For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబీపి ని అదుపులో ఉంచే యోగముద్ర...

|

ముందుగా వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లు కొద్దిగా దూరంగా ఉంచి.. రెండు చేతులు ఆకాశంవైపు ఉండేట్లుగా ఉంచాలి. తలని కొద్దిగా ఎడమవైపు గానీ, కుడివైపు గానీ తిప్పాలి. శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ శరీరాన్ని భూమిమీద రిలాక్స్‌డ్‌గా వదిలివేయాలి. మనసులో వేరే ధ్యాస ఉండకుండా పూర్తిగా శరీరం మీద పెట్టాలి. మన ధ్యాసమళ్లకుండా ఉండేందుకు వదులైన దుస్తులు ధరించాలి. వాచ్, బెల్ట్‌లాంటి బిగుతైనవేవీ లేకుండా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా గాలి పీలుస్తూ, వదులుతూ ఉదర కండరాలను పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు పరిసరాల వైపు మన ధ్యాసను మళ్లించాలి.

మన చుట్టుపక్కల వస్తున్న శబ్దాలని, ముందుగా దగ్గరి శబ్దాలను తరువాత దూరపు శబ్దాలను గమనించాలి. ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో పరిశీలించే ప్రయత్నం చేయాలి. శరీరం ఈ విధంగా రిలాక్స్ అయి ఉన్నప్పుడు నిద్ర త్వరగా వచ్చే అవకాశం ఉంది. నేను నిద్రపోవడం లేదు అని మనసులో అనుకుంటూ వుండాలి. నెమ్మదిగా కళ్లు మూసుకుని మన చుట్టూ ఉన్న వాటిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మనం పడుకున్న నేలను కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తరువాత మన శరీరంలోని ఏయే భాగాలు భూమిమీద ఉన్నాయో వాటిమీద ధ్యాస నిలపాలి. భూమిమీద ఒక్కో శరీర భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క శరీర భాగాన్ని గమనిస్తూ, దానిని రిలాక్స్ చేస్తూ రావాలి. ఏ భాగంలో కూడా ఎలాంటి కండరాల స్టిఫ్‌నెస్‌కానీ, జాయింట్ స్టిఫ్‌నెస్‌కానీ ఉండకుండా చూస్తూ రావాలి.

Yoga Mudra for Hypertension..

మొదటగా కుడి అరచేతి నుంచి మొదలుపెట్టి కుడిచేతివేళ్లను, కుడి అరచేతిని, మణికట్టుని, మోచేతిని, భుజాలను, శరీరపక్క భాగాలను, నడుము జాయింట్స్, తొడ కండరాలు, మోకాళ్లు, పిక్కలు, కాలి మడమలు, అరికాళ్లు, పాదం కాలి వేళ్లు ... ఇలా ఒక్కో భాగాన్ని గమనిస్తూ నెమ్మదిగా రిలాక్స్ చేస్తూ మొత్తం కుడిపక్కన శరీర భాగాలన్నింటి బరువునంతా భూమిమీద వదిలేయాలి. ఇదే విధంగా ఎడమ అరిచేతి నుంచి మొదలుపెట్టి, ఎడమ కాలి వేళ్ల వరకు శరీర భాగాలన్నంటిని చేయాలి. ఇప్పుడు శరీరం వెనుక భాగంలో ధ్యాస ఉంచాలి. మొదట కుడి తుంటి భాగం, తరువాత ఎడమ తుంటిభాగం, వెన్నెముక కింది భాగం, మధ్య భాగం, భుజాల కీలు భాగాలు... ఇలా వరుసగా ధ్యాస ఉంచి వాటిని రిలాక్స్ చేస్తూ రావాలి. ఇప్పుడు శరీరం ముందు వైపు ధ్యాస కేంద్రీకరించాలి. తల, నుదుటి భాగం, కుడి కన్ను, ఎడమకన్ను, ముక్కు, ముక్కు కొనభాగం, కుడిచెంప, ఎడమ చెంప, పై పెదవి, కింది పెదవి, చుబుకం, కుడివైపు కాలర్‌బోన్, ఎడమవైపు కాలర్‌బోన్, కుడి ఛాతి భాగం, ఎడమ ఛాతి భాగం, బొడ్డు చుట్టుపక్కల, పొత్తికడుపు ఇలా... మొత్తం శరీరం మీద ధ్యాస ఉంచి... తరువాత శరీరాన్ని రిలాక్స్ చేయాలి. నెమ్మదిగా ఇప్పుడు మళ్లీ మీ చుట్టుపక్కల శబ్దాలను గమనించాలి. పరిసరాలను గమనించాలి. మళ్లీ సంకల్పాన్ని మూడుసార్లు రిపీట్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులు, కాళ్లు, తలను అటూఇటూ కదిలించాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా లేచి కూర్చోవాలి.

యోగముద్ర
హైపర్ టెన్షన్ లేదా బీపీ వల్ల కలిగే సమస్యల నుంచి కాపాడుకోవడానికి యోగనిద్ర చాలా ఉపయోగపడుతుంది. బీపీకి మనం తీసుకునే మందుల వలన కలిగే ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా చాలా ప్రభావవంతంగా పనిచేసే యోగనిద్ర గురించి తెలుసుకుందాం. యోగనిద్ర వల్ల బీపీని అదుపులోకి తేవచ్చన్న విషయం శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. డాక్టర్లు కూడా దీనిని ధృవీకరిస్తున్నారు. ఒక మూడు వారాలు నిపుణుల ఆధ్వర్యంలో దీనిని గనుక ప్రాక్టీస్ చేస్తే సిస్టోలిక్ బీపీ, డయాస్టోలిక్ బీపీని 10 నుంచి 15మి.మీ వరకు అదుపు చేయవచ్చు. ఉపయోగాలు :యాంగ్జైటీ, ఇరి తలనొప్పి తగ్గుతాయి.

English summary

Yoga Mudra for Hypertension... | హైబీపి ని అదుపులో ఉంచే యోగముద్ర...


 Yog Mudras not only has positive effects on physical health, but it is a great way to improve mood and manage psychological stress. People with mild hypertension if practice these healing Mudras daily for two to three months will experience significant decreases in their blood pressure and can decrease the levels of stress hormones. These Yog Mudras increase the stability of mind and mental activities are also controlled.
Desktop Bottom Promotion