For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సీజన్ లో దొరికే స్ట్రాబెరీ తిను.. ఆరోగ్యాన్ని పెంపొందించుకో...!

|

ఆయా సీజన్లలో దొరికే పండ్లను తప్పకుండా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది . స్ట్రాబెర్ అన్ని సీజన్స్ లో దొరికే పండు కాదు, ఇది ఫిబ్రవరి-మార్చి స్ట్రాబెరీ సీజన్. స్ట్రాబెరీలో అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉన్నాయి. స్ట్రాబెర్రీలను తాజాగా వినియోగించటంతోపాటు అదనంగా చల్లని ప్రదేశంలో ఘనీభవింపచేసి, నిల్వవుండే విధముగా తయారుచేయవచ్చు. పాల ఉత్పత్తులలో అదనంగా చేర్చుటకు స్ట్రాబెర్రీలు ప్రాముఖ్యముచెందినవి. స్ట్రాబెర్రీ రుచిగల ఐస్క్రీంలలో, మిల్క్ షేక్ లలో, స్మూతీస్ లలో మరియు పెరుగులలో ఉపయోగిస్తారు. స్ట్రాబెర్రీలు మరియు మీగడ ప్రజాదరణగల భోజనానంతర పదార్ధాలుగా వింబుల్డన్ లో వినియోగించబడుతున్నాయి. స్ట్రాబెర్రీతో చేసిన వంటకము(pie)కూడా ప్రసిద్ది చెందినది. కరిగించిన చాక్లెట్ లో ముంచిన స్ట్రాబెర్రీలుగల పండును తినడం ఆరోగ్యకరమైన మార్గములో చాక్లెట్ ను ఆనందించటంవంటిది.

బెర్రీస్‌ విదేశాలనుండి దిగుమతి అయ్యే బెర్రీస్‌ మహా రుచిగా వుంటాయి. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌ బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. బెర్రీస్ అన్నీ, చెర్రీ బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, అన్నిటిలోనూ సెల్ డ్యామేజ్ ని తగ్గించే యాంటీఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. రాస్బెరీలో ఎలాజినిక్ యాసిడ్, సెలీనియం ఉండటం మూలంగా ఓరల్ మరియు లివర్ క్యాన్సర్ కణాలు పెరగటానికి అవరోధం కలిపిస్తుందని కనుగొన్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఏవిధంగా ప్రయోజనాలు కలిగిస్తాయో చూద్దాం...

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

రోగనిరోధక వ్యవస్థ: మార్కెట్‌లో కనిపించే ఎర్రెర్రటి బెర్రీలను కడుపార ఆరగిస్తే... అందులోని యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. వీటిల్లో వుండే ఫైటోకెమికల్స్‌ వల్ల శక్తి పెరుగుతుంది.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

కళ్ళ ఆరోగ్యానికి : స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో, కంటి మీద మసక వంటి సమస్యల రాకుండా ఎదుర్కోగల శక్తి ఇందులో పుష్కలం. మనకళ్ళను సూర్యశర్మినుండి, ఫ్రీరాడికల్స్ నుండి కాపాడటానికి అవసరం అయ్యే విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

క్యాన్సర్ నివారణకు: సాధారణంగా అద్భుత ఫలంగా పిలవబడే స్ట్రాబెర్రీస్‌ క్యాన్సర్, డయాబెటీస్‌లను దూరం చేయడంతో పాటు త్వరగా వయస్సు మీద పడకుండా చేస్తుందని ఒక నూతన పరిశోధనలో తేలింది. ఈ ఫలాన్ని తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయి. దాంతో క్యాన్సర్ ను అరికడుతుంది.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

సౌందర్యానికి: బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతారు. ఈ పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలె క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు జరిగి, మీలో యవ్వనత్వాన్ని పెంచి, వయసు తక్కువ ఉండేలా చూస్తుందని, అందంగా ఉండాలని కోరుకునేవారు బెర్రీస్‌ని తింటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

గుండె ఆరోగ్యానికి: బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

దంత సంరక్షణకు: బెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే.. ఓరల్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. బెర్రీ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీతో పాటు కలర్ ఫుల్ ఫ్రూట్స్‌ను వారానికి మూడు సార్లు తీసుకోవడం లేదా రోజుకు ఒక్కోటి తీసుకోవడం ద్వారాక్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నలుపు రంగులు బెర్రీ పండ్లను తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

కీళ్ళ నొప్పులకు: స్ట్రాబెరీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది. గుండె సమస్యలకు దారితీసే ఆర్థరైటీస్ బారీన పడకుండా కాపాడుతుంది.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

బ్లడ్ ప్రెజర్: గుండె ఆరోగ్యానికి కావల్సిన పోషకాంశాల్లో పొటాషియం కూడా ఒకటి. కాబట్టి స్ట్రాబెరీలో ఉండా పొటాషియం రక్త ప్రసరణను క్రమబద్దం చేయడానికి సహాయపడుతుంది. దాంతో హైబ్లడ్ ప్రెజర్ కు గురికాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

ఎముకల బలానికి: స్ట్రాబెరీలో ఎలాజిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్. ఇది ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

బరువుతగ్గించడానికి: స్ట్రాబెరీలో ఫైబర్ అధికంగా ఉండే జీర్ణశక్తిని పెంచుతుంది. క్రమమైన బరువును మెయింటైన్ చేయడానికి టైప్ 2 డయాబెటిస్ ను మరియు గుండె ఆరోగ్యానికి స్ట్రాబెరి బాగా సహాయపడుతుంది

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

మెదడుకు: బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.

స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

అల్సర్: స్ట్రాబెర్రీతో అల్సర్‌ని తగ్గించవచ్చట. పొట్టలో ఏర్పడే అల్సర్‌కు స్ట్రాబెర్రీతో చెక్ పెట్టవచ్చని పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్‌ అనే సంస్థ పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించే వారికి స్ట్రాబెర్రీ మరింత బాగా పనిచేస్తుందని, శరీరంలోని అల్సర్‌ని తగ్గిస్తుందని, వారు అంటున్నారు.

English summary

Top 12 Health Benefits of Strawberries...! | స్ట్రాబెరీ తినండి... ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

Whether fresh or frozen, there's no denying that strawberries are a popular fruit—but they also pack a healthy punch. Read on to learn 10 surprising health benefits of strawberries
Story first published: Thursday, February 21, 2013, 13:01 [IST]
Desktop Bottom Promotion