For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోతాదు మించితే నరకమే..హ్యాంగోవర్ సమస్యలు !?

By Super
|

మద్యం, ఇతర మత్తు పానీయాలను మితిమీరి సేవించినప్పుడు కలిగే తీవ్ర శారీరక అసౌకర్యమే హ్యాంగోవర్ ‌(pronounced /ˈhæŋoʊvər/). తలనొప్పి, వికారం, వెలుగును, శబ్దాలను భరించలేకపోవడం, బద్ధకం, తీవ్ర అలసట, అతిసారం, విపరీతమైన దాహం వంటివి దీని తాలూకు అతి సాధారణ లక్షణాలు. తాగిన మత్తు దిగగానే ఇవన్నీ ఒకటకటిగా వేధిస్తాయి. హ్యాంగోవర్‌ ఏ సమయంలోనైనా రావచ్చు. కాకపోతే రాత్రి పూట అతిగా మద్యం సేవిస్తే ఉదయం లేచినప్పుడు ఉండే పరిస్థితిని సూచించేందుకు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. శారీరక ఇబ్బందులతో పాటు విపీతరమైన డిప్రెషన్‌, ఒత్తిడి వంటి మానసిక సమస్యలకు కూడా హ్యాంగోవర్‌ కారణమవుతుంది.

మీరు అప్పుడప్పుడు తాగినా ప్రయోగాత్మకంగా తాగినా లేదా తరచూ బార్ లో తాగినా హంగొవెర్ ని అనుభవించే ఉంటారు. ఈ హంగొవెర్ వల్ల ఆ రోజు మొత్తం పాడవడం జరుగుతుంది. ఒక్కోసారి, ఈ ప్రభావం ఒక రోజు కి మించి కూడా ఉండవచ్చు. ఆల్కహాల్ కి మీ శరీర ప్రవ్రుత్తి ని బట్టి హాంగ్ ఓవర్ ప్రభావం మారవచ్చు. వివిధ రకాల హాంగ్ ఓవర్ మెడిసిన్స్ ని ప్రయత్నించే బదులు ఇంట్లో ని ప్రభావవంతమైన చిట్కాలను ప్రయత్నించవచ్చు. వీటిలో కొన్నిటి గురించి ఈ కింద ప్రస్తావించబడింది.


మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

విటమిన్ డ్రింక్స్ చేత హ్యాంగోవర్ నుండి ఉపశమనం :

చాలా సూపర్ మార్కెట్స్ లో ఈ విటమిన్ డ్రింక్స్ లభ్యమవుతాయి. కొన్ని బాటిల్స్ ని ఇంట్లో ఫ్రిడ్జ్ లో అందుబాటులో ఉండే విధం గా చూసుకోండి. ఈ విటమిన్ డ్రింక్ ల లో నీటిలో కరిగే విటమిన్ బి మరియు సి ఉండటం వలన హ్యాంగోవర్ ని తగ్గించడానికి తోడ్పడతాయి. మీరు తాగే ఈ డ్రింక్ లో అధిక శాతం చక్కర లేకుండా చూసుకోండి. ఈ డ్రింక్ ని కొన్ని నీళ్ళతో కలిపి పునర్జలీకరణము కోసం తీసుకోవచ్చు.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

గుడ్లు, నారింజ రసం, సాధారణ తినుబండారాలతో హ్యాంగోవర్ నుండి ఉపశమనం:

ఆరంజ్ జ్యూస్ సాధారణంగా ఇళ్ళలో వాడే హ్యాంగోవర్ నివారిణి. దీనిలో సి విటమిన్ హ్యాంగోవర్ తగ్గించడానికి తోడ్పడుతుంది. అంతే కాక, పునర్జలీకరణము కి కూడా ఉపయోగపడుతుంది. ఈ రసం తో పాటు కొన్ని ఉడకపెట్టిన గుడ్లు మరియు టోస్ట్ చేసిన బ్రెడ్ తీసుకోవచ్చు.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

ఎంటాసిడ్స్ తో హ్యాంగోవర్ కి చికిత్స :

గ్రాన్యులేటెడ్ ఎంటాసిడ్ ని తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ని సోడియం బైకార్బోనేట్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏర్పడిన అమ్లాలని నియంత్రిస్తుంది.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

కాఫీ తో హ్యాంగోవర్ నుండి విముక్తి :

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరి ఒక చిట్కా ఒక కప్పు కాఫీ. రోజు మొత్తం కొంచెం కొంచెం గా కాఫీ ని తీసుకోవాలి. కెఫైన్ బ్లడ్ ప్రెషర్ ని పెంచడం ద్వారా ఆల్కహాల్ త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. దానివల్ల తలనొప్పి, తల తిరగడం వంటివి తగ్గుతాయి.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

కృత్రిమ పునర్జలీకరణము :

పునర్జలీకరణము కోసం వాడే గ్లూకోజ్ పౌడర్ ని నీటితో కలిపి రోజంతా కొంచెం కొంచెం తీసుకోవడం వలన ఉపశమనం ఉంటుంది. వీటిలో అధిక శాతం ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. సహజంగా ఈ పొట్లాలు చిన్నపిల్లలకి డిహైడ్రేషన్ నుండి ఉపశమనం కోసం వాడతారు.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

