For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి భోజనం తర్వాత అరటిపండు తినడం మంచిదా, చెడ్డదా? సమాధానం ఇక్కడ ఉంది చూడండి

రాత్రి భోజనం తర్వాత అరటిపండు తినడం మంచిదా, చెడ్డదా? సమాధానం ఇక్కడ ఉంది చూడండి

|

చాలా మంది రాత్రిపూట పండ్లు తినడకూదు అనే అపోహ ఉంది. అందులోనే అరటిపండు తినకూడదు అని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం రాత్రి భోజనం తర్వాత అరటిపండు తినడం మంచిదని చెప్పారు. కానీ ఈ రెండు వాదనల ద్వారా మేము మాత్రం ఆందోళన చెందుతున్నాము. మరి రెగ్యులర్ గా రాత్రుల్లో అరటిపండ్లు తినేవారికి ఆందోళన కలిగించే విషయమే. అయితే మిగిలిన వారికి కూడా ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే రాత్రుల్లో మరే పండ్లు తినాలో అనే అలోచన ఇప్పటికే మనస్సులో మెదలైంటుంది.

Banana at night is good or bad? Heres the answer

రాత్రి అరటిపండు తినడం ఎందుకు అంత చెడ్డదో మనం ఎప్పుడూ ఆలోచించలేదు. దీన్ని ప్రశ్నించడం లేదు. అరటిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అరటిలో పోషకాలు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇది మానవ శరీరానికి చాలా ఉపయోగపడుతాయి. కానీ ప్రజలకు దీని గురించి అపోహలెందుకు, రాత్రుల్లో ఎందుకు తినకూడదన్న విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేదం ఏం చెబుతుంది

ఆయుర్వేదం ఏం చెబుతుంది

ఆయుర్వేదం ప్రకారం, రాత్రి అరటి తినడం సురక్షితం కాదు. అరటిని రాత్రిపూట అరటి పండు తినడం మానేయాలి. ఎందుకంటే ఇది దగ్గు మరియు జలుబు కలిగిస్తుంది. జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది శరీరానికి ఉదాసీనతను కలిగిస్తుంది.

పోషకాహార నిపుణులు ఏమి చెబుతారు?

పోషకాహార నిపుణులు ఏమి చెబుతారు?

ఫిట్నెస్ మరియు న్యూట్రిషన్ నిపుణుడు శశాంక్ రాజన్ ప్రకారం, అరటి పండు చాలా ఆరోగ్యకరమైనది మరియు ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. కానీ దగ్గు మరియు జలుబు, ఉబ్బసం లేదా సైనస్‌తో బాధపడేవారు రాత్రిపూట అరటి పండు తినడం మానుకోవాలి. సాయంత్రం వ్యాయామం తర్వాత అరటిపండు తినడానికి మంచి మార్గం.

కడుపులో ఆమ్లాన్ని నియంత్రిస్తుంది

కడుపులో ఆమ్లాన్ని నియంత్రిస్తుంది

అధ్యయనాల ప్రకారం, స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తినే వారికి అరటి పండు మంచి ఎంపిక. బయట ఫుడ్ తినే వారు రాత్రిపూట అరటిపండు తినడం వల్ల గుండెల్లో మంట, కడుపు పూతలు0 తగ్గుతాయి.

నిద్రకు సహాయం చేస్తుంది

నిద్రకు సహాయం చేస్తుంది

మీరు రోజంతా అలసిపోయినప్పుడు అరటిపండు తినడం వల్ల అందులోని పొటాషియం నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు సాయంత్రం ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే మీకు రాత్రి బాగా నిద్ర పడుతుంది. ఒక పెద్ద అరటిపండులో 487 మి.గ్రాం టాషియం ఉంటుందని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. వయస్సైనవారి శరీరానికి కావల్సిన పొటాషియం కన్నా సుమారు 10 శాతం ఎక్కువ ఉంటుంది.

బరువు పెరగకుండా చేస్తుంది

బరువు పెరగకుండా చేస్తుంది

ఒక అరటి పండులో 105 కేలరీలు మాత్రమే ఉన్నాయి. మీరు రాత్రి భోజనానికి 500 కేలరీల కన్నా తక్కువ కావాలనుకుంటే, అందుకు మీరు రెండు అరటిపండ్లు మరియు ఒక కప్పు గోరువెచ్చని, వెన్న తీసిన పాలు సేవించాలి.

కోరికను తొలగిస్తుంది

కోరికను తొలగిస్తుంది

మీకు అర్థరాత్రిలో డెజర్ట్ లేదా స్వీట్ లేద తీపి తినాలనే కోరిక కలిగినప్పుడు, మీరు అరటిపండు తినవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ చక్కెర మరియు అధిక కేలరీలు ఉంటాయి. తీపి తినాలనే కోరిక అరటిపండు తీర్చుతుంది. అదేవిధంగా, శరీరానికి ఎక్కువ విటమిన్లు మరియు ఫైబర్ లభిస్తుంది.

అనేక వ్యాధులకు అద్భుతమైన సంరక్షణను అందిస్తుంది

అనేక వ్యాధులకు అద్భుతమైన సంరక్షణను అందిస్తుంది

అరటిపండ్లు వివిధ వ్యాధుల నుండి మనల్ని సంరక్షిస్తాయి. కీటకాలు కరిచినప్పుడు, దురదగా, ఎర్రబడినప్పుడు అరటి నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తుంది. టైప్ -2 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది, బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది మరియు నాడీ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ బి -6 రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండ మంచి ఐరన్ కంటెంట్ రక్తహీనతతో బాధపడుతున్నవారిని పోషించడానికి సహాయపడుతుంది.

ఆహారం నుండి ఇతర పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది

ఆహారం నుండి ఇతర పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది

అరటి పండులో ఉండే సోలబుల్ ఫైబర్ (కరిగే ఫైబర్) కడుపులో కరిగి జీర్ణక్రియకు అవసరమైన కొన్నిమంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రీబయోటిక్ అని పిలువబడే ఈ డైటరీ పీచుపదార్థాల సమూహాలు, ఇతర ఆహారాల ద్వారా సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఈ బ్యాక్టీరియా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడే ఇతర ఎంజైమ్‌లను కూడా ఉత్పత్తి చేస్తుంది. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని (ఉదా. మాంసం) జీర్ణం చేయడానికి ఈ ఎంజైమ్‌లు చాలా అవసరం.

నిర్థారణ

నిర్థారణ

అరటి పండులో చాలా పోషకాలు ఉన్నాయి మరియు ఇది నిద్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి రాత్రి అరటి పండును తినకూడదని మీకు మీరూ నిర్ధారించుకోవడం మంచిది కాదు. కానీ ఉబ్బసం, సైనస్ మరియు జలుబు ఉన్నవారు మాత్రం రాత్రి సమయంలో అరటి పండును తినకుండా ఉండటమే మంచిది.విస్మరించవచ్చు.

English summary

Banana at night is good or bad? Here's the answer

We all have been asked to avoid eating fruits at night, especially banana and we have simply followed the rule, without giving it a thought. We have never questioned why eating banana at night is bad. Regarded as one of the most nutritious fruits, banana is packed with nutrients and minerals that are good for the human body. Let us know why people have this double-standard with banana and even with citrus fruits.
Story first published:Wednesday, September 25, 2019, 14:40 [IST]
Desktop Bottom Promotion