా ఉంది. ఇది చర్మం మరియు జుట్టు యొక్క కణజాలాలను రూపొందించడంలో, మరియు ఫైన్ లైన్స్ మరియు ముడతలను తగ్గించడంలో సహాయంచేస్తుంది. విటమిన్ - ఎ సెబం ఉత్పత్తిలో కీలకంగా సహాయం చేస్తుంది, క్రమంగా మీ చర్మం మరియు జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

Most Read :రోజూ హస్తప్రయోగం చేసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, అందుకే కంట్రోల్ లో ఉండండిMost Read :రోజూ హస్తప్రయోగం చేసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, అందుకే కంట్రోల్ లో ఉండండి

కాలే అధికంగా తీసుకోవడం వలన తలెత్తే దుష్ప్రభావాలు :

కాలే అధికంగా తీసుకోవడం వలన తలెత్తే దుష్ప్రభావాలు :

అధిక మోతాదులో కాలే తీసుకోవడం వలన, మలబద్ధకం, కడుపు ఉబ్బరం మరియు పొట్ట నొప్పి వంటి దుష్ఫలితాలకు దారితీస్తుంది. థైరాయిడ్ పనితీరులో కూడా ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. కాబట్టి మీరు హైపోథైరాయిడిజం కలిగి ఉన్న ఎడల, కాలే తీసుకోవడానికి ముందుగా మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.

కాలే వంటకాలు :

కాలే సూప్ తయారుచేసే విధానం :

ఒక పాన్లో, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, కాలే, బీన్స్, టమోటో, ఉప్పు మరియు మిరియాలపొడి వేసి ఫ్రై చేయాలి. చికెన్ స్టాక్ జోడించి 15 నిమిషాల పాటు ఉడికించాలి. రోజ్మేరీ లేదా కొత్తిమీర ఆకులతో సర్వ్ చేయాలి.

కాలే చిప్స్ :

కాలే చిప్స్ :

కాలే ఆకులను తీసుకుని ముక్కలుగా చేసి, ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో జోడించి, అందులో చిటికెడు ఉప్పు, కారం పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి పొడి మరియు కరివేపాకు పొడిని జోడించాలి. కరకరలాడే చిప్స్ ప్రామాణికంగా, 275 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద 15 నిమిషాలపాటు బేక్ చేయండి. .

ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయిఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయి

కాలే సలాడ్ :

కాలే ఆకులను కొద్దిగా చిదిమి, వాటిని ఒక గిన్నెలో చేర్చండి, మీకు నచ్చిన సలాడ్ డ్రెస్సింగ్ జోడించి ఆస్వాదించండి!

సాటీడ్ కాలే :

ఒక పాన్లో, కొద్దిగా ఎక్స్టావర్జిన్ ఆలివ్ ఆయిల్ జోడించి, ఒక టీస్పూన్ తరిగిన ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని జోడించండి. కొన్ని నిమిషాల పాటు కాలేలో, సాటే జోడించి పక్కన పెట్టండి. కొద్ది నిమిషాల తర్వాత కొద్దిగా బ్లెండ్ చేసి తీసుకోవచ్చు.

కాలీ స్మూతీస్ :

ఒక బ్లెండర్లో, మీకు ఇష్టమైన పండ్లు లేదా కూరగాయల స్మూతీలో గుప్పెడు కాలే ఆకులను జోడించండి. ఇలా చేయడం వల్ల పోషకాలు పెరుగుతాయే కానీ, ఫ్లేవర్ మారదు.

రోజులో ఎంత మోతాదులో కాలే తీసుకోవచ్చు :

రోజులో రెండు మార్లు కాలే తీసుకోవచ్చు, అనగా సుమారు 2 కప్పులు. కాకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న ఎడల వైద్యుల సిఫార్సు మీదనే అనుసరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యను ఎదుర్కుంటున్న వారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Kale: Nutrition, Benefits and How to eat

Kale is deemed as a wonderful superfood due to its amazing health benefits. It is one of the world's nutritious and healthiest foods with powerful medicinal properties. Kale is a vegetable which belongs to the cabbage family (Brassicaceae). It contains very little fat, is low in calories and high in nutrients, making it a nutrient-dense food.
Desktop Bottom Promotion