For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో సంతానలేమికి కారణం అయ్యే పిసిఒఎస్

|

ప్రస్తుత రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ సిండ్రోమ్ (పిసిఒఎస్) ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్న స్త్రీలకు పీరియడ్స్‌ సరిగా రాకపోవడం, బరువు బాగా పెరిగి లావు కావడం, శరీరంలోని వివిధ భాగాల్లో అనవసర వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి మందులు వాడి జీవన విధానాన్ని మార్చుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.15నుంచి 30 సంవత్సరాల వయస్సులోపు మహిళలు పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ సిండ్రోమ్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లోని మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించగా నేడు మనదేశంలోని స్త్రీలలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం విచారకరం. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామలేమి, పోషశకాహార లోపం మరియు చెడు అలవాట్లు ధూమపానం, లేదా మద్యం త్రాగడం వంటి సంతానోత్పత్తి మీద అనేక దుష్ర్పభాలను చూపెడుతుంది.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ యొక్క లక్షణాలు: ఈ వ్యాధిగ్రస్థుల్లో పీరియడ్లు సక్రమంగా రావు. ఆలస్యంగా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు బ్లీడింగ్‌ తక్కువ కావడం, ఎక్కువ కావడం జరుగుతుంది. అండం సరిగా విడుదల కాకపోవడం వల్ల బ్లీడింగ్‌ ప్రా రంభమవుతుంది. ఓవరీస్‌ సైజు పెరిగి వాటిలో నీటి బుడగల మాదిరి గా ఏర్పడతాయి. ఓవరీస్‌ పొర మందంగా మారుతుంది. హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఇటువంటి మహిళల్లో ఆండ్రోజన్‌ హార్మోన్‌ (మేల్‌ హార్మోన్‌) ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పీరియడ్స్‌ సరిగా రాక వారు ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడతారు. పిల్లల పుట్టడానికి వారిలో అడ్డంకులు ఎదురవుతాయి. అధిక బరువు వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడుతుంది. దీంతో వారికి మధుమేహ వ్యాధి కూడా వస్తుంది.

నేడు ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నా రు. మహిళల జీవన విధానం సరిగ్గా లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి వారిలో హార్మోన్ల సమ తుల్యత లోపిస్తుంది. దీనితో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్థులు పొట్ట, నడుము, కింది భాగంలో ఎక్కువ లావుగా ఉంటారు. ఛాతి, భుజాలు, కాళ్లు సన్నగానే ఉంటాయి. వీళ్లు బరువు తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతారు. వ్యాయామాలు చేస్తే బరువు తగ్గినా మాని వేయగానే వెంటనే పెరిగిపోతారు.

పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ డిసీజ్‌ వ్యాధిగ్రస్థులు ప్రతిరోజు వ్యాయామం తప్ప నిసరిగా చేయాలి. వాకింగ్‌, రన్నింగ్‌, యోగా, ఏరోబిక్స్‌ చేయాలి. తీసు కునే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ద వహించాలి. ఆహారంలో ప్రోటీ న్లు, విటమిన్లు అవసరమైన మేరకు ఉండేటట్టు చూసుకోవాలి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ను హార్మోనులను సమతుల్యం చేసుకోవడవ ద్వారా నయం చేసుకోవచ్చు. పిసిఓఎస్ నివారించడానికి వ్యాయామంతో పాటు హెల్తీ డైట్ ను తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ డి అధికంగా ఉండే విధంగా చూసుకుంటే పిసిఓఎస్ ను సులభంగా నివారించుకోవచ్చు. ఇంకా ఒమేగా 3ఫ్యాటీయాసిడ్స్ మహిళలకు చాలా మంచిది. లోగ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కూడా చాలా మేలు చేస్తాయి. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

1. సాల్మన్:

1. సాల్మన్:

సాల్మన్ లో ఒమేగా3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు లోగ్లైసిమిక్ ఇండెక్స్ కూడా అధికంగా ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడుతాయి . అలాగే సాల్మన్ హార్మోన్ లెవల్స్ ను మెరుగుపరచి పిసిఓఎస్ సమస్యను నివారిస్తుంది.

