For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్నివేధించే పొడి దగ్గుకు 8 బెస్ట్ హోం రెమడీస్

|

సాధారణంగా సీజన్(ఋతువులు) మారుతున్నప్పుడు అంటే ఒక సీజన్‌ నుండి మరో సీజన్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటుకాక, తేలికగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశముంటుంది. ఇలా సీజన్‌ మారుతున్న సందర్భంలో జలుబు, జ్వరం వంటి సమస్యలతో పాటు చాలా మంది పొడి దగ్గుతో వేధించబడుతుంటారు.

వెైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌, పరాన్న జీవుల వలన కలిగిన ఇన్‌ఫెక్షన్‌ మొదట పొడి దగ్గుతోనే ఆరంభమై బాధిస్తుంటుంది. గొంతు, ముక్కులో ప్రారంభమైన ఇన్‌ఫెక్షన్‌, ఊపిరితిత్తుల వరకూ ప్రయాణించి, శ్వాస మార్గాల లోపల ఉండే ‘మ్యూకోసా'పొరను దెబ్బ తిస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలెై సతాయిస్తుంది. సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజులలో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి, దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం ఉంటే రక్తపరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్‌రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి.

వైద్య పరంగా కాకుండా సహజ పద్ధతుల ద్వారా మీ పొడిదగ్గును తగ్గించుకోవాలంటే ఈ హోం రెమడీస్ ను అనుసరించాల్సిందే. ఈక్రింది లిస్ట్ తయారుచేయబడినా ఈ హోం రెమడీస్ మన వంటగదిలో అతి సులభంగా లభించే వస్తువులే. హోం రెమడీస్ ను ఉపయోగించడం సురక్షితం మరియు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పొడి దగ్గు నివారించుకొనేందుకు మీరు ఉపయోగించే ఈ హోం రెమడీస్ మీకు అలెర్జీని కలిగించవచ్చు. అందుకనీ మీరు వీటిని ఉపయోగించేటప్పుడు ప్రత్యేక శ్రద్ద వహించడం చాలా అవసరం.

పొడిదగ్గు తగ్గించే ఆ హోం రెమడీ ఏంటో...ఈ క్రింది లిస్ట్ లో చూద్దాం...

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

నీళ్ళు: మీరు పొడి దగ్గుతో బాధపడుతున్నప్పుడు, బెస్ట్ హోం మెరడీ నీళ్ళు. నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది. మీరు పొడి దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా పొడి దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది.

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

క్యాండీస్ : క్యాండీస్ చప్పరించడం వల్ల మీ గొంతులో కొంత ఉపశమనం కలిగిస్తుంది. షుగర్ క్యాండీస్ గొంతులో కొంత ఉపశమన ప్రభావాన్ని తీసుకొస్తుంది, దాంతో పొడి దగ్గును నుండి ఉపశమనం పొందవచ్చు.

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

హెర్బల్ టీ: మీరు పొడి దగ్గుతో బాధపడుతున్నట్లైతే, మీకు ఇష్టమైన హెర్బల్ టీను తాగడానికి ప్రయత్నించండి. మీ గొంతులో ఏదైన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఈ హెర్బల్ టీ ఆ ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది.

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

నిమ్మ జ్యూస్: పొడి దగ్గును తగ్గించడానికి సహాయపడే బెస్ట్ హోం రెమడీ లెమన్ జ్యూస్. ఎందుకంటే ఈ సిట్రస్ పండులో విటిమన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, మీ గొంతుకు ఉపశమనం కలిగించి, పొడి దగ్గును నివారిస్తుంది.

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

అల్లం: గొంతులో చికాకును తొలగించడానికి అల్లం బెస్ట్ హోం రెమడీ. అల్లం ఒక మెడిసినల్ రూట్, ఇది పొడి దగ్గును తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

ఆపిల్ సైడర్ వెనిగర్: మీ గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఒక క్యాప్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఈ సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, ఈ హోం రెమడీ మీరు ఉపయోగించడం సురక్షితం కూడా...

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

ఉప్పు: పొడి దగ్గును నివారించడంలో ఒక పాతకాలపు హోం రెమడీ పద్దతి. అయితే ఇది పాతకాలపు పద్దతే అయినా మంచి ఫలితం ఉంటుంది. ఉప్పును గోరువెచ్చని నీటిలో వేసి, నోట్లో పోసుకొని గార్గిల్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కను వేడి నీటిలో నానబెట్టి తీసుకోవడం అనేది ఒక బెస్ట్ హోం రెమడీ. మీకు ఇష్టం అయితే అందులో చిటికెడు ఉప్పు కూడా చేర్చుకోవచ్చు. తప్పకుండా మీకు ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Home Remedies To Treat Dry Cough

When you have a cough, it becomes a hassle for your throat and your chest. So, it is best for one to consume home remedies to get of the cough, rather than consuming heavy dosage of medications to relieve your uneasiness. If you want to get rid of your cough in the most natural way, you need to turn to these easy home remedies to ease the disorder.
Story first published: Tuesday, October 22, 2013, 17:50 [IST]
Desktop Bottom Promotion