For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలో రాళ్ళు ,పొట్ట కొవ్వు కరిగించి, క్యాన్సర్ రిస్క్ ను తప్పించే నిమ్మరసం

|

నిమ్మకాయ మనకు లభించే వస్తువుల్లో అతి తక్కువ ధరకు లభించేటటువంటి ఆరోగ్యకరమైన వస్తువు. నిమ్మకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను మనం లెక్కపెట్టడానికి కూడా వీలుపడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకూ నిమ్మకాయను గొంతు నొప్పి నివారణకు మరియు మొటిమల నివారణకు విరివిగా ఉపయోగిస్తారు. నిమ్మరసంలోని ఆరోగ్యప్రయోజనాలు చాల మందికి నిజంగా తెలిసుండకపోవచ్చు. మన శరీరంలోని ప్రతి యొక్క అవయావానికి ఉపయోగపడే వస్తువు నిమ్మకాయ.

20 Ways To Use Lemon For Good Health

నిమ్మకాయలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. క్యాన్సర్ నుండి వయస్సు మీద పడకుండా పోరాడే గుణాలు ఉన్నాయి. ఇవే కాకుండా శరీరాన్ని డిటాక్స్ ఫై చేస్తుంది. ఇంకా దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ కాకుండా అద్భుతమైన సిట్రస్ ఫండు సువాసన కలిగి ఉంటుంది. ఈ వాసన చూస్తే చాలు వికారం, తలనొప్పి వంటివి పరారవ్వాల్సిందే. నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక పానీయంగా భావిస్తారు. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు. నిమ్మ కాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతూంటాయి. నిమ్మరసాన్ని మన దేశ వంటలలో రుచికిగాను విరివిగా వాడుతూంటారు. అంతేకాదు, నిమ్మకాయను ఔషధంగా కూడా కొన్ని అనారోగ్యాలకు ఉపయోగిస్తారు.

కొన్నిరకాల అనారోగ్యాలు నివారించాలన్నా.. వంటకాలకు అదనపు రుచినివ్వాలన్నా.. చింతపండుకు ప్రత్యామ్నాయం వాడాలన్నా.. టక్కున గుర్తొస్తుంది నిమ్మకాయ. విటమిన్‌ 'సి'తో పాటు అదనపు పోషకాలనందించే నిమ్మ మరెన్నో విధాలుగా మేలుచేస్తుంది. మరి అటువంటి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి, ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దామా...

నిమ్మరసం బౌల్ ను క్లియర్ చేస్తుంది:

నిమ్మరసం బౌల్ ను క్లియర్ చేస్తుంది:

గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం మరియు తేనె మిక్స్ చేసి, ఉదయం పరగడుపున త్రాగడం వల్ల మీ బౌల్ క్లీన్ చేయడమే కాకుండా మలబద్దక సమస్యలు లేకుండా తేలికగా జీర్ణం అయ్యే విధంగా ప్రయోజనం కలిగిస్తుంది.

గొంతు సమస్యలు -

గొంతు సమస్యలు -

గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి. గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ కలిగి ఉండటం వల్ల గొంతు సమస్యలు కలిగించే జర్మ్స్ ను చంపేస్తుంది. వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.

యవ్వనంగా ఉండేలా చేస్తుంది:

యవ్వనంగా ఉండేలా చేస్తుంది:

నిమ్మపండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల, మనం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా కనబడుటకు బాగా సహాయపడుతుంది.

అధిక రక్తపోటు నియంత్రణ -

అధిక రక్తపోటు నియంత్రణ -

గుండె జబ్బుల సమస్యలున్నవారికి నిమ్మ రసం నీరు, దీనిలోని పొటాషియం కారణంగా ఎంతో బాగా పని చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి పోగొట్టి మైండ్ కు శరీరానికి విశ్రాంతినిస్తుంది. నిమ్మరసంలో ఉండే బయోఫ్లేవినాయిడ్లు రక్తనాళాలకు బలం చేకూరుస్తాయి. తద్వారా అంతర్గత రక్తవూసావం కాకుండా నివారిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవాళ్లకు నిమ్మ చాలా మంచిది.

వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

నిమ్మను నిత్యావసరంగానే కాదు.. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. నిమ్మరసంలో తేనె కలిపి పుచ్చుకుంటే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. నోట్లో పుండ్లు, పూత.. వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధమిది. రక్తంలో కొవ్వు పేరుకొన్నప్పుడు ప్రతిరోజూ తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది. దీనిలోని సిట్రిక్‌ ఆమ్లం, యాంటీసెప్టిక్‌ సుగుణాలు కడుపులో సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.

కొవ్వును కరిగిస్తుంది:

కొవ్వును కరిగిస్తుంది:

చాలామంది బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు. ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

 వికారాన్ని తగ్గిస్తుంది:

వికారాన్ని తగ్గిస్తుంది:

నిమ్మపండు వల్ల మరో అద్భుత ప్రయోజనం ఉంది. నిమ్మ పండును వాసన చూడటం వల్ల వికారం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జస్ట్ వాసన చూడటం వల్ల మీరు బెటర్ గా ఫీల్ అవుతారు.

రుమాటిజంను నయం చేస్తుంది:

రుమాటిజంను నయం చేస్తుంది:

నిమ్మలో గొప్ప మూత్ర విసర్జన ప్రేరక గుణాలు కలిగి ఉన్నాయి. ప్రాథమికంగా మూత్ర ఏర్పాటు మరియు శరీరం నుండి అధిక నీటిని తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మరసం యూరిక్ యాసిడ్‌ను పలుచన చేసి, కీళ్లనొప్పులు, గౌట్స్ వంటి రుగ్మతల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.

