For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుతుక్రమంలో అధిక రక్తస్రావానికి కారణాలు !!

By Super
|

కొంతమంది స్త్రీలు రుతుక్రమంలో అధిక రక్త స్రావంతో బాధ పడతారు. దీన్ని మేనోరియా అంటారు. కొన్నిసార్లు మూత్ర విసర్జనలో రక్తస్రావం సాధారణమేనా కాదా అని కూడా అనిపిస్తుంది. మరి మనం అనుభవిస్తున్న రక్తస్రావంతో సహా ఏదీ సాధారణం కాదని ఎలా తెలుసుకోవడం?

అన్నిటికన్నా తేలికైన మార్గం ఏమిటంటే మనం ఎన్ని సార్లు పాడ్ లు లేదా టాంపన్ లు మార్చామో నమోదు చేసుకోవడం. మేనోరియా (అధిక రక్తస్రావం) వున్న వ్యక్తీ ఋతు సమయంలో లేదా వారం అంతా బ్లీడింగ్ అవుతున్నా, గంటా రెండు గంటలకోసారి పాడ్స్ మార్చాల్సి వుంటుంది.

హార్మోన్ల అసమతౌల్యం

హార్మోన్ల అసమతౌల్యం

యుక్త వయసు లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల అసమతౌల్యం అన్నిటికన్నా సాధారణ కారణం. యుక్త వయసులో మొదటి సారి రుతుక్రమం వచ్చాక, మెనోపాజ్ మొదలయ్యే కొన్ని ఏళ్ళ ముందు, హార్మోన్ల స్థాయి మారుతూ వుంటుంది, దీని వల్ల అధిక రక్త స్రావం అవుతూ వుంటుంది. అందువల్ల జనన నియంత్రణ మందులు లేదా ఇతర హార్మోన్లతో మేనోరియాకు చికిత్స జరుగుతూ వుంటుంది.

మూత్రాశయం లో ఫైబ్రాయిడ్ గడ్డలు :

మూత్రాశయం లో ఫైబ్రాయిడ్ గడ్డలు :

ఫైబ్రాయిడ్ గడ్డలు మంచివేనని, సాధారణంగా 30, 40 ఏళ్ళ వయసులో గానీ అంతకన్నా ముందు కానీ ఏర్పడతాయని తెలుసుకోండి. ఇప్పటిదాకా కారణం అయితే స్పష్టంగా తెలియదు. ఫైబ్రాయిడ్ గడ్డాల చికిత్స కోసం మయోమేక్టమీ, ఎ౦డోమిట్రియల్ అబ్లేషన్, యుటేరైన్ ఆర్టేరీ ఏమ్బలజేషన్, యుటేరైన్ బెలూన్ థెరపీ, హిస్టిరెక్టమీ లాంటి శస్త్ర చికిత్సలు కూడా అందుబాటులో వున్నాయి. మెనోపాజ్ వచ్చిన తరువాత గడ్డలు చిన్నవైపోయి, చికిత్స లేకుండానే కనుమరుగవుతూ వుంటాయి.

సర్వికల్ పాలిప్స్ :

సర్వికల్ పాలిప్స్ :

సర్వికల్ ముకోసా ఉపరితలం పైన లేక ఎ౦డోసర్వికల్ కెనాల్ పైన్ పెరుగుతూ, గర్భాశయ ద్వారం వద్ద బయటకు వచ్చే చిన్న వాటిని పాలిప్స్ అంటారు. కారణం స్పష్టం కాకపోయినా, తరచుగా ఇన్ఫెక్షన్ వల్లా, పెరిగిన ఈస్ట్రోజెన్ స్థాయిలకు విపరీత స్పందనల వల్లా లేక గర్భాశయ ద్వారం లోని రక్త నాళాలలో అవరోధం ఏర్పడినా, పాలిప్స్ ఏర్పడతాయి. సర్వికల్ పాలిప్స్ తో బాధ పడే స్త్రీలు చాలా వరకు 20 ఏళ్ళ వారు, పిల్లలు కలిగిన వారు అయి వుంటారు. దీనికి సాధారణంగా అవుట్ పేషంట్ చికిత్సే చేస్తారు.

ఎ౦డోమిట్రియల్ పాలిప్స్

ఎ౦డోమిట్రియల్ పాలిప్స్

ఎ౦డోమిట్రియల్ పాలిప్స్ కాన్సర్ కారకం కాదు, ఇవి గర్భాశయ ద్వారం వద్ద పెరిగి నిలుస్తాయి. కారణ౦ స్పష్టం కాకపోయినా అధిక ఈస్ట్రోజెన్ స్తాయిల వల్ల కానీ లేక కొన్ని రకాల గర్భాశయ కణుతుల వల్ల కానీ ఇవి ఏర్పడవచ్చని అంటారు.

లూపస్ వ్యాధి :

లూపస్ వ్యాధి :

లూపస్ అంటే శరీరంలో చాలా చోట్ల దీర్ఘ కాల వాపులు వుండడం, ముఖ్యంగా చర్మం, కీళ్ళు, రక్తం, కిడ్నీలు, ఆటో ఇమ్యూన్ వ్యాధి. లూపస్ కి వారసత్వ కారణాలు ఉంటాయని విశ్వసిస్తారు. వాతావరణ పరిస్థితులు, ఇన్ఫెక్షన్ లు, యాంటి బయాటిక్స్, యు వి వెల్తురు, తీవ్రమైన వత్తిడి, హార్మోన్లు, మందులు లాంటివి లూపస్ లక్షణాలను కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు అంటారు.

పెల్విక్ ఇంఫ్లమేటరీ డిసీజ్

పెల్విక్ ఇంఫ్లమేటరీ డిసీజ్

పెల్విక్ ఇంఫ్లమేటరీ డిసీజ్ (పి ఐ డి) గర్భసంచికి, ఫాలోపియన్ ట్యూబ్ లు, గర్భాశయ ద్వారం లాంటి అవయవాలను ప్రభావితం చేసే ఒకటి లేక అంతకన్నా ఎక్కువ భాగాలకు వచ్చే ఇన్ఫెక్షన్. పి ఐ డి తరచుగా లైంగికంగా వ్యాపించే ఇన్ఫెక్షన్ ల వల్ల వస్తుంది. యాంటి బయాటిక్ థెరపీ దీనికి బాగా సిఫార్సు చేయబడే చికిత్స.

గర్భాశయ కాన్సర్ :

గర్భాశయ కాన్సర్ :

గర్భాశయం లోని కణాలు అసాధారణంగా రెట్టింపై నియంత్రణ స్థాయి దాటిపోయి ఆరోగ్యకరమైన శరీర భాగాలను పాడు చేస్తే సర్వికల్ కాన్సర్ వస్తుంది. 90% కన్నా ఎక్కువ సర్వికల్ కాన్సర్లు హ్యూమన్ పాపిల్లోమ వైరస్ వల్ల వస్తాయి. శస్త్ర చికిత్స, కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ లాంటివి చికిత్సలో భాగాలు.

ఎ౦డోమిట్రియల్ కాన్సర్ :

ఎ౦డోమిట్రియల్ కాన్సర్ :

సాధారణంగా 50 ఏళ్ళు పై బడ్డ స్త్రీలలో ఎండోమిట్రియల్ కాన్సర్ వున్న వారికి ఎండోమిట్రియల్ హైపర్ ప్లాసియా లేదా తరచుగా హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స తీసుకున్నారు (హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స్). గర్భసంచి తొలగించడం (హిస్టిరెక్టమీ) తొలి దశ కావచ్చు, దాని తర్వాత కీమో థెరపీ లేదా రేడియేషన్ చేయవచ్చు.

ఇంట్రా యుటేరైన్ డివైజేస్ (ఐ యు డి లు) :

ఇంట్రా యుటేరైన్ డివైజేస్ (ఐ యు డి లు) :

ఐ యు డి సాధనాలు వాడే స్త్రీలలో రుతుక్రమం సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వెంటనే ఐ యు డి బదులు ఇతర గర్భ నిరోధక సాధనాలు వాడండి.

రక్త స్రావ అసమానతలు :

రక్త స్రావ అసమానతలు :

రక్తం గడ్డ కట్టడానికి ఇబ్బంది కలిగించే రక్త స్రావ అసమానతలు చాలా సార్లు రుతుక్రమంలో అధిక రక్త స్రావానికి దారి తీస్తాయి. జాతీయ గుండె, చాతీ, రక్త సంస్థ వారి ప్రకారం, వాన్ విల్లెబ్రాండ్ వ్యాధి రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే రక్తస్రావ అసమానతమ్ కలిగించే వ్యాధి. ఈ వ్యాధి వున్న వారిలో రక్తం తక్కువ పరిమాణంలో గడ్డ కడుతు౦ది. రక్తం పలుచన చేసే మాత్రలు తీసుకునే ఆడవారిలో కూడా రుతుక్రమంలో అధిక రక్త స్రావం అవుతుంది.

English summary

Reasons for Heavy Menstrual Bleeding

Some women may experience unusually heavy bleeding during menstruation. This is known as menorrhagia. Sometimes we often wonder if uterine bleeding is normal or not.
Desktop Bottom Promotion