For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపు ఉబ్బరంతో పోరాడే 10 ఉత్తమ ఆహారాలు

|

కడుపులో గ్యాస్‌, కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది వైద్యున్ని సంప్రదించడం సాధారణమైంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గమనించాలి.

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కడుపు ఉబ్బుకొని పైకి కనబడుతుంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మీ కడుపు నిండుగా ఉన్నట్లు మరియు అన్ని సమయాల్లో టైట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం వల్ల ఉదరభాగం బిగదీసుకు పోయి పట్టేసినట్లు ఉండి, అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన, ఒళ్లు నొప్పులు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి వివిధ లక్షణాలు అన్నీ కాని, లేదా వీటిలో కొన్ని కాని ఉంటాయి. ఇలా అనిపించడానికి ప్రధానకారణం కడుపు ఉబ్బరం. మరియు మీకు అనిపించవచ్చు ఎందుకు ఇలా కడుపు ఉబ్బరంగా ఉందని? కడుపు ఉబ్బరం అంటే కడుపులో ఎక్సెసీవ్ గ్యాస్, ఉడటం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. మలబద్దకం, ఎక్కువగా తినటం, చెడు ఆహారపు అలవాట్లు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు గాలి మింగడం, చీకాకు పెట్టే పేగు వ్యాధి మరియు pms(బహిష్టకు పూర్వ లక్షణంతో)కడుపు ఉబ్బరానికి సాధారణ కారణాలు.

కాబట్టి మీరు తీసుకొనే డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకు మీరు ఒక కఠినమైన డైట్ ను అనుసరించాల్సిన పనిలేదు కానీ, మీ డైట్ లో కొన్ని మంచి ఆహారాలను, అదీ కడుపు ఉబ్బరంతో పోరాడే లక్షణాలు కలిగిన ఆహారాల తీసుకోవడం వల్ల అవి కడుపులో ఎసిడిటిని నిరోధిస్తాయి మరియు జీర్ణక్రియ క్రమంగా జరిగేలా సహాయపడుతాయి . కొన్ని వెజిటేబుల్స్ లో ఉన్న ఎంజైములు పొట్టలో ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడుతాయి దాంతో తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి . సరైన టైమ్ లో భోజనం తినకపోయినా లేదా స్కిప్ చేసి కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. దాంతో అధిక ఆమ్లత సమస్యలు మరియు ప్రేగులలో గ్యాస్ ఏర్పాటు ఉంటుంది.

కడుపు ఉబ్బరంతో పోరాడేటటువంటి కొన్ని ఉత్తమ ఆహారాలు ఇక్కడ అంధిస్తున్నాం. ఇవి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే, శాశ్వత పరిష్కారం ఉంటుంది.

ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను జోడించాలి:

ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను జోడించాలి:

ఫైబర్ ఫుడ్స్ గ్రీన్ లీప్స్, వెజిటేబుల్స్, మొలకలు మొదలగునవి మీ డైట్ కు ఫైబర్ ను చేర్చుతుంది. ఫైబర్ మలబద్దకాన్ని నివారించడంలో మరియు అపానవాయును తగ్గించడంలో సహాయపడుతుంది.

నిమ్మతో కలిపిన నీళ్ళు:

నిమ్మతో కలిపిన నీళ్ళు:

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, కొంత మంది ద్రవాలు త్రాగడాన్ని నిరాకరిస్తుంటారు. కాబట్టి, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని ద్రావాలను కొద్దిగా కొద్దిగా త్రాగడం చాలా అవసరం. ముఖ్యంగా, గోరువెచ్చని నీటికి నిమ్మరసం మిక్స్ చేసి త్రాగడం వల్ల ఒక అద్భుత మ్యాజిక్ చేస్తుంది. త్రాగిన 30నిముషాల్లోనే మీరు ఫలితాన్ని గమనించవచ్చు. ఈ డ్రింక్ ను మీరు ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం మొదలు పెడితే మరింత ఉత్తమ ఫలితాలను పొందచ్చు.

బొప్పాయి:

బొప్పాయి:

కడుపు ఉబ్బరంతో పోరాడే ఉత్తమ ఆహారాల్లో బొప్పాయ ఒకటి . బొప్పాయలోని ఎంజైమలు మీరు తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అందువలనే ఈ లిస్ట్ లో చేర్చబడింది. బొప్పాయను పెరుగుతో పాటు తీసుకోండి. ఈ రెండింటి మిశ్రమం చాలా టేస్టీగా ఉంటుంది. మరియు జీర్ణం కూడా చాలా తేలికగా అవుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

మీ రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను చేర్చడం వల్ల, వీటిలోని మెగ్నీషియం పుష్కలంగా ఉండి మలబద్దకాన్ని నివారించే లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే పొట్టలో చేరిన గ్యాస్ మరియు అధనపు నీరును శరీరం నుండి తొలగిస్తుంది. దీనిలో ఇంకా ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఓట్స్ :

ఓట్స్ :

ఓట్ మీల్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ . ఇది కేవలం కడుపు నింపడమే కాదు రిప్లక్సన్ కు కారణం కాదు. మీ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ చేర్చుకోవడం మీకు ఇష్టంలేకపోయినా, వీటని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కడుపు ఉబ్బరంతో పోరాడే లక్షనాలు ఇందులో పుష్కలంగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు కనుగొనపబడింది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

పుచ్చకాయ డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని అదనపు నీటిని ఫ్లష్ చేస్తుంది, జీర్ణవ్యవస్తను ప్రశాంతపర్చుతుంది. ఒక కప్పు నిండుగా కీర దోస ముక్కలు లేదా వాటర్ మెలో ముక్కలు తీసుకోవడం వల్ల కొన్ని అద్భుతలాను మీరు చూడవచ్చు.

బీన్స్ :

బీన్స్ :

బీన్స్ మరియు లెంటిల్స్ లో అధిక శాతంలో పొటాషియం మరియు ఫైబర్ కలిగి ఉంటుంది. సోడియం మరియు పొటాషియం సంతులనం చేయడానికి అపానవాయువు నివారించేందుకు సహాయపడుతుంది. బీన్స్ లో ఉన్న ఈస్ట్రోజన్ మహిళల రుతుక్రమ సమయంలో కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరగులో ఒక మంచి ల్యాక్టో బాసిల్లస్ ఉండి, ఇది ప్రొబయోటిక్ గా పనిచేస్తుంది. ఇది డీస్ట్రెస్సింగ్ స్టొమక్ బ్లోటింగ్ ను తగ్గిస్తుంది. పాలలాగ ఇది అపానవాయువుకు కారణం కాదు. మరియు అసౌకర్యానికి గురిచేయదు.

ప్రొసెస్డ్ ఫుడ్స్ ను నివారించాలి:

ప్రొసెస్డ్ ఫుడ్స్ ను నివారించాలి:

ప్రొసెస్డ్ ఫుడ్స లో అత్యధిక సోడియం ఉండటం వల్ల సోడియం, పొటాషియం బ్యాలెస్స్ ను అసౌకర్యం కలిగించి జీర్ణవ్యవస్థను అడ్డుకుంటుంది. క్యాన్డ్ లేదా ప్యాక్ చేసిన ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శాశ్వతంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది

Story first published: Thursday, November 14, 2013, 17:59 [IST]
Desktop Bottom Promotion