For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొలకలు: రకాలు, పోషకాలు, ఆరోగ్య లాభాలు & దుష్ప్రభవాలు

|

మొలకెత్తిన గింజలు, మీ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అనేకరకాల విటమిన్లు మరియు ఖనిజాలతో కూడుకుని ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉన్నాయి. విత్తనాలు లేదా కూరగాయల ముక్కలను నీటిలో నానబెట్టినప్పుడు, క్రమంగా అవి మొలకెత్తడం ప్రారంభమవుతాయి. మరియు ఈ ప్రక్రియను స్ప్రౌటింగ్ అని వ్యవహరిస్తారు. మొలకెత్తిన గింజలు తేలికగా పెరుగుతాయి మరియు మీ ఆహార ప్రణాళికకు జోడించదగినవిధంగా అనువుగా ఉంటాయి.

మొలకెత్తిన గింజలు అంటే ఏమిటి ?

గింజలను నీటిలో నానబెట్టినప్పుడు, మొక్కలుగా పరిణతి చెందడానికి ప్రయత్నిస్తుంది. క్రమంగా గింజల నుండి మొలకలు ప్రారంభమవుతాయి. విత్తనాలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టిన తర్వాత, అవి తేమ మరియు ఉష్ణోగ్రతల సరైన కలయికకు బహిర్గతం అయినప్పుడు మొలకలు రావడం ప్రారంభమవుతాయి. మరియు రెండు నుంచి ఏడు రోజులపాటు పెరగడానికి అనుమతించబడుతాయి. మొలకెత్తిన గింజలు సాధారణంగా 2 నుండి 5 సెం.మీ పొడవు వరకు పెరుగుతాయి.

Sprouts

మొలకెత్తిన గింజల రకాలు :

మొలకెత్తిన గింజలలోని అత్యంత సాధారణ రకాలను ఇక్కడ పొందుపరచబడ్డాయి :

• చిక్కుడు మరియు బఠాణీ మొలకలు - వీటిలో కాయ ధాన్యాలు, సోయాబీన్స్, ముడి పెసలు, కిడ్నీ బీన్స్, బఠాణీ, గార్బాంజో బీన్స్, అడ్జుకీ బీన్స్ మరియు బ్లాక్ బీన్స్ ప్రధానంగా ఉన్నాయి.

• గింజలు మరియు విత్తనాల ద్వారా మొలకలు - వీటిలో బాదం, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ముల్లంగి విత్తనాలు మరియు అల్ఫాల్ఫా విత్తనాలు ఉంటాయి.

• పైరు గింజలు - వీటిలో బక్వీట్, కాముత్ (గోధుమలలో ఒక రకం), క్వినోవా, బ్రౌన్ రైస్, అమరాంత్ మరియు ఓట్స్ మొదలైన మొలకలు ఉన్నాయి.

• కాయగూరలు లేదా ఆకుజాతికి చెందిన మొలకలు - వీటిలో బ్రోకోలీ, ముల్లంగి,, దుంప కూరలు, క్రెస్ మరియు మెంతులు మొదలైనవి ఉంటాయి.

మొలకెత్తిన గింజలలోని పోషకాల సమాచారం :

మొలకెత్తే ప్రక్రియ, గింజలలోని పోషకాల స్థాయిలను రెట్టింపు చేస్తుంది. మొలకెత్తిన గింజలు ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి మరియు విటమిన్ కె యొక్క అద్భుతమైన వనరుగా ఉంటుంది. మొలకెత్తే గింజలు, ప్రోటీన్ నిల్వలలో అధికంగా ఉంటాయని అధ్యయనాలలో తేలింది. మొలకెత్తిన గింజలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు మొక్కల సమ్మేళనాలలో సమృద్ధిగా ఉంటాయి. మరియు ఇవి అధిక స్థాయిలో ఆవశ్యక అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి.

మొలకెత్తిన గింజలలో ఉండే ప్రోటీను నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి. ఎందుకంటే మొలకెత్తే ప్రక్రియ సమయంలో యాంటి న్యూట్రియంట్స్ శాతాన్ని తగ్గించి, పోషకాలను శరీరం గ్రహించడానికి సులభంగా ఉండేలా చేస్తుంది.

మొలకెత్తిన గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది :

1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది :

మొలకెత్తిన గింజలు అధిక మొత్తాలలో సజీవ ఎంజైములను కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియ ప్రక్రియను పెంచడంలో మరియు శరీరంలోని రసాయనిక చర్యలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి. ఆహారాన్ని పగలగొట్టి, జీర్ణ వాహిక ద్వారా పోషకాల శోషణను పెంచడానికి ఎంజైములు సహాయం చేస్తాయి.

దీనికి అదనంగా, మొలకెత్తిన గింజలు అధిక మొత్తంలో పీచును (కరగని రకం) కలిగి ఉంటాయి, ఇది మలవిసర్జన సజావుగా సాగేలా చేస్తుంది. మరియు మలబద్ధకం అవకాశాలను తగ్గిస్తుంది.

2. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం :

2. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం :

మొలకెత్తిన గింజలను తినడం మూలంగా, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్రోకలీ మొలకలు అనేకరకాల జీవ క్రియాత్మక సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ప్రత్యేకంగా సల్ఫోరఫనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్లాస్మా యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ సామర్ధ్యాన్ని పెంచుతుంది. మరియు లిపిడ్ పెరోక్సిడేషన్, సీరం ట్రైగ్లిసరాయిడ్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇండెక్స్, సీరం ఇన్సులిన్, ఇన్సులిన్ నిరోధకత, మరియు టైప్ 2 డయాబెటిక్ రోగుల్లో ఆక్సీకరణం చెందిన ఎల్.డి.ఎల్(చెడు) కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది. ఇదేవిధంగా, ఫైటోఎరోజెన్ నిల్వలు ఉన్న కారణంగా, గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పబడుతుంది.

3. బరువు తగ్గడంలో సహాయం :

3. బరువు తగ్గడంలో సహాయం :

మొలకెత్తిన గింజలు వాటిలోని అధిక ఫైబర్ కంటెంట్ మూలంగా బరువు తగ్గడంలో ఉత్తమంగా సహాయం చేస్తుందని చెప్పబడుతుంది. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చూడగలుగుతుంది. మరియు ఆకలి కోరికలను నిరోధిస్తుంది, ఇది ఘ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ విడుదలను ఆపుతుంది. వేరుశనగ మొలకలు ఊబకాయంతో బాధపడుతున్న మహిళల్లో ఉదర భాగంలో కొవ్వును తగ్గించగలవని చెప్పబడుతుంది.

4. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో అదుపులో ఉంచుతుంది..

4. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో అదుపులో ఉంచుతుంది..

మొలకెత్తిన గింజలను తరచుగా తీసుకోవడం మూలంగా, మీ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మొలకెత్తిన గింజలు అమైలేజ్ ఎంజైమ్ యొక్క కార్యకలాపాలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఒక అధ్యయనంలో చెప్పబడింది. ఈ ఎంజైమ్లు చక్కెరలను కరిగించి జీర్ణం చేయడంలో సహాయపడగలవని చెప్పబడింది. బ్రోకోలీ గింజలు సల్ఫొరఫే సమ్మేళనాలలో సమృద్దిగా ఉంటాయి, ఇది టైప్ 2 మధుమేహంతో ఉన్న ప్రజలలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

5. క్యాన్సర్ను నివారిస్తుంది :

5. క్యాన్సర్ను నివారిస్తుంది :

ముడి బ్రోకోలి మొలకలలోని సమ్మేళనాలు క్యాన్సర్ పోరాట సమ్మేళనాల ఘనమైన మూలంగా చెప్పబడుతుంది. బ్రోకోలీ మరియు దాని మొలకలలో కనిపించే ప్రధాన సమ్మేళనాలైన గ్లూకోసైనోట్స్ విచ్చిన్నమైన తర్వాత, అవి ఐసోథియోసైనేట్స్ వలె రూపాంతరం చెందుతాయి. ఈ ఐసోథియోసైనేట్స్ లో యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పబడుతుంది. బ్రోకోలీ గింజలు ప్రోస్టేట్ క్యాన్సర్ను నిరోధించడంలో ప్రభావవంతంగా ఉండగలవని మరో అధ్యయనం తేల్చింది.

6. రోగనిరోధక శక్తిని పెంచడానికి . .

6. రోగనిరోధక శక్తిని పెంచడానికి . .

మొలకెత్తిన గింజలు విటమిన్ ' C ' తో ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాలు (WBCs)కు శక్తివంతమైన ఉద్దీపనంగా పనిచేస్తుంది. ఇది వ్యాధులు మరియు సంక్రామ్యతలకు వ్యతిరేకంగా పోరాడుతుంది, తద్వారా మీ రోగనిరోధక శక్తిని పెంచగలుగుతుంది. .

7. గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడం :

7. గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడం :

మొలకెత్తిన గోధుమలు, మొలకెత్తిన ఓట్స్ శరీరంలోని ఆమ్ల స్థాయిలను తగ్గించి, శారీరిక pH సమతుల్యతను క్రమబద్దీకరించడంలో సహాయపడతాయి. ఈ మొలకెత్తిన గింజలలోని లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ సమ్మేళనాలు గట్ కు మంచి ప్రోబయోటిక్ వలె పనిచేస్తుంది.

ముడి మొలకలతో కూడిన సాధారణ దుష్ప్రభావాలు :

ముడి మొలకలతో కూడిన సాధారణ దుష్ప్రభావాలు :

మొలకెత్తిన గింజలతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి కారణం వీటిని పచ్చిగా వినియోగించడమే. ఇవి సాల్మొనెల్లా మరియు ఇకొలి బాక్టీరియా వంటి హానికరమైన బాక్టీరియాలను కలిగి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా వెచ్చని మరియు తడి వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది చాలావరకు మొలకెత్తుతున్న దశలోనే సంభవిస్తుంది.

ఒకవేళ మీరు ఆ బాక్టీరియా బారిన పడినట్లయితే, మొలకెత్తిన గింజలు తిన్న 12 నుంచి 72 గంటలలోపు ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపిస్తాయి. డయేరియా, వాంతులు, కడుపు ఉబ్బరం మొదలైనవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), 48 ఆహార సంబందిత అస్వస్థతలకు మొలకెత్తిన గింజలు కారణంగా తేల్చింది.

ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించే కొన్నిరకాల చిట్కాలను ఇక్కడ పొందుపరచబడ్డాయి :

• మొలకెత్తిన గింజలను సరైన వాతావరణంలోనే తయారుచేయాలి.

• తాజా మరియు శుభ్రంగా ఉండే మొలకెత్తిన గింజలనే కొనండి.

• బలమైన వాసన మరియు చెడిపోయినట్లుగా కనిపించిన గింజలను తీసుకోకండి.

• 48°F(8°c) కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మొలకెత్తిన గింజలను ఫ్రిజ్లో పెట్టండి.

మీ ఆహారంలో మొలకెత్తిన గింజలను చేర్చే మార్గాలు :

• ఒక శాండ్ విచ్లో మొలకెత్తిన గింజలను జోడించండి. లేదా సూప్స్, స్టిర్- ఫ్రైస్, మరియు బియ్యంతో కూడిన వంటకాలతో జోడించి తీసుకోండి.

• మొలకెత్తిన గింజలను బర్గర్లను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

• మొలకెత్తిన గింజలను ఆమ్లెట్ రెసిపీలలో జోడించుకోవచ్చు.

• మొలకెత్తిన గింజలను స్మూతీస్ మరియు పాన్కేక్స్ పిండిలో బ్లెండ్ చేసి జోడించవచ్చు .

• మొలకెత్తిన గింజలను బ్రెడ్ లేదా క్రాకర్స్ తో కలిపి తీసుకోవచ్చు.

• మొలకెత్తిన గింజలతో సలాడ్ రెసిపీలు మరియు మసాలా వంటకాలను కూడా ప్రయత్నించవచ్చు.

మొలకెత్తిన గింజలను ఇంట్లోనే ఎలా పెంచుకోవాలి ?

• చిక్కుళ్లు, లేదా గింజలను శుభ్రంగా కడిగి, వాటిని ఒక పెద్ద గిన్నె లేదా నీటితో నింపిన జార్లో ఉంచండి.

• గిన్నె లేదా జార్ ను ఒక క్లాత్ తో కప్పండి.

• దీనిని గది ఉష్ణోగ్రతలో 3 నుంచి 12 గంటలపాటు ఉంచండి లేదా దానికన్నా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు.

• ఒకసారి మొలకెత్తిన తర్వాత ఆ నీటిని బయటకు తీసి, మరోసారి తాజా నీటితో కడగాలి.

• మొలకెత్తిన గింజలను 3 నుండి 4 రోజులలోపునే తినాలని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Sprouts: Types, Nutrition, Health Benefits & Risks

Sprouts are the germinated seeds that mature into young plants. The sprouting process starts when the seeds are soaked in water for several hours during which they are exposed to the right combination of moisture and temperature. The health benefits of sprouts include preventing cancer, improving digestion, helping to lose weight, promoting heart health, etc.
Story first published:Friday, May 17, 2019, 12:11 [IST]
Desktop Bottom Promotion