For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్న్(మొక్కజొన్న)లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

మొక్కజొన్న (Maize) ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. మొక్కజోన్నా చాల చౌకగా లబించే ఆహారము . దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాల్ని తగ్గించగల "లూతెయిన్ , జీక్జాన్‌డిన్ " అనే ఎమినో యాసిడ్స్ ... మంచి యాంటి-ఆక్షిడెంట్లు గా పనిచేస్తాయి. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు. ఇన్ని రకాలుగా మొక్కజొన్నను ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నారు.

మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్.. అనే విటమిన్లు ఎక్కువ ఉంటాయి. మొక్కజొన్న తినటం రుచే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. కొలెస్టిరాల్ ను నియంత్రించును. ఒక రకంగా చెప్పాలంటే మానవునికి ఆరోగ్యం పరంగా మొక్క జొన్న ఉపయోగం అనంతం. ఇది కాన్సర్, గుండె సంబంద సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. మొక్కజొన్నలో ఉండే తీపి పదార్థం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడి అనిపించినప్పుడు ఒక కప్పు ఉడికించిన గింజలు తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు స్వీట్ కార్న్ లో ఉన్నాయి.

మొక్కజొన్నను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉడికించి, లేదా అలాగే పచ్చివి కూడా తినవచ్చు. కార్న్ తినడం చాలా సులభమైన పద్దతి. కొన్ని మిశ్రమ పదార్థాలు ఉపయోగించి కూడా అనేక రకాల వంటలను తయారు చేసుకోవచ్చు . అలాగే సలాడ్స్ లో ఉపయోగించుకోచ్చు. కొంతమంది మొక్కజొన్నతో తయారు చేసే కార్న్ కాసొరోల్, బ్లాక్ బీన్, మరియు కార్న్ సలాడ్ మరియు గ్రిల్డ్ కార్న్ వంటివి ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. మరియు మీరు కార్న్ తో తయారు చేసే వంటల వల్ల కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు . మొక్కజొన్నవల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో కొన్ని మీకోసం అందిస్తున్నాం..

జీర్ణక్రియకు:

జీర్ణక్రియకు:

మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ అరికడుతుంది.

గర్భిణీలకు ఈ ఆహారం ప్రధానం:

గర్భిణీలకు ఈ ఆహారం ప్రధానం:

గర్భవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.

కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది:

కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది:

మీ డైలీ డైట్ లో కార్న్ ను చేర్చుకోవడం వల్ల, కళ్ళ ఆరోగ్యానికి చాలా అద్భుతంగా మేలు చేస్తాయి. కార్న్ లో ఉన్న కొన్ని కెరోటినాయిడ్స్ మాస్కులార్ డిజనరేషన్ ను రిస్క్ ను తగ్గిస్తుంది. ఈ కెరోటినాయిడ్స్ లో ఉండే లూటిన్ మరియు జియాక్సిథిన్ లు కాంట్రాక్ట్ అభివ్రుద్దిని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి :

గుండె ఆరోగ్యానికి :

మొక్కజొన్న ను రెగ్యులర్ గా తినడం వల్ల, తగిన పరిమానణంలో మితంగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్(రక్తకాణాల ఆరోగ్యానికి) చాలా మంచిది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, మరియు బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతే కాదు, రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

క్యాలరీలు-విటమినులు పుష్కలంగా ఉన్నాయి:

క్యాలరీలు-విటమినులు పుష్కలంగా ఉన్నాయి:

ఎనర్జీని పుష్కలంగా అందించే 100గ్రాముల బేబీకార్న్ లో 342క్యాలరీ ఉన్నాయి. ఇంకా మన శరీరానికి మరియు మైండ్ కు చాలా ముఖ్యంగా అవసరం అయ్యే బిటమిన్ బి, నియాసిన్ మరియు థైమిన్ లు ఉన్నాయి. నియాసిన్ లోపం వల్ల డిమెంటియా, డెర్మెటీటిస్, సమస్యలకు లోనుకావల్సి వస్తుంది. అలాగే థైమిన్ నరాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

పోషకాలు అధికం :

పోషకాలు అధికం :

మొక్కజొన్నలో మన శరీరానికి ముఖ్యంగా అవసరం అయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మరియు సెలీనియం వంటి మన శరీరంలోని అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మరియు కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. మరియు ఇందులో ఉండే మెగ్నీషియం నార్మల్ హార్ట్ రేట్ ను కలిగి ఉండేలా సహాయపడుతాయి.

రక్తహీనతను నిరోధిస్తుంది:

రక్తహీనతను నిరోధిస్తుంది:

రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్‌ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్‌ మొక్కజొన్న విటమిన్‌ బి12, ఐరన్ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి ఉండటం వల్ల మీలో రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. కార్న్ లో ఉండే విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ , ఎర్రరక్త కణాల ఏర్పాటు చాలా అవసరం అవుతాయి.

మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది:

మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది:

మొక్కజొన్న, తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది. మొక్క జొన్నలో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్:

క్యాన్సర్:

మొక్కజొన్నలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండి యాంటియాక్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్ లను నిరోధిస్తుంది. ఇది కోలన్ క్యానర్(పెద్ద ప్రేగు క్యాన్సర్ ను)ప్రమాదాన్ని తగ్గింస్తుంది.

చర్మానికి మేలు చేస్తుంది:

చర్మానికి మేలు చేస్తుంది:

కార్న్ స్ట్రాచ్ ను అనేక రకాల కాస్మొటిక్స్ లో ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూర్చుతుంది . ఇందులోని యాంటీయాక్సిడెంట్స్ వ్రుద్యాప్యం ను నిరోధిస్తుంది . కార్న్ ఆయిల్ తో రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల మీ స్కిన్ టెక్చర్, రేడియంటి స్కిన్ అందిస్తుంది.

కేశాలకు:

కేశాలకు:

ప్రతి రోజూ తగు పరిమాణంలో కార్న్ తినడం వల్ల హెయిర్ ఫోలీ సెల్స్ కు బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి మరియు పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్ గా ఉండేందు, మంచి షైనింగ్ పొందడానికి బాగా సహాయపడుతుంది.

శ్వాస సంబంధిత:

శ్వాస సంబంధిత:

అంతే కాదు ఇందులో ఇండే బీటా క్రిప్టాక్సన్తిన్ ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుంది.

కిడ్ని సమస్యకు:

కిడ్ని సమస్యకు:

కార్న్ (మొక్కజొన్న). మూత్రపిండాలు పనిచేయకపోవడంతో సహా... కిడ్నీకి సంబంధించి ఇతర సమస్యలను నివారించడానికి బాగా సహాయపడుతాయని కనుగొనబడింది.

మానసిక విధులకు:

మానసిక విధులకు:

మానసిక విధులకు సహాయపడే పాంటోథీనిక్ ఆమ్లం(విటమిన్ బి5) ఇందులో పుష్కలంగా ఉంటుంది.

కొల్లెస్టరాల్‌ నివారణ చేస్తాయి:

కొల్లెస్టరాల్‌ నివారణ చేస్తాయి:

శరీరంలో లివర్‌ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్‌ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్‌ మరియు చెడు కొలెస్టరాల్‌ అయిన ఎల్‌డిఎల్‌. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్‌ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.

English summary

10 Amazing Health Benefits Of Corn

Eat corns and stay healthy! Yes, it is true that corn is a wonderful food which provides us lots of nutrition. It not only tastes great, but also has many health benefits.
Story first published: Thursday, October 17, 2013, 12:23 [IST]
Desktop Bottom Promotion