 క్యాన్సర్ తో పోరాడుతుంది:

క్యాన్సర్ తో పోరాడుతుంది:

ఈ సిట్రస్ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల గజ్జి, తామర, చుండ్రు, పొడలు, వ్రణాలు, మొటిమలు, కుష్టు మొదలగు చర్మవ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. అప్పుడే మంచి లాభం ఉంటుంది.

వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

నిమ్మను నిత్యావసరంగానే కాదు.. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. నిమ్మరసంలో తేనె కలిపి పుచ్చుకుంటే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. నోట్లో పుండ్లు, పూత.. వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధమిది. రక్తంలో కొవ్వు పేరుకొన్నప్పుడు ప్రతిరోజూ తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది. దీనిలోని సిట్రిక్‌ ఆమ్లం, యాంటీసెప్టిక్‌ సుగుణాలు కడుపులో సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.

పెద్దప్రేగు క్యాన్సర్ ను అడ్డుకొంటుంది:

పెద్దప్రేగు క్యాన్సర్ ను అడ్డుకొంటుంది:

తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ అనామ్లజనకాలతో పోరడాకలిగే శక్తి ఉండి, పెద్ద పేగుకు క్యాన్సర్ కు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అంతే కాదు కడుపులో నులిపురుగులు ఏర్పడకుండా సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలను అరికడుతుంది:

జీర్ణ సమస్యలను అరికడుతుంది:

నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు పరిష్కరించబడుతాయి. అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట, కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటివి రాకుండా వుంటాయి. పురాతన కాలంలో మీ తల్లులు అమ్మమ్మలు జ్వరం వచ్చినా లేక పొట్ట గడబిడ అయినా ఒక్క గ్లాసు నిమ్మరసంతో వాటిని తగ్గించేవారని మీరు వినే వుంటారు.

నిమ్మరసం టాక్సిన్స్ ను శుభ్రం చేస్తుంది:

నిమ్మరసం టాక్సిన్స్ ను శుభ్రం చేస్తుంది:

ప్రతి రోజూ మనం కాలుష్యం, జంక్ ఫుడ్ తినడం వల్ల టాక్సిన్ ఏర్పడుతాయి. మరి ఈ టాక్సిన్స్ ను తొలగించే గుణం నిమ్మలో పుష్కలంగా ఉండటం వల్ల టాక్సిన్ తొలగించడంతో పాటు ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

నోటి ఆరోగ్యానికి :

నోటి ఆరోగ్యానికి :

దంతాలను మెరిపిస్తాయి. నిమ్మతొక్కతో దంతాల మీద స్ర్కబ్(రుద్దడం)వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్(దంతావదానం/పళ్ళు రుద్దుకోవడం)చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.

యాంటీ సెప్టిక్:

యాంటీ సెప్టిక్:

మీకు పొరపాటున చేయి తెగిన లేదా గాయాలైనా వెంటనే మీరు నిమ్మతొక్కను రుద్దడం వల్ల ఇది గొప్ప యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. అలా రుద్దడం వల్ల కొద్దిగా మంట అనిపించవచ్చు, కానీ మంచి ఫలితాన్ని అంధిస్తుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలు నిమ్మలో మెండుగా ఉన్నాయి. ఇది చర్మానికి యాంటీసెప్టిక్ గా పనిచేసి మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది . అందువల్లే ఇది ఒక బెస్ట్ బ్యూటీ వస్తువుగా చర్మానికి ఉపయోగిస్తారు.

చర్మ కాంతి -

చర్మ కాంతి -

నిమ్మరసం చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని సంరక్షించి చర్మ కాంతిని కలిగిస్తుంది. నిమ్మరసం రోజూ తాగితే, ఆరోగ్యం మెరుగుపరచి వయసు కనపడనివ్వకుండా కూడా చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు ఉన్నాయి. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగారింపు వచ్చేలా చేస్తుంది.

క్లీన్ వైజిన:

క్లీన్ వైజిన:

శరీరంలో కొన్ని సున్నితమైన ప్రదేశాలు శుభ్రం చేయడానికి కొన్ని కెమికల్స్ ప్రొడక్ట్స్ చర్మానికి హాని కలిగిస్తాయని మీరు భయపడుతుంటే మీరు నేచురల్ పద్దులతను పాటించవచ్చు. అందుకు నిమ్మ బాగా సహాయపడుతుంది.

మంచి కంటి చూపునందిస్తుంది:

మంచి కంటి చూపునందిస్తుంది:

నిమ్మకాయలో రూటిన్ అనే మూలకం ఉంటుంది. ఈ మూలకం కంటి చూపును మెరుగుపరచడంతో పాటు, రెటీనా సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది:

కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది:

ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది సాధారణ సమస్యగా మారింది. అందుకు కారణం తక్కుగా నీళ్ళు తాగడం, క్యాల్షియం అధికంగా ఉండటం చేత కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అలాగే యూరిన్ ఎక్కువ సేపు పోకుండా అలాగే ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏమికాదు క్యాల్షియం నిక్షేపాలు నిల్వ ఉంటాయి. వీటిని కిడ్నీస్టోన్స్ అంటాం. కాబట్టి వాటిని కరిగించడానికి ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరంలో అధిక కాల్షియంను తొలగించడానికి నిమ్మకాయం బాగా పనిచేస్తుంది.

English summary

20 Ways To Use Lemon For Good Health

Lemon is one of the cheapest sources of good health available to us. You cannot even count the number of health benefits that lemon has. This citrus fruit packs a punch of good health in its tiny form. As they say, good things come in small packages. That is why, the uses of lemon for maintaining good health are second to none other.
Desktop Bottom Promotion