For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

  By
  |

  మెదడుకు మేత అనగానే బ్రెయిన్‌ను చురుగ్గా ఉంచేందుకు గళ్ల నుడికట్లూ, ప్రహేళికలూ అని అనుకోకండి. ఇది నోటి ద్వారా తీసుకునే ఆహారమే. కాకపోతే ఏ ఆహారపదార్థాలు మెదడును మందకొడిగా లేకుండా చేస్తాయో, ఏవి చురుగ్గా ఆలోచించేలా చూస్తాయో, ఏవి ఒక వయసు దాటాక మనిషిలో పెరిగే మతిమరపు, మానసిక స్థితి లాంటి మెదడుకు సంబంధించిన రుగ్మతలను మరింత ఆలస్యం అయ్యేలా దూరంగా నెడతాయో ఆ ఆహారం అన్నమాట.

  ఆ ఆహారపదార్థాలను గురించి తెలుసుకుంటే ముందునుంచీ వాటిని తీసుకుంటూ వృద్ధాప్యంలో మెదడుకు వచ్చే అనేక సమస్యల నుంచి దాన్ని దూరంగా ఉంచవచ్చు. అటువంటి ఆహారాలు మెదడును చురుకుగా ఉంచే ఆహారాలు మెదడుకు మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.

  Healthy Foods To Boost Brain Power

  ఈ ఆహారాల్లో ఉండే కెమికల్స్ పిల్లల ఐక్యూను పెంంచడంలో బాగా సహాయపడుతుంది. ఇటువంటి ఆహారాలు పిల్లల రెగ్యులర్ డైల్ చేర్చడం వల్ల వారి అన్నింట్లో ఫస్ట్ ఉంటారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఇటువంటి ఆహారాలు పిల్లలకు చాలా అవసరం. వారు మెంటలీ స్ట్రెగా ఫీలవ్వరు. కాబట్టి మెదడు మేత ఎంత అవసరమో అవగాహన కోసమే ఈ ఆర్టికల్...

  మీకు తెలుసా... మన మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం 2 శాతమే. కానీ గుండె నుంచి పంప్ అయిన రక్తంలో 15 శాతం దానికి విధిగా వెళ్లాల్సిందే! మనం పీల్చే ఆక్సిజన్‌లో 20 శాతం అది స్వీకరించాల్సిందే. అంతేకాదు... మనకోసం తయారయ్యే శక్తిలో ఐదోవంతు అది వినియోగించాల్సిందే. తాను సక్రమంగా పనిచేయాలంటే అవసరమైన భాగమది! పంపకాల్లో ఎక్కువమొత్తాన్ని 'సింహభాగం' అంటుంటారు కదా... అలాగే శరీరంలో ఏయే భాగాలు ఎంతెంత తీసుకుంటాయన్న ప్రాతిపదికన దీన్ని 'మేధభాగం'అనవచ్చు.

  MOST READ:జుట్టు నల్లగా సహజరంగుతో నిగనిగలాడాంటే: ఆయుర్వేద టిప్స్

  ఆరోగ్యకరమైన వ్యక్తి మొత్తం బరువు 60 నుంచి 70 కిలోలు అనుకుంటే, అందులో మెదడు బరువు కేవలం 1400 గ్రాములు. అయినప్పటికీ, మెదడు ఇంత పెద్దమొత్తంలో ఆక్సిజన్, రక్తం, శక్తి ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే... బరువు ప్రకారం చూస్తే ఇంత చిన్నదైనప్పటికీ, తాను నిర్వహించే విధుల ప్రకారం చూస్తే మాత్రం మన ప్రతి కదలికా, మన ప్రతి ఆలోచనా, మన ప్రతి పనీ లెక్కప్రకారం అన్నీ దానివే! అందుకే మన ఆహారంలో అంతటి భాగాన్ని అది డిమాండ్ చేస్తుంది. అలాంటి మెదడు చురుగ్గా ఉండటానికి, పదికాలాలపాటు హాయిగా పనిచేయడానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో తెలుసుకుందాం...

