For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్ మీల్ నిజంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుందా

By Derangula Mallikarjuna
|

తెల్లని ఓట్స్ తో తయారుచేసే ఓట్ మీల్ చాలా సాధారణ ఆహారం. వోట్స్ వారి ఊక మరియు చాలా చిన్నగా తయారుచేయబడే తృణధాన్యాలు. అందువల్ల , ఓట్స్ ల అత్యధికంగా న్యూట్రీషియన్ ఉంటాయి . ఈ ఓట్స్ గుండె పనితీరును మెరుగుపరచడానికి మరియు శరీర విధులు మరియు జీవక్రియ పెంచడానికి , కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వోట్స్ కొంత అదనపు బరువు కూడా తగ్గిస్తుందని,అందుకే ఈ మద్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది.

చాలా మంది వోట్మీల్ వినియోగం వల్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుందని భావిస్తారు . ఓట్మీల్ తో తయారుచేసే అనేక ప్యాజ్ ఫుడ్ మరియు తక్షణం తయారుచేసుకగల ఓట్మీల్ ఉత్పత్తులు మార్కెట్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓట్ మీల్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల చాలా మంది వారి బరువు తగ్గించుకోవలిగారని అనేక రుజువు వివరణలు మరియు ఉదాహరణలు ఉన్నాయి . కానీ, బరువు తగ్గడానికి ఒక్క ఓట్మీల్ ఒక్కటే బాధ్యత వహించదు . ఓట్ మీల్ ను అనేక ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. ఓట్స్ లో విటమిన్స్ , ఫైబర్ , ఖనిజాలు మరియు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి . వోట్స్ బరువు తగ్గించడం మాత్రమే కాకుండా గుండె లోపాలు మరియు గుండె వ్యాధులు నిరోధించడానికి సహాయపడుతుంది.

Does oatmeal really lead to weight loss?

వోట్స్ బరువు తగ్గించడంలో ఏవిధంగా సహాయపడుతాయిని వాటి గురించి రుజువులు మరియు వాస్తవాలను ఈ క్రింది విధంగా చర్చించబడ్డాయి. -

1. అధిక ఫైబర్ ఉన్నటువంటి ధాన్యం - వోట్స్ లోకరిగే మరియు కరగని ఫైబర్ రెండు గొప్పగా ఉన్నాయి. అధిక ఫైబర్ ఉన్న ఆహారం ఓట్స్ కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది . అలాగే, వోట్స్ డైట్ మీరు ఆహారంగా తీసుకోవడం వల్ల మీ కడుపు నిండుగా ఉన్న అనుభూతి చేయడానికి సహాయపడుతుంది మరియు మీకు ఆకలిని అవ్వనివ్వదు. బరువు తగ్గడానికి, మరియు మీ ఆకలిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆరోగ్యకరంగా తినాలి. హై ఫైబర్ డైట్ మీ మొత్తం ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

2. అధిక శక్తి కలిగినటువంటి ధాన్యం - వోట్స్ శరీరానికి అధిక శక్తి అందించడానికి మరియు శరీరం యొక్క పని పెంచడానికి సహాయపడుతాయి . అందువల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం, ఒక బౌల్ ఓట్స్ రోజంతా మీరు పనిచేయడానికి అవసరం అయ్యే మొత్తం శక్తిని అంధిస్తుంది . ఈ అధిక శక్తి శరీరం జీవక్రియల రేటును పెంచుతుంది అందువల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను కరిగిస్తుంది. ఓట్స్ డైట్ బరువు తగ్గించడానికి చాలా బాగ సహాయపడుతుంది. దాంతో శరీరానికి తగినంత శక్తిని అంధిస్తుంది.

3. యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ అధికంగా ఉంది: ఓట్స్ లో అత్యధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి ఇది టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు శరీరాన్ని ఉత్తేజపరస్తుంది . ఈ అధిక యాంటీఆక్సిడెంట్స్ అనవసరపు విషాన్ని శరీరం నుండి తొలగిస్తుంది . శరీరంలో చేరిన టాక్సిన్స్ ను తొలగిస్తుంది, దాంతో బరువు తగ్గిస్తుంది మరియు శరీర వ్యవస్థ శుభ్రపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని క్రియలు సక్రమంగా జరగడానికి మరియు జీవక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

4. లో క్యాలరీలు కలిగిన ధాన్యం - ఇతర ఆహారాలు పోలిస్తే వోట్స్ లో కెలోరీలు తక్కువ . అందువల్ల బరుతు తగ్గించుకోవడంలో ఈ ఓట్స్ ను చూపించడం జరిగింది. లోక్యాలరీ ఫుడ్స్ శరీరంలోని ఎక్స్ ట్రా ఫ్యాట్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది . ఓట్స్ చాలా తక్కువ సాంద్రత కలిగిన ఆహారం మరియు బరువుతగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో ఓట్స్ మాత్రమే సరిపోదు, ఓట్స్ త పాటు కొన్ని డైటరీ ఫుడ్స్ తో తీసుకోవాలి.

5. తయారుచేయడం సులభం: ఓట్స్ తృణధాన్యాలు ఆరోగ్యంగా ఉంటాయి . ఇతర తృణధాన్యాలన్నింటిలోకి వోట్స్ యొక్క ప్రధాన ప్రయోజనం వాటిని ఉడికించడానికి మరియు తినడానికి చాలా సులభంగా ఉంటుంది . వోట్స్ గంజి గా ఉపయోగించవచ్చు . వోట్స్ పండ్లు, పాలతో కలిపి తినవచ్చు. ఈ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ కోసం ఓట్స్ తో వివిధ రకాల ఆహారాలు తయారుచేస్తున్నారు. వాటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఓట్స్ వాటి ఇన్ స్టాట్ గా మరియు ప్యాక్ చేసినవైనా వాటిలో న్యూట్రీషియన్ వ్యాల్యూస్ ఏమాత్రం తగ్గవు. ఇవన్నీ కలిపి మొత్తం మీద బరువుతగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి నిరూపించబడ్డాయి.

English summary

Does oatmeal really lead to weight loss?

Does oatmeal really lead to weight loss.
Story first published: Monday, December 23, 2013, 14:15 [IST]
Desktop Bottom Promotion