తేనె: తేనె: కొవ్వు తగ్గించుకోవడానికి ఉదయం పూటీ తీసుకొనే తేనె ఉత్తమమైన మార్గం. తేనెను వేడినీటిలో వేసి బాగా గిలకొట్టి ఉదయం పరగడుపున సేవించాలి. ఇది ఊబకాయస్తులకు ఒక దివ్వ ఔషదం వంటిది. ఈ పద్దతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వేడి నీటిలో తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. తియ్యనైన తేనెను ఏదీ కలపకుండా కూడా తీసుకోవచ్చు. తేనెలోని కార్బో హైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరచి బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రిస్తాయి. బరువు వేగంగా తగ్గాలంటే, షుగర్ కు బదులు తేనెవాడండి.

సెరియల్స్: సెరియల్స్ చాలా త్వరగా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్. ఇది మీకు కావల్సినన్ని కార్బో హైడ్రేట్స్ మరియు ఎనర్జీని మరియు ఫైబర్ ను అంధించి కడుపు ఫుల్ గా ఉండేవిధంగా అనుభూతిని కలిగిస్తుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ: ఇది బ్లాక్ లేదా గ్రీన్ త్రాగండి, గ్రీన్ టీ బరువు తగ్గించడంలో సమర్ధవంతమైనదని ఏకగ్రీవంగా అంగీకరించబడింది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ద్రవాన్ని నియంత్రణ చేయడానికి మరియు బరువు పెరగకుండానియంత్రించడానికి ఉపయోగపడుతుంది, మరియు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు సులభతరం చేస్తుంది. టీ ను రోజుకు రెండు కప్పులు త్రాగేవారిలో 11% మాత్రమే బరువు తగ్గించవచ్చు.

గుడ్డు: గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.

పాలు: పాలలో వివిధ రకాల న్యూట్రిషియన్స్ ఉంటాయి. అందులో కొన్ని మేజర్ న్యూట్సిషియన్స్ కూడా కనుగొనబడింది. విటమిన్స్(ఎర్రరక్తకణాల కోసం), కాల్షియం(బలమైన ఎముకల తయారీకి), మెగ్నీషియం(మంచి నాడీవ్యవస్థ కోసం), ఫాస్ఫరస్(శక్తిని పొందటానికి), పొటాషియం(మంచి నాడీ వ్యవస్థకోసం), ప్రోటీన్స్(అభివృద్ధి మరియు వైద్యం ప్రక్రియ కోసం), రెబోఫ్లెవిన్(ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మం కోసం) మరియు జింక్ (రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి). వంటి పోషకాంశాలను పాలలో కనుగొనబడింది.

పుచ్చకాయ: పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ఓట్ మీల్: ఒక కప్పు ఓట్ మీల్ ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్ మీల్ లోని పీచు... ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీరు ఉత్సాహాంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. కొత్త ఆలోచనలు వచ్చేలా ఉత్తేజపరుస్తుంది. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం అంటే దానిని క్షణాలలో తయారు చేయవచ్చు. పనిలోకి తొందరగా వెళ్ళే వారు మైక్రోవేవ్ లో ఓట్ మీల్ తయారు చేసి రెడీగా తినేయవచ్చు.

కాఫీ: ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగితే కానీ ఉల్లాసంగా అనిపించదు చాలా మందికి. ఉదయమేనా? బద్ధకంగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఇలా పలు సందర్భాలలో కాఫీ తాగి వెంటనే ఉల్లాసాన్ని పొందుతుంటారు. చాలామంది సాధారణంగా కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదంటారు. దీనికి కారణం బహుశ అందులో వుండే, కెఫైన్ అనే మత్తు పదార్ధం అయివుండవచ్చు. కాఫీ అధికంగా తాగితే అనారోగ్యమే. కేఫైన్ నిద్రను తగ్గిస్తుంది. శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది.

ఆరెంజ్: మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అంధించడం మాత్రమే కాదు, శరీరం యొక్క జీవక్రియల రేటును పెంచుతుంది. సిట్రస్ పండ్లలో నిల్వ ఉండే విటమిన్ సి అందుకు బాగా సహకరించడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది. మీ ఫ్లాబ్ తగ్గించడం కోసం ఆసక్తి ఉంటే, అందుకు బ్రేక్ ఫాస్ంట్ లో ఆరెంజ్, తాజా నిమ్మరసం, తీసుకోండి. లేదా తాజా పండ్లను నారింజ, నిమ్మ, జామ వంటివి అలాగే తీసుకోవడం వల్ల కూడా కొవ్వు కరిగించుకోవచ్చు. సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు, ఆరెంజస్ వంటి పండ్లు, కేరట్, కేబేజి, బ్రక్కోలి, యాపిల్, వాటర్ మెలన్ వంటి కూరలు పండ్లు శరీరంలోని కొవ్వును కరగించి, కణాలలోని అధిక నీటిని కూడా పీల్చేస్తాయి.

బ్రౌన్ బ్రెడ్: ఫాస్ట్ ఫుడ్లను ఇష్టపడే వారిని బరువు పెరగకుండా కాపాడే మరో చిరుతిండి కరకరలాడే బ్రెడ్. ఇది ప్రధానంగా తృణధాన్యాలతో తయారౌతుంది - అనేక రుచులు, రకాలలో దొరుకుతుంది. మీరు బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటిస్తుంటే ఇది మంచి పోషకాలిచ్చే చిరుతిండి. కరకరలాడే బ్రెడ్ ఒక ముక్క32కాలరీలను ఇస్తుంది, 0.2 గ్రాముల కొవ్వును కలిగి వుంటుంది, శరీరానికి మేలు చేసి బరువు తగ్గడంలో ఉపకరించే ఈ చిరుతిండిలో ధాన్యం, పీచు పదార్ధం వుంటాయి.