  MOST READ:ఇక్క‌డ‌ పుట్టుమ‌చ్చ‌లుంటే మీరు చాలా దుర‌దృష్ట‌వంతులు!

  వాల్స్ నట్స్:

  వాల్స్ నట్స్:

  వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మీరు 19శాతం మెమరీని పవర్ ను మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.

  కాఫీ:

  కాఫీ:

  కాఫీలోని కెఫిన్ మెదడు చురుగ్గా ఉండటానికి బూస్ట్ వంటిదని చెబుతుంటారు . కానీ కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఒకటి, రెండు కప్పుల కాఫీ కంటే ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్తపడండి.

  చేపలు:

  చేపలు:

  చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు మెదడును చురుకుగా ఉంచడంలో బాగా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ పవర్ అభివృద్ధి చెందుతుంది.

  గ్రీన్ లీఫ్:

  గ్రీన్ లీఫ్:

  శరీరం మొత్తం మరియు మెదడుకు విస్తరించిన రక్తనాళాలకు అవసరం అయ్యే మెగ్నీషియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బెయిన్ పవర్ కు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా అవసరం.

  ఆలివ్ ఆయిల్ :

  ఆలివ్ ఆయిల్ :

  వెజిటేబుల్ ఆయిల్ నుండి ఆలివ్ ఆయిల్ కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో కీళ్ళు మరియు మెదడు కణాలకు ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫోలిఫినాయిల్స్ ను అధికంగా కలిగి ఉంటాయి.

  MOST READ:మీకు వచ్చే కలలు ఏమని సూచిస్తాయో తెలుసా ?

  ఫ్లాక్ సీడ్స్:

  ఫ్లాక్ సీడ్స్:

  ఇవి చూడటానికి చాలా చిన్న సైజులో ఉండవచ్చు. కానీ ఈ చిన్న వాటిలోనే పుష్కలమైన ప్రోటీన్స్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది. ఈ విత్తనాలు బ్రెయిన్ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. వీటిని పెరుగు లేదా సెలరల్స్ లో మిక్స్ చేసుకొని తినవచ్చు.

  ముస్సేల్స్:

  ముస్సేల్స్:

  ఈ ఆహారంలో మెదడు కణాలు నిరోధించడానికి సహాయపడే విటమిన్ B12అత్యధిక స్థాయిలో ఉన్నాయి. వీటని నెలలు వారిగా తీసుకోవడం కూడా మీకు మేలు జరుగుతుంది.

  చాక్లెట్:

  చాక్లెట్:

  మెదడుకు రక్త ప్రవాహం మెరుగుపరచడం కోసం మిల్క్ చాక్లెట్ కంటే, డార్క్ చాక్లెట్ ఎక్కువగా సహాయపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే డార్క్ చాక్లెట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

  పెరుగు:

  పెరుగు:

  చిక్కటి పెరగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించి అన్నిపనులకు మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఆహారం.

  ఆస్పరాగస్:

  ఆస్పరాగస్:

  డిప్రెషన్ తో ఎవరైతే బాధపడుతుంటారో, వారు తక్కువ ఫోల్లెట్ లెవల్స్ ను కలిగి ఉంటారు. కాబట్టి, ఆస్పరాగస్ తీసుకోవడం వల్ల ఇది మెదడుకు సంబందించిన డిప్రెషన్ మరియు ఇతర హానికరమైన సమస్యలను నివారించడంలో ఆస్పరాగస్ బాగా సహాయపడుతుంది.

  పుదీనా:

  పుదీనా:

  తాజా పుదీనా వాసన మెదడు పనితీరు పెంచడానికి మరియు మెదడుకు హెచ్చరించడానికి, మెదడు చురుకుగా ఉండాటానికి సహాయపడుతుంది. బ్రెయిన్ పవర్ పెంచుకోవాలంటే ఒక కప్పు పెప్పర్ మింట్ టీ తాగండి.