నొప్పి నివారణ మాత్రలు :

సహజంగా ఇళ్ళల్లో ఉండే నొప్పి నివారణ మాత్రలని హ్యాంగోవర్ లో వాడుకోవచ్చు. ఉదాహరణకి ఆస్ప్రిన్ లేదా ఐబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ వాడవచ్చు. కానీ అతిగా వాడటం ప్రమాదకరం.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

వ్యాయామం : అతి కష్టమైన హ్యాంగోవర్ చికిత్స :

ఈ సందర్భం లో వ్యాయామం అంటే సులభతరం గా పరిగెట్టడం లేదా ట్రేడ్మిల్ వాడటం కొన్ని పుష్ అప్లు చెయ్యటం వంటివి ఉపశమనం కలిగిస్తాయి . వ్యాయామం తరువాత చెమట వల్ల కలిగే డీహైడ్రేషన్ నుండి తక్కువ చక్కర శాతం కలిగిన స్పోర్ట్స్ డ్రింక్స్ ఉపయోగకరం గా ఉంటాయి.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

అల్లం టీ :

హ్యాంగోవర్ సమయం లో కలిగే తల నొప్పులకి అల్లం టీ చాలా మంచి ఔషదం. ఇది తీవ్ర తల నొప్పి నుండి ఉపశమనం కలిగించడమే కాక, కడుపు నొప్పి లేకుండా ఆల్కహాల్ జీర్ణం అవడం లో కూడా సహకరిస్తుంది.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

అరటిపళ్ళు :

ఇది చికిత్స గానే కాక నివారణ గా కూడా పనిచేస్తుంది. బార్ కి వెళ్లబోయే ముందు అరటిపళ్ళను తిని వెళ్తే హ్యాంగోవర్ ప్రభావం కనిపించదు. అరటిపండులో ఉన్న పొటాసియం మరియు కార్బోహైడ్రేట్స్ వల్ల హ్యాంగోవర్ ప్రభావం కనిపించదు.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

భోజనం: హ్యాంగోవర్ రాకుండా ఉండాలంటే డ్రింక్ పార్టీకి ముందు భోజనం చేయండి. ఆ భోజనంలో వెన్న, నెయ్యి అధికంగా తీసుకోండి. అందువలన ఆల్కహాల్ ని లోపల పేల్చుకునే తీరు మారుతుంది. వంటకాలకు వాడిని నూనెలో ఆల్కహాల్ ని అతిగా వంటపట్టనీయదు.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

పాలు: పార్టీకి ముందు పాలు తాగడం వల్ల కూడా హ్యాంగోవర్ ఏర్పడదు.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

నీళ్ళు : పార్టీ సమయంలో మరుసటి రోజు ఏర్పడే హ్యాంగోవర్ గురించి ఆలోచించి నెమ్మదిగా డ్రింక్ తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య ఏర్పడదు. డ్రింక్ మధ్యలో మంచినీళ్ళు లేదా పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. శరీరంలో నీరు తగ్గింతే హ్యాంగోవర్ ప్రభావం పెరుగుతుంది. కాబట్టి నీరు ఎక్కువగా త్రాగాలి.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

నిద్ర: హ్యాంగోవర్ నుండి బయటపడేసే అత్యుతమ మార్గం నిద్ర. ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అంత త్వరగా హ్యాంగోవర్ నుండి బయటపడుతారు. కొన్ని సందర్భాలలో నిద్రపట్టదు లేదా నిద్రపోయేందుకు అవకాశం దొరకదు. కాబట్టి అలాంటప్పుడు హ్యాంగోవర్ నుండి బయటపడే ఇతర మార్గాలను గురించి ఆలోచించాలి

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

పళ్ళరసాలు: పార్టీ సమయంలో మరుసటి రోజు ఏర్పడే హ్యాంగోవర్ గురించి ఆలోచించి నెమ్మదిగా డ్రింక్ తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య ఏర్పడదు. డ్రింక్ మధ్యలో పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. శరీరంలో నీరు తగ్గింతే హ్యాంగోవర్ ప్రభావం పెరుగుతుంది. కాబట్టి పళ్ళరసాలు ఎక్కువగా త్రాగాలి.

మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!

టమోటో జ్యూస్ : టమోటో జ్యూస్ సాధారణంగా ఇళ్ళలో వాడే హ్యాంగోవర్ నివారిణి. దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉండి హ్యాంగోవర్ తగ్గించడానికి తోడ్పడుతుంది. అంతే కాక, పునర్జలీకరణము కి కూడా ఉపయోగపడుతుంది.

English summary

15 Quick Hangover Cures that Actually Work | మోతాదు మించితే నరకమే..హ్యాంగోవర్ సమస్యలు !?

You might be the occasional drinker, an experimental one or a regular at the bar, getting a hangover is always a possibility.
Desktop Bottom Promotion