For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రివేళ గాఢ నిద్ర పోవాలంటే?

రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చ

By B N Sharma
|

Lose-weight-Sleeping
రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే, మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి.

క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించండి. ఆరోగ్యమైన నిద్ర పొందాలంటే...వేళకు పడుకోవటం - వేళకు లేవడమనేది ఒక చిట్కా. వివిధ సమయాలు నిద్రకు ఆచరించకండి. గాఢ నిద్ర పట్టదు. రాత్రివేళ నిద్ర సరిగా లేకుంటే పగటిపూట మీరు విశ్రాంతిగా వున్నపుడు హాయిగా కనీసం ఒక అరవై నిమిషాలపాటు నిద్రపోవచ్చు.

రాత్రి వేళ డిన్నర్ అయిన కొద్ది గంటల తర్వాత నిద్రించడం మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమిస్తే జీర్ణవ్యవస్ధ బలహీనపడుతుంది. అలాగని ఖాళీ పొట్టతో కూడా నిద్రించవద్దు. నిద్రపోయే రెండు లేదా మూడు గంటల ముందుగా డిన్నర్ తీసుకోండి. తేలికగా జీర్ణమయ్యేవి, ఆరోగ్యకరమైన ఆహారాలు డిన్నర్ లో తీసుకోండి. డిన్నర్ తర్వాత కొద్ది దూరం నడిస్తే మరీ మంచిది. జీర్ణ వ్యవస్ధకు మీ కాలినడక ఎంతో సహకరిస్తుంది.

గాఢ నిద్ర పోవాలంటే, నిద్రకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకోవాలి. నిద్రించేముందుగా కనీసం ఒక గంట సేపు టివి చూడటం, కంప్యూటర్ పై పని చేయటం వంటివి మానండి. గదిలో వెలుగును తగ్గించి కళ్ళకు స్వల్ప ఒత్తిడి కలిగిస్తే కొద్ది నిమిషాలలో నిద్ర వస్తుంది. లేదా నిద్ర మూడ్ రావటానికి రిలాక్స్డ్ గా ఏదైనా మంచి పుస్తకం చదవండి. చాలామందికి అసౌకర్యమైన నిద్ర పుస్తకాల పఠనంతో సరిచేయబడింది. పడుకున్న వెంటనే నిద్ర బాగా రావాలంటే పుస్తక పఠనం బాగా సహకరిస్తుంది. లేదా మీకిష్టమైన పాటలు లేదా సంగీతం వంటివి అతి తక్కువ ధ్వనితో విని కూడా నిద్రపోవచ్చు.

మంచి నిద్ర పట్టాలంటే ఇంటిలో ఎటువంటి ధ్వనులు లేకుండా చూడాలి. ధ్వనులు సరైన నిద్రను పట్టనివ్వవు. నిద్రించేముందు కొంత విశ్రాంతిగా వుండాలి. నిద్రించేముందు 5 నుండి 6 గంటల వ్యవధిలో నరాల వ్యవస్ధను ఉత్తేజం చేసే కాఫీ, టీ వంటివి తాగరాదు. కేఫైన్ నిద్రాభంగం కలిగిస్తుంది. తాగితే 10 నుండి 12 గంటల పాటు నిద్ర రాకుండా కూడా చేస్తుంది. కనుక రాత్రి నిద్ర బాగా వుండాలంటే, కనీసం నిద్రించే సమయానికి అయిదు లేదా ఆరు గంటల వ్యవధిలో కాఫీ, టీలు తాగకండి.

నిద్రించేముందు, జ్యూసులు లేదా అధికంగా నీరు వంటివి కూడా తాగవద్దు. ఇవి మూత్రం చేయటానికి దోవతీసి నిద్రాభంగం కలిగిస్తుంది. నిద్రలేమి నుండి దూరంగా వుండాలంటే, నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోవద్దు. చాలామంది నిద్రించేందుకు ఆల్కహాల్ మంచిదనుకుంటారు. కాని, దీనితో మంచి నిద్ర లోపించటమే కాక, అతి తక్కువగాను వుంటుంది. నిద్రించేముందు సిగరెట్ తాగవద్దు. ఇందులోని నికోటిన్ నిద్రా సమస్యలను కలిగిస్తుంది.

నిద్రించేముందు, కొద్ది సమయం యోగా ధ్యానం లేదా తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది కండరాలను విశ్రమింపజేసి శరీరాన్ని, మైండ్ ను నిద్రించేటందుకు అనువుగా తయారు చేస్తుంది.

ఈ ఆరోగ్యకరమైన నిద్ర చిట్కాలు పాటించి రాత్రివేళ మంచి నిద్ర పొందండి. మీ నిద్రలేమిని దూరం చేసుకోండి.

English summary

Tips for Getting A Good Night's Sleep! ఁ కంటికి నిద్ర - ఒంటికి శ్రమ...!

Sleep is the most important thing that each one of us require on a daily basis. Ideally, 7-8 hours of sleep time is a must to rejuvenate your body and also have a calm, peaceful mind.
Desktop Bottom Promotion