Latest Updates
-
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు!
మొక్కజొన్నలో ఉన్న మేజర్ హెల్త్ బెనిఫిట్స్ చూడు గురూ...!
మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మొక్కజొన్న తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే. ఎందుకంటే మొక్కజొన్న ఏ దేశములోనైనా అంత ఫేమస్ మరి. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు. ఇన్ని రకాలుగా మొక్కజొన్నను ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నారు.
మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యా నికి ఎంతోమేలు చేస్తుంది. దీనిని సాధార ణంగా జొన్నలని కూడా అంటారు. ఈ మొక్కజొన్న గింజలను వివిధ రకాలుగా వండుతారు. కండెలుగా వున్నప్పుడే వాటిని తీపివిగా తినేయ వచ్చు. లేదా వాటికి మసాలాలు, కారాలు కూడా తగిలించి తింటారు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు. లేదా ఉల్లిపాయ, పచ్చి మిర్చీ వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ మంచి చిరుతిండిగా తినేయవచ్చు. మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్.. అనే విటమిన్లు ఎక్కువ ఉంటాయి. మొక్కజొన్న తినటం రుచే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
మొక్కజొన్న కండెలలోని ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణక్రియను పెంపొందిస్తుంది: మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది.

ఎముకల బలానికి: మొక్కజొన్నలో కావలసినన్ని లవణాలు లేదా మినరల్స్ వుంటాయి. పసుపురంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతాయి.

చర్మ సంరక్షణ: మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా వుంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే, దీనిలో వుండే లినోలె యాసిడ్ చర్మమంటలను, లేదా ర్యాష్‌లను కూడా తగ్గిస్తుంది.

రక్తహీనతను అరికడతాయి: రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్ మొక్కజొన్న విటమిన్ మరియు ఫోలిక్ యాసిడ్‌లు కలిగి మీలో రక్తహీనత లేకుండా చేస్తుంది.

కొల్లెస్టరాల్ నివారణ చేస్తాయి: శరీరంలో లివర్ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్ మరియు చెడు కొలెస్టరాల్ అయిన ఎల్‌డిఎల్. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.

గర్భిణీలకు ఈ ఆహారం ప్రధానం: గర్భవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్ యాసిడ్ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.

మానసిక విధులకు: మానసిక విధులకు సహాయపడే పాంటోథీనిక్ ఆమ్లం(విటమిన్ బి5) ఇందులో పుష్కలంగా ఉంటుంది.

కోలన్ క్యాన్సర్: మొక్కజొన్నలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇది కోలన్ క్యానర్(పెద్ద ప్రేగు క్యాన్సర్ ను)ప్రమాదాన్ని తగ్గింస్తుంది.

డయాబెటిస్: మొక్కజొన్న, తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది.

కిడ్ని సమస్యకు: కార్న్ (మొక్కజొన్న). మూత్రపిండాలు పనిచేయకపోవడంతో సహా... కిడ్నీకి సంబంధించి ఇతర సమస్యలను నివారించడానికి బాగా సహాయపడుతాయని కనుగొనబడింది.

గుండెకు: మొక్కొజొన్న ను రెగ్యులర్ గా తినడం వల్ల, తగిన పరిమానణంలో మితంగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్(రక్తకాణాల ఆరోగ్యానికి) చాలా మంచిది.

శ్వాస సంబంధిత: అంతే కాదు ఇందులో ఇండే బీటా క్రిప్టాక్సన్తిన్ ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుంది.

కేశాలకు: ప్రతి రోజూ తగు పరిమాణంలో కార్న్ తినడం వల్ల హెయిర్ ఫోలీ సెల్స్ కు బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి మరియు పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్ గా ఉండేందు, మంచి షైనింగ్ పొందడానికి బాగా సహాయపడుతుంది.
కనుక మీ ఆహారంలో తగినంత మొక్కజొన్న ఆహారం చేర్చి తినండి. దానివలన వచ్చే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వివిధ రోగాలను తగ్గించుకోండి. ఆరోగ్యంగా ఉండండి.



Click it and Unblock the Notifications