For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్ల ప్రత్యేక సమస్యలు దివ్వౌషదం ఫెనుగ్రీక్ ..!

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను

|

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది.

మెంతులను ఇంగ్లీషులో ఫెనుగ్రీక్ గింజలు అంటారు. వీటికి మంచి సువాసన వున్న కారణంగా వంటకాలలో వాడతారు. మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. కనుక మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

మరి ఔషధ ప్రయోజనాలున్న మెంతులు బరువు ఎలా తగ్గిస్తాయి?

మధుమేహం:

మధుమేహం:

ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మధుమేహ నియంత్రణ శక్తిని వినియోగించుకోవచ్చు. ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. మెంతులు టైప్ 1, టైప్ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి. మధుమేహ నియంత్రణ కోసం మెంతులను రోజుకి 50 గ్రాములను, రెండు మూడు డోసులుగా విభజించి తీసుకోవాల్సి ఉంటుంది.

కొలెస్టరాల్:

కొలెస్టరాల్:

మెంతులు మేదోవహ స్రోతస్సు మీద నేరుగా పని చేయటం వల్ల దీనిని కొలెస్టరాల్‌ని తగ్గించుకోవడానికి ఔషధంగా వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లకు లేదా వెన్న తీసిన మజ్జిగకు కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్) తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది.

జీర్ణశక్తి:

జీర్ణశక్తి:

కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు సరిచేయగలుగుతుంది. మెంతులు నీళ్ల విరేచనాలను, అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించడంతోపాటు మలం విచ్చుకొని తయారయ్యేలా చేస్తుంది. అందుకే ఇది సౌమ్యమైన విరేచనకారిగా పని చేస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.

మహిళల సమస్యలు:

మహిళల సమస్యలు:

గర్భాశయ వ్యాధుల్లోనూ, ఇతర స్ర్తిల వ్యాధుల్లోనూ, పునరుత్పత్తికి చెందిన అంగ ప్రత్యంగాల సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో డే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు - డోయోస్‌జెనిన్స్ అనేవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తరువాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలో సంచితమైన రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. రసధాతువు మీద మెంతుల్లోని పోషకాంశాలు పని చేయటం వల్ల తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది. నొప్పితో కూడిన బహిష్టులో ఇది వేడిని ఉత్పన్నం చేయటం ద్వారా రక్తప్రసరణను పెంచి దోష సంచితాన్ని తగ్గిస్తుంది.

మగవాళ్ల ప్రత్యేక సమస్యలు:

మగవాళ్ల ప్రత్యేక సమస్యలు:

మెంతుల్లోని ప్రత్యేక తత్వాలు శీఘ్రస్కలనం, నపుంశకత, లైంగిక స్తబ్దత, అంగస్తంభన సమస్యలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. దీనిలోని పోషక తత్వాలు పునరుత్పత్తి వ్యవస్థను శక్తివంతం చేస్తాయి. అలాగే దీనిలోని మధుర తత్వాలు శుక్రధాతువు తయారీకి సహాయపడతాయి.

నొప్పి:

నొప్పి:

మెంతులు వాతహరంగా పని చేస్తుంది కాబట్టి దీనిని నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి ఇలాంటి వాటిల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా నడుములో, తొడల్లో, రక్తప్రసరణ తగ్గటం వల్ల ఏర్పడిన చల్లదనాన్ని ఇది అమోఘంగా తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. అస్త్ధితువును (ఎముకలు) ఇది శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్, నడుమునొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది.

రక్తపోటు:

రక్తపోటు:

మెంతులులో పీచు అధికం. రక్తపోటు నియంత్రిస్తాయి.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

మెంతులలో కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫలితంగా మీకు అధిక బరువు చేరదు. బరువు తగ్గాలంటే మీరు కేలరీలు తగ్గించాలి. మెంతులు చాలా తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. మెంతులు ఎలా తినాలి? 1. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. వేడినీటితో ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినాలి. ఇవి మీలోని వ్యర్ధ పదార్ధాలను విసర్జించటమే కాదు బరువును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. లేదా వేడి నీటితో వాటిని నమిలివేయవచ్చు.2. మెంతి పొడి - మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్ గా చేసుకొని చల్లబడినతర్వాత తినవచ్చు. గాలి చొరని డబ్బాలో ఈ మెంతి పొడి వుంచాలి. పెరుగు తో కలిపి తినవచ్చు. లేదా మసాలా దినుసులుగా వాడవచ్చు. 3. ఫెను గ్రీక్ టీ - మెంతి పొడిని గ్రీన్ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. ఖాళీ కడుపుతో ఉదయం వేళ తాగితే, అది ఆకలిని నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా మెంతులను బరువు తగ్గించేందుకు వాడవచ్చు. ఇది ఎంతో తేలికగా ఆచరించకల విధానం.

జుట్టుకు:

జుట్టుకు:

ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.

చర్మ సంరక్షణకు:

చర్మ సంరక్షణకు:

ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.

డయోరియా:

డయోరియా:

నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి. కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

మలబద్దకం:

మలబద్దకం:

మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.

కామెర్ల

కామెర్ల

కామెర్ల వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)

బాలింత

బాలింత

బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశ వ్యాప్తంగా ఉంది. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి,తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.

English summary

Health Benefits of Fenugreek

For Asian climatic conditions, Fenugreek can successfully cure arthritis, respiratory problems like asthma and bronchitis, digestive problems like constipation and diarrhea, reproductive disorders, hormonal disorders. In short, a common medicine for all the body ailments. Take a look at some more health benefits of fenugreek.
Desktop Bottom Promotion