అరటి పండు: అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి. అంతకంటే అధికంగా తింటే వాటిలోని షుగర్ మీ శరీరంలోని షుగర్ స్ధాయి పెంచుతుంది. కనుక మితంగా తినండి.

ఫ్లాక్స్ సీడ్స్: శాకాహారంలో ఫ్లాక్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉన్నాయి. అంతే కాదు ప్లాక్ సీడ్స్ లో గల EPA మరియు DHA లు కూడా ఉన్నాయి. మనలో వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమేగా-3 ఫ్యాట్స్. అవిసెలో ఒమెగా-3 ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుండెజబ్బుల నివారణ కోసం, అధిక రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్‌ను నివారించడానికి అవి ఎంతగానో తోడ్పడే ఈ అవిసె గింజలు బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతాయి.

పెరుగు: కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో ఇతర పోషక విలువలు కూడా వుంటాయి. ఇందులో పుష్కలంగా కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంతటాయి. మీరు బెర్రీలు, గ్రనోలా లాంటి వాటితో కూడా మీగడ వాడవచ్చు.

వీట్ జర్మ: వీట్ జర్మ విటమిన్ ఇ మరియు ఫొల్లెట్ ను పుష్కలంగా అందిస్తాయి. అంతే కాకుండా, ఇది కడుపు నిండుగా ఉంచుతుంది.

బొప్పాయి: బొప్పాయిలో ఉండే విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ, విటమిన్‌ సి చర్మానికి మృదుత్వాన్ని కలుగజేస్తాయి. బొప్పాయి జ్యూసు ఎండ వల్ల వచ్చే మచ్చలను నివారిస్తుంది. దీనితో తయారు చేసిన నూనె, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. వేసవికాలంలో బొప్పాయి ముఖానికి మంచి ఫేస్‌ ప్యాక్‌లా పనిచేస్తుంది. ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు , ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు , ఒక స్పూన్ నిమ్మరసం ముద్దలా తయారుచేసి ముఖానికి పట్టించి , 15 - 20 నిముషాలు ఉంది ముఖం కడుక్కోవాలి . ముఖ చర్మం బిగుతుగాను , కాంతివంతం గాను ఉంటుంది .

బాదాం: బాదం పప్పు, ఇతర గింజల్లో ఏక అసంతృప్త కొవ్వు పదార్ధాలు వుంటాయి కనుక అవి మీ శరీరానికి చాలా మంచివి - మీ ధమనులను శుభ్ర పరుస్తాయి. గింజలు తరువాతి భోజనం వరకు మీకు కడుపు నిండుగా అనిపిస్తుంది. వాటిలో విటమిన్ ఇ, పీచు పదార్ధం, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. గింజల్లో వుండే విటమిన్ ఇ యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి కాన్సర్, ఉబ్బసం, ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో మీ రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది.

బెర్రీస్: బెర్రీస్: తీపి తక్కువ బెర్రీస్ లో బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ముదురు వర్ణంలో ఉండే బెర్రీస్ లో యూరిక్ ఆమ్లం తగ్గించడానికి సహాయం కీలక అంశంగా ఉంటుంది.వీటిని అలాగే తినవచ్చు, ఎండబెట్టిన లేదా జ్యూస్ చేసి త్రాగవచ్చు. దాంతో లాంగ్ టైమ్ హెల్తీ హార్ట్ ను కలిగి స్లీమ్ గా మారవచ్చు.

పీనట్ బట్టర్: పీనట్ బటర్ కాయధాన్యాల కుటుంబానికి చెందినది కాబట్టి గింజల గుణాలు కలిగి వుంటుంది - చక్కటి చిరుతిండి కూడా. రెండు టీ స్పూన్ల పీనట్ బట్టర్ తరువాతి భోజన౦ దాకా మీ ఆకలిని ఆపుతుంది. దీన్ని పళ్ళు, కరకరలాడేవి, లేదా మెత్తగా వుండే వాటితో ఉపయోగించి కావలసినంత బరువు తగ్గవచ్చు.

నీళ్ళు: నీరు : ఇది ఆహారం కాకపోయినా, బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరం లో తేమనుంచుతుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే కొద్ది వారాలలో మీకు ఫలితం కనిపిస్తుంది. వేడి నీటిలో నామ్మరసం, తేనె కలిపి తాగితే కూడా బరువు తగ్గటంలో ఫలితాలు వేగంగా వుంటాయి.

ఆపిల్స్ : యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పోషకాంశాలను అటుంచితే..యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది.

Read more about: health wellness breakfast food healthbenefits ఆరోగ్యం వెల్ నెస్ అల్పాహారం ఆరోగ్య ప్రయోజనాలు
English summary

20 Best Morning Foods For Your Breakfast

There is an old saying, 'morning shows the day'. That is why, we must go out of our way to make our mornings the best time of the day. If you begin your day well, then you usually have a productive day. And what better way to begin your day that having healthy morning foods for breakfast.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X