2. లెట్యూస్:

2. లెట్యూస్:

ఈ గ్రీన్ వెజిటేబుల్స్ పోషకాలు అధికం. పిపిఓఎస్ కు సాధారణ కారణం ఇన్సులిన్ . కాబట్టి వీటి నివారణకు లెట్యూస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

3. బార్లీ:

3. బార్లీ:

బార్లీలో లోగ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది మరియు లో ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించి పిసిఓఎస్ తో పోరాడుతుంది.

4. చెక్క:

4. చెక్క:

దాల్చిన చెక్క పిసిఓఎస్ తో పోరడాటమే కాకుండా ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరియు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

5. బ్రొకోలీ:

5. బ్రొకోలీ:

ఈ గ్రీన్ సూపర్ ఫుడ్ అధిక శాతంలో విటమిన్స్ మరియు లోక్యాలరీలు మరియు లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి దీన్ని మహిళల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

6. మష్రుమ్:

6. మష్రుమ్:

పిసిఓఎస్ బాధపడే మహిళలు ఈ లోక్యాలరీ మరియు లో గ్లిసమిక్ ఇండెక్స్ ను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

7. తున:

7. తున:

ఇది ఇక సీఫుడ్. ఇందులో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఇందులోని విటమిన్స్ కూడా పిసిఓఎస్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

8. టమోటో:

8. టమోటో:

టమోటోలో లోగ్లైసిమ్ ఇండెక్స్ కలిగి ఉండి లైకోపిన్ అధికంగా ఉంటుంది. టమోటోలు యాంటీఏజింగ్ ఆహారం మరియు బరువును కూడా తగ్గిస్తుంది.

9. స్వీట్ పొటాటో:

9. స్వీట్ పొటాటో:

పిసిఓఎస్ సమస్య ఉన్నవారు ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ స్వీట్ పొటాటోను తీసుకోవడం ద్వారా సమస్యను నివారించవచ్చు.

10. గుడ్డు:

10. గుడ్డు:

గుడ్డు ఆరోగ్యానికి మంచిది మరియు మహిళలకు చాలా ఆరోగ్యకరమైన పోషకాహారం. ఉడికించిన గుడ్డును తీసుకోవడం మంచిది.

11. పాలు:

11. పాలు:

డైరీ ప్రొడక్ట్స్ మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వెన్న తీసిన పాలు తీసుకోవడం వల్ల పిసిఓఎస్ సమస్యను నివారించవచ్చు. పాల వల్ల ఓవరీస్ లో అడం ఏర్పడటానికి బాగా సహాయపడుతాయి.

 12. పెరగు:

12. పెరగు:

పెరుగును ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అయితే, మహిళలకు యుటిఐ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

13. లికోరైస్ రూట్స్:

13. లికోరైస్ రూట్స్:

అధ్యయణాల ప్రకారం లికోరైస్ రూట్స్ తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని పెంచి పిసిఓఎస్ ను పోరాడే లక్షణాలు కలిగి ఉంటుంది.

14.ఆకుకూరలు:

14.ఆకుకూరలు:

ఈ లోక్యాలరీలను కలిగిన న్యూట్రీషియన్ ఫుడ్ ఇది. పిసిఓఎస్ సమస్యతో బాధపడే వారు ఈ గ్రీన్ లీఫ్ ను ఆహారంలో చేర్చుకొని పిసిఓఎస్ సమస్య ఉన్న వారు వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఓవొలేషన్ కు సహాయపడుతుంది

 15. నట్స్:

15. నట్స్:

హాజల్ నట్స్ మరియు బాదంలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

English summary

Foods For Women To Fight PCOS

PCOS (Polycystic Ovary Syndrome) is becoming a common health problem among women. Commonly known as cysts, this disorder in women was only possible after the age of 25. But now, even young women in their 20's are suffering from PCOS these days.
Desktop Bottom Promotion