For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోగాతో నిద్రలేమిని సమస్యను జయించండి

By Super
|

నవీన యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా' అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది గాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ ఇంతా అంతా కాదు. నిద్రకు సంబంధించిన సమస్యలన్నింటినీ నిద్రలేమి (ఇన్‌సోమ్నియా)గా పరిగణించడం తరచూ జరుగుతుంటుంది. ఈ పదానికి అర్థం నిద్రలేమి అయినప్పటికీ ఇది మూడు సమస్యలను సూచిస్తుంది:1. నిద్రలోకి వెళ్ళడం కష్టం కావడం
2.నిద్రావస్థలో ఎక్కువ సేపు ఉండలేకపోవడం.3. నిద్ర లేచిన తరువాత తాజాగా అనిపించకపోవడం.

నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపోయినప్పటికీ తెల్లవారుఝామునే లేవడం, రాత్రిళ్ళు మధ్య మధ్యలో మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేక పోవడంలో అన్న వాటిలో ఒకటి రెండు లక్షణాలు కానీ లేదా అన్నీ కానీ ఉండటమే స్లీప్‌ డిజార్డర్‌ లేదా ఇన్‌సోమ్నియా అని ఆధునిక వైద్యం అభివర్ణిస్తోంది. నిద్రలేమిని ఎదుర్కోవడానికి యోగా గ్రేట్ గా సహాయపడుతుంది. యోగ వల్ల మనస్సు ప్రశాతం పడుతుంది, మరియు మంచి నిద్రపడుతుంది. దాంతో మరుసటి రోజు ఉదయం సంతోషంగా, ఫ్రెష్ గా నిద్రలేవగలుగుతారు. మరి నిద్రకు సహాయపడే యోగసనాలేంటో ఒక సారి చూద్దం...

పశ్చిమోత్తనాసనం:

పశ్చిమోత్తనాసనం:

పశ్చిమోత్తా నాసనం: సులభంగా బరువు తగ్గించే మరొక సమర్ధవంతమైన యోగాసనం. అలాగే దీన్ని ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకొన్న కొవ్వును తగ్గిస్తుంది. మరియు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. చక్కగా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి. ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు, కాని రోజు సాదన వల్ల సాధ్యమవుతుంది. తిరిగి పండుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. కనిసం 5 నుండి 20 సార్లు చేయాలి.

ఉత్తనాసన

ఉత్తనాసన

నీరసాన్ని దూరం చేయడంలో ఈ ఆసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనాన్ని అందించడంలోనూ ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.

అపనాసన:

అపనాసన:

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థకు తగిన శక్తిని అందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.

సుప్త బద్దకోనాసన

సుప్త బద్దకోనాసన

ఈ ఆసనం వల్ల శరీరం మరియు మనస్సు విశ్రాంతి పొందేలా చేస్తుంది, మరియు ఇది వెన్నెముక మరియు కాళ్ళలోని కండరాలను వదలుచేస్తుంది. ఈ ఆసనం చేయడానికి ముందుగా రెండు కాళ్లనూ ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడలపై బోర్లించి ఉంచి వెన్నