For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ పీల్ : ఆరోగ్య ప్రయోజనాలు , రిస్క్ మరియు ఎలా తీసుకోవాలి

|

మనం నారింజ పండును తీసుకునేటప్పుడు, దాని తొక్కతో ఎటువంటి ఉపయోగం లేదని భావిస్తూ, తరచుగా పారవేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి నారింజ తొక్కలో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. నారింజ తొక్కలో అనేకరకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ లక్షణాలు ఇన్ఫ్లమేషన్ (వాపు) ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది. క్రమంగా ఇన్ఫ్లమేషన్ సంబంధిత అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

నారింజ తొక్క వంటి సిట్రస్ పండ్ల తొక్కలలో వివిధ రకాల ఫైటోకెమికల్స్ నిక్షేపాలు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధులను నిరోధించడంలో, డిఎన్ఎ డ్యామేజీని రిపేర్ చేయడంలో మాత్రమే కాకుండా శరీరం నుండి కార్సినోజెన్స్ తొలగించడంలో కూడా అత్యుత్తమ ప్రభావాలను కలిగి ఉంటాయని చెప్పబడింది.

Orange Peel

నారింజ తొక్కలోని పోషక విలువలు :

100 గ్రాముల పచ్చి నారింజ తొక్కలో 72.50 గ్రాముల నీరు, 97 కిలో కాలరీల శక్తి ఉంటుంది. అంతేకాకుండా ...

• 1.50 గ్రాముల మాంసకృత్తులు

• 0.20 గ్రాముల ఆరోగ్యకర కొవ్వులు

• 25 గ్రాముల కార్బోహైడ్రేట్స్

• 10.6 గ్రాముల ఫైబర్

• 161 మిల్లీ గ్రాముల కాల్షియం

• 0.80 మిల్లీ గ్రాముల ఇనుము

• 22 మిల్లీ గ్రాముల మెగ్నీషియం

• 21 మిల్లీ గ్రాముల భాస్వరం

• 212 మిల్లీ గ్రాముల పొటాషియం

• 3 మిల్లీ గ్రాముల సోడియం

• 0.25 మిల్లీ గ్రాముల జింక్

• 136.0 మిల్లీ గ్రాముల విటమిన్ C

• 0.120 మిల్లీ గ్రాముల థిఅమిలో

• 0.090 మిల్లీ గ్రాముల రిబోఫ్లేవిన్

• 0.900 మిల్లీ గ్రాముల నియాసిన్

• 0.176 మిల్లీ గ్రాముల విటమిన్ B6

• 30 మైక్రో గ్రాముల ఫోలేట్

• 420 IU (ఇంటర్నేషనల్ యూనిట్స్) విటమిన్ ఎ

• 0.25 మిల్లీగ్రాముల విటమిన్ ఈ

నారింజ తొక్కతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు :

1. క్యాన్సర్ సమస్యను నివారించడంలో...

1. క్యాన్సర్ సమస్యను నివారించడంలో...

సిట్రస్ తొక్కలు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. సిట్రస్ తొక్కలలో ఉండే పాలీమెథాక్సిఫ్లేవన్లు (PMFs), ఒక రకమైన ఫ్లేవొనోయిడ్ వలె పనిచేస్తాయి. ఇవి కాన్సర్ ఎదుగుదలను నిరోధించగలవు. మరియు క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కార్సినోజెనోసిస్ను ఇతర అవయవాలకు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది మరియు ప్రసరణ వ్యవస్థ ద్వారా కాన్సర్ కణాలు ప్రసరించకుండా అదుపు చేసి, వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. క్రమంగా కాన్సర్ నివారణలో సహాయపడగలదని చెప్పబడుతుంది.

2. గుండె ఆరోగ్యానికి మద్దతు...

2. గుండె ఆరోగ్యానికి మద్దతు...

నారింజ తొక్కలు ఎక్కువగా హెస్పెరిడన్ నిక్షేపాలను కలిగి ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు నిర్వహించడానికి సహాయపడే ఫ్లేవొయిడ్. అదేవిధంగా, నారింజ తొక్కలలో ఉండే పాలీమెథాక్సీఫ్లెవోన్స్ కూడా సమర్ధవంతంగా కొలెస్ట్రాల్ను తగ్గించగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది.

3. వాపును నిర్మూలించడంలో ...

3. వాపును నిర్మూలించడంలో ...

దీర్ఘకాలిక వాపు ( క్రానిక్ ఇన్ఫ్లమేషన్) అనేది గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి వంటి రకరకాల వ్యాధులకు మూలకారణం. నారింజ తొక్కలలో ఉండే ఫ్లేవొనాయిడ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయని చెప్పబడింది, ఇవి వాపును, మంటను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

4. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ను నివారిస్తుంది :

4. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ను నివారిస్తుంది :

అధికంగా ఆల్కహాల్ మరియు ధూమపానం సేవించడం అనేది, కాలక్రమేణా గ్యాస్ట్రిక్ అల్సర్స్ సమస్యకు దారితీస్తుంది. అయితే సిట్రస్ పండ్ల తొక్కల సారం, ఎలుకలలో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ను సమర్థవంతంగా తగ్గించగలిగిందని ఒక అధ్యయనంలో తేలింది. టాంజరిన్ మరియు స్వీట్ ఆరెంజ్ తొక్కలలో కనిపించే హెస్పెరిడిన్, యాంటీ అల్సర్ లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పబడుతుంది.

5. మధుమేహం చికిత్సలో ..

5. మధుమేహం చికిత్సలో ..

నారింజ తొక్కలు డైటరీ ఫైబర్లకు మంచి వనరుగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించగలదని చెప్పబడింది. జర్నల్ నేచురల్ ప్రొడక్ట్ రీసెర్చ్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, నారింజ తొక్కల సారం డయాబెటిక్ నెఫ్రోపతి చికిత్సలో సహాయపడగలదని చెప్పబడింది.

6. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది :

6. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది :

ఫుడ్ కెమిస్ట్రీ అనే జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, ఎండిన సిట్రస్ పండ్ల తొక్కల సారం వివిధ రకాల జీర్ణ రుగ్మతల చికిత్సలో ఎంతగానో సహాయపడుతుందని కనుగొన్నారు. సిట్రస్ తొక్కలు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటమే దీనికి కారణం.

7. దంత సంరక్షణలో ...

7. దంత సంరక్షణలో ...

క్లినికల్ అండ్ ఎక్స్పరిమెంటల్ డెంటిస్ట్రీ (దంత శాస్త్రానికి సంబంధించిన) జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, నారింజ తొక్క సారంలోని యాంటీ బాక్టీరియల్ మరియు యాంటి మైక్రోబయల్ లక్షణాలు దంతక్షయ వ్యాధి కారకాలకి వ్యతిరేకంగా, ప్రభావవంతంగా ఉన్నట్లు చెప్పబడింది.

8. చర్మానికి ఎనలేని సహాయం :

8. చర్మానికి ఎనలేని సహాయం :

సిట్రస్ తొక్కలు యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి మొటిమల మరియు ఆక్నే కారక బాక్టీరియాకు వ్యతిరేకంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. నారింజ తొక్కలలో నోబిలెటిన్ అనే ఫ్లేవొనోయిడ్ ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు చర్మ రంద్రాలలో నూనెలు మరియు మురికి చేరకుండా నిరోధిస్తుంది. మొటిమల నివారణలో భాగంగా ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్లను ప్రయత్నించవచ్చు.

నారింజ తొక్కల వలన కలిగే దుష్ప్రభావాలు :

మీరు గుండె జబ్బులతో బాధపడుతున్నట్లయితే, నారింజ తొక్కల సారాన్ని ఉపయోగించడం పరిహరించండి. ఈ తొక్కలు సైనెఫ్రైన్ కలిగి ఉంటుంది, ఇది అపసవ్య గుండె చప్పుళ్ళు, మూర్ఛలు, గుండె దడ మరియు ఛాతీ నొప్పికి కారకంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో బలహీనత లేదా పక్షవాతం వచ్చే అవకాశముంది.

దీనిలోని ఇస్కీమిక్ కొలిటిస్, సినెఫ్రైన్ నిక్షేపాల కారణంగా జీర్ణ సంబంధ సమస్యలు, మరియు తలనొప్పులకు కూడా కారణం కావొచ్చు.

నారింజ తొక్కలను ఎలా తీసుకోవచ్చు ...

• నారింజ తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని మీ సలాడ్లో జోడించుకోవచ్చు.

• కేక్లు, మఫిన్లు తయారుచేయడానికి కూడా ఈ నారింజ తొక్కలను ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఫ్లేవర్ పెంచడం కొరకు పెరుగు, ఓట్ మీల్ మరియు పాన్కేకులకు కూడా జోడించుకోవచ్చు.

• కొన్ని అదనపు పోషకాలు మరియు పీచు పదార్థాలను జోడించడం కొరకు మీ స్మూతీలకి ఆరెంజ్ తొక్కలను జోడించుకోవచ్చు.

నారింజ తొక్క టీ రెసిపీ :

కావలసిన పదార్ధాలు :

• 1 టీస్పూన్ తరిగిన లేదా గ్రౌండెడ్ ఆరెంజ్ తొక్కలు

• ఒక కప్పు నీరు

అనుసరించు పద్ధతి :

• ఒక పాన్లో ఒక కప్పు నీరు పోసి, అందులో అర టీస్పూను తురిమిన నారింజ తొక్కలను వేయండి.

• ఉడికించి, మంటను ఆపివేయండి.

• 10 నిమిషాలపాటు అలాగే ఉంచండి.

• తరువాత దీన్ని వడకట్టి, సేవించండి.

ఈసారి నారింజను తింటే దాని తొక్కను పారవేయకండి. చూశారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కానీ, ఏదిఏమైనా దీనిలో ఉన్న కొన్ని దుష్ప్రయోజనాల దృష్ట్యా, పరిమిత మొతాదులోనే తీసుకోవాలని గుర్తుంచుకోండి. రోజూవారీ కాకపోయినా, వారంలో ఒకటి లేదా రెండు మార్లు తీసుకోవడం ఎంతో ఉత్తమంగా సూచించబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Orange Peel: Health Benefits, Risks & How To Consume

Orange peel contains various phytochemicals that prevent cancer, support heart health, keep inflammation at bay, protect the teeth, aid in diabetes treatment, promote digestion, etc. If you are suffering from heart disease, avoid using orange peel extract as it contains synephrine which is linked to irregular heart rhythm, heart palpitation, and chest pain.
Desktop Bottom Promotion