  బ్లూ బెర్రీస్:

  బ్లూ బెర్రీస్:

  ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా, ఇవి మొత్తం శరీర ఆరోగ్యంతో పాటు, బ్రెయిన్ ఫుడ్ గా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది మెదడును చురుకుగా ఉంచడంతో పాటు మిమ్మల్ని యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

  MOST READ:మీ రాశిని బ‌ట్టి శృంగారంలో మీకు స‌రైన జోడి ఎవ‌రో తెలుసుకోండి!

  పసుపు:

  పసుపు:

  భారత దేశంలో అల్జీమర్స్ వ్యాధి వరల్డ్ లోయస్ట్ రేట్ కలిగి ఉంది. ఎందుకంటే, భారతదేశపు వంటకాల్లో కొన్ని మసాలా దినుసులు జోడించడం వల్ల మెదడుకు సంబంధించిన కొన్ని ప్రమాధకరమైన వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు. ఆల్జీమర్స్ వ్యాధి మెదడులో ఒక వాపును కారణం అవుతుంది. పసుపు మసాలా దినుసుల్లో ఒకటి కాబట్టి మన రెగ్యులర్ డైల్ లో దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

  స్ట్రాబెర్రీస్ :

  స్ట్రాబెర్రీస్ :

  స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మెదడను మరియు మెమరీని రక్షించే కొన్ని కాంపౌండ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి స్ట్రాబెరీలను తరచూ తీసుకోవడం చాలా అవసరం.

  అవొకాడో:

  అవొకాడో:

  మెదడుకు సహాయపడే మంచి కొవ్వులో ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్త ప్రవాహాన్నిపెంచి మెదడు ఆరోగ్యంగా ఉండటంలో ఇది కూడా సహాయపడుతుంది.

  టమోటో:

  టమోటో:

  మెదడు కణాలను డ్యామేజ్ చేసి ఫ్రీరాడికల్స్ నుండి రక్షించడానికి, లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ టమోటోలో పుష్కలంగా ఉన్నందున, టమోటోలను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం ముఖ్యం.

  అరటి పళ్ళు:

  అరటి పళ్ళు:

  ఈ స్వీట్ ఎల్లో ఫ్రూట్ లో మెదడు పెరుగుదల మరియు బ్రెయిన్ ఫంక్షన్స్ కు చాలా అవసరం అయ్యే మ్యాంగనీస్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల అరటి పండ్లను తరచూ తింటుండాలి.

  గుడ్డులో పచ్చసొన:

  గుడ్డులో పచ్చసొన:

  గుడ్డు పుష్కలమైన న్యూట్రీషియన్ ఆహారం. ఇది బ్రెయిన్ పవర్ ను పెంపొందించడంలో బాగా సహాయపడుతుందని రుజువు చేయబడ్డాయి. ఇందులోని పోషకాంశాలు బ్రెయిన్ సెల్స్ కు హెచ్చరికలను అంధజేసే పోషకాంశాలు మెండుగా ఉన్నాయి.

  ధాన్యపు ఆహారం:

  ధాన్యపు ఆహారం:

  ధాన్యంతో తయారు చేసిన ఆహారాలు, బ్రెడ్, మిల్లెట్, మరియు క్వీనా వంటివి మెదడకు అద్భుతమైన ఆహారాలుగా పరిగణిస్తారు. ఈ ఆహారాలు ప్రసరణ మెరుగుపరచడానికి మరియు అవసరమైన ఫైబర్స్ మరియు విటమిన్లు అంధించడానికి సహాయపడుతాయి.

  బీట్ రూట్:

  బీట్ రూట్:

  బీట్ రూట్ డిప్రెషన్ ఫైటింగ్ వెజిటేబుల్, ఇందులో పుష్కలమైన విటమిన్ B ఉండటం వల్ల ఇది త్వరగా విషయాలను జ్ఞాపకాల ద్వారా,సమర్థవంతంగా మెదడుకు చేరవేసేందుకు సహాయపడుతుంది.

  కొబ్బరి నూనె:

  కొబ్బరి నూనె:

  వంటకాల్లో కొద్దిగా కొబ్బరి నూనెను కలపడం వల్ల. బ్రెయిన్ పవర్ పెంపొందించడంలో కొన్ని అద్భుతాలను చేస్తుంది. మెదడుకు ఇంధనంగా ఇది కీటోన్స్ ను సృష్టిస్తుంది.

  ఓట్స్:

  ఓట్స్:

  ఈ కార్బోహైడ్రేట్ రిస్ ఫుడ్ మెదడుకు కావల్సిన శక్తిని అంధిస్తుంది. ఒక కప్పు ఓట్స్ మరియు పండ్లు తీసుకోవడం వల్ల, మెమొరీ పవర్ పెంచి మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది.

  MOST READ:బాడీ డిటాక్సిఫై చేస్తాయి బరువు తగ్గిస్తాయి ఈ డ్యూరిటిక్ ఫుడ్స్

  గుమ్మడి గింజలు:

  గుమ్మడి గింజలు:

  ఈ గుమ్మడి గింజల్లో ట్రప్టోఫోన్ అనే మోనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలను కూడా సాంఘిక ఆందోళన తగ్గించే సరైన న్యూరోట్రాన్స్మిటర్ పనితీరును అవసరం!

  ఎండు ద్రాక్ష:

  ఎండు ద్రాక్ష:

  ఎండు ద్రాక్ష మెమరీ పవర్ పెండంలో బాగా సహాయపడుతుంది. మెమరీ పవర్ మెరుగుపరచడానికి ఇందులో బోరాన్ అనే ఒక శక్తివంతమైన సమ్మేళన మూలకం ఉంది.

  బ్రొకోలీ:

  బ్రొకోలీ:

  ఈ గ్రీన్ ఫేవరెట్ వెజిటేబుల్ లో విటమిన్ కె పుష్కలంగా ఉంది. బ్రోకలీ మెదడు పనితీరును సమర్ధంగా మరియు brainpowerమెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.

  సాజ్:

  సాజ్:

  ఒక గుప్పెడు సాజ్ ను మీ టీలో జోడించడం వల్ల మెమరీ శక్తిని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి సాధారణ టీ ఒకకప్పు తీసుకొనే బదులు, కొద్దిగా సేజ్ ను టీలో చేర్చడం వల్ల మెమరీ పవర్ కు బాగా సహాయపడుతుంది.

  బ్లాక్ కర్రెంట్:

  బ్లాక్ కర్రెంట్:

  ఈ పండ్లు మానసిక చురుకుదనం పెంచడానికి శక్తి గల విటమిన్ సి కలిగి ఉంటుంది.

  చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే

  చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే

  నీళ్ళు: బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే నీళ్ళు చాలా అవసరం. మీ మానసిక స్థితికి నీళ్ళు చాలా అవసరం. మరియు శరీరం హైడ్రేషన్ లో ఉంచడానికి కూడా నీటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి, ప్రతి రోజూ కనీసం 7-8గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి.

  చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే

  చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే

  చెర్రీస్: రెడ్ చెర్రీస్ ఒక సాధారణ బ్రెయిన్ ఫుడ్. రెడ్ చెర్రీస్ తీసుకోవడం వల్ల ఒక గంటలోనే మెదడు శక్తిని వేగంగా పెంచుతుంది.

  చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే

  చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే

  ఆపిల్స్: ఈ రెడ్ ఆపిల్స్ ను కెమికల్స్ పార్కిన్సన్ మరియు అల్జీమర్ వంటి న్యూరోజనరేటివ్ వ్యాధులు ట్రిగ్గర్స్ ఏ నష్టం జరగకుండా మెదడును రక్షిస్తాయి.

  English summary

  30 Healthy Foods To Boost Brain Power

  Today, with so many things happening around us, our brain feels tired and dysfunctional. Our brain needs a constant boost and we being owners of our brain, need to provide it with the best natural medicine.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more