For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొగ త్రాగటం మానేస్తే మీ శరీరానికి ఏం జరుగుతుంది?

|

పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ బాగా తెలుసు. అంతే కాదు సిగరెట్లను తయారు చేసిన కంపనీ కూడా వాటిపై రాసి ఉంటుంది. అయినా పొగత్రాగడాన్ని మాత్రం మానలేకపోతున్నారు. దీనికి కారణం ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనే పదార్దం. ఈనికోటిన్ గుండెకు రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. నికోటిన్‌ వలన శరీరంలో రక్తనాళాలు కుదించుకు పోయి, రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ నికోటిన్ ను శరీరం నుండి బయటకు పంపితే పొగత్రాగడం మానడం ఖాయం. నికోటిన్ బయటకు పంపడానికి కొన్ని సూచనలు..

విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, జ్యూసులు తీసుకోవడం వల్ల శరీర నాడీవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంతో పాటు ఆరెంజ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎ, సి, కె, బి విటమిన్ లు ఉండే క్యారెట్ జ్యూస్ తీసుకొంటె శరీరంలోని నికోటిన్ తొలగించడానికి బాగా సహాయపడుతుంది. పండ్లలో ముఖ్యంగా ఎర్రని దానిమ్మ గింజలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ద్వారా నికోటిన్ బయటకు పంపవచ్చు. స్ట్రాబెర్రీ తినడం వల్ల శరీరంలో నికోటిన్ ను తొలగించడానికి సహాయపడుతుంది. పొగత్రాగే వారికీ ఎక్కువగా శరీరం పొడిబారిపోతుంది. కనుక సాద్యమైనంత వరకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది.

ప్రపంచంలో ధూమపాన ప్రియులు మిలియన్లకొద్ది ఉన్నారు. వీరిలో చాలామంది తమకున్న ధూమపానం అలవాటును మానేయాలనుకుంటూనే ఉంటారు. కాని మానలేకపోతుంటారు. ఏ ఉపయోగంలేని ధూమపానాన్ని అలవాటు చేసుకోకూడదు. ఒక వేళ ఈ అలవాటు వున్నవారు గట్టి మనో నిర్ణయం చేసుకుని మానివేయాలి. అలవాటు ఎక్కువగా ఉండే వారు ధూమపానం మానేస్తే శరీరంలో ఏం జరగుతుంది....

What Happens To Your Body if You Stop SMOKING

1.ఇరవై నిముషాల్లో బ్లడ్ ప్రెజర్ తగ్గిపోయి, నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది.
2. ఎనిమిది గంటల్లో మీ రక్త ప్రవాహంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ (ఒక విష వాయువు) స్థాయిలు సగానికి పడిపోటం మరియు ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.
3. నలభైఎనిమిదది గంటల్లో గుండెపోటు కలిగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. మీశరీరంలోని నికోటిన్ మొత్తం శరీరం నుండి బయటకు పంపబడుతుంది. మీకు తినే ఆహారంలో రుచి మరియు వాసన వంటివి మీలో తిరిగి సాధారణ స్థాయి చేరుకుంటాయి.
4. 72గంటల్లో మీ శరీరంలోని వాయునాళము విశ్రాంతి చెందుతుంది. మరియు మీ ఎనర్జీ స్థాయి పెరుగుతుంది.
5. రెండు వారాల్లో మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది అలాగే మరో పది వారాల పాటు చాలా మెరుగ్గా కొనసాగుతుంది.
6. మూడు నుండి తొమ్మిది నెలల్లో పొగత్రాగడవ వల్ల వచ్చే దగ్గు, శ్వాసలో మరియు శ్వాస సమస్యలు తగ్గించి మీ ఊపిరిత్తుల సామర్థ్యం 10%కు మెరుగుపరుస్తుంది.
7. ఒక సంవత్సరంలో గుండెపోటు కలిగించే ప్రమాదాన్ని మీ నుండి సగానిక తగ్గిస్తుంది.
8.5 ఏళ్లలో హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే స్ట్రోక్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.
9.10 ఏళ్లలో లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే లంగ్ క్యాన్సర్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.
10.15 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే హార్ట్ అటాక్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.

English summary

What Happens To Your Body if You Stop SMOKING | ధూమపానం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Most of the effects of nicotine in your system will begin to fade faster than you think, while some of the more dangerous problems might take years to heal. In fact, within just 20 minutes after your last cigarette your body begins the healing process.
Story first published: Thursday, February 7, 2013, 13:00 [IST]
Desktop Bottom Promotion