For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తిమీరలోని 11ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి.

కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొత్తిమీర కొన్ని అస్వస్థతలకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము.

తాజా కొత్తిమీరలో దాగున్న ఆరోగ్య రహస్యాలు:

క్రొవ్వును నియంత్రిస్తుంది:

క్రొవ్వును నియంత్రిస్తుంది:

కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.

 చర్మాన్ని కాపాడుతుంది:

చర్మాన్ని కాపాడుతుంది:

చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది.

సేధతీర్చుట:

సేధతీర్చుట:

కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి, మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గించుటలో ఉపయోగపడును.

పోషకాల విలువలు

పోషకాల విలువలు

విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K' కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్'ని కలిగి ఉంది

జీర్ణక్రియను పెంచును

జీర్ణక్రియను పెంచును

కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును.

కంటికి ఉపయోగం

కంటికి ఉపయోగం

కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది.

నొప్పిని తొలగించును

నొప్పిని తొలగించును

కీళ్ళ నొప్పులతో భాధపడుతున్నారా? ఆహారంలో ఎక్కువగా కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీల్లనోప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని పెంచును.

మధుమేహం

మధుమేహం

కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా? అవును ఇది తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.

ఫ్రీ రాడికాల్స్

ఫ్రీ రాడికాల్స్

కొత్తిమీర, ఫ్రీ రాడికాల్స్'కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎలేమోల్, కామ్ఫార్, బొర్నెఒల్, కార్వోన్, క్వుర్సేటిన్, కేంఫెరాల్, మరియు ఎపిగేనిన్'లను ఎక్కువగా కలిగి ఉండటం వలన ఫ్రీ రాడికాల్స్, శరీరంలో కలుగచేసే నష్టాలను తగ్గిస్తుంది.

 యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:

కిడ్నీ స్టోన్ నివారిస్తుంది, అదే విధంగా పిల్లలు మరియు పెద్దల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది:

రక్తహీనతను తగ్గిస్తుంది:

కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.

Story first published: Wednesday, December 17, 2014, 17:02 [IST]
Desktop Bottom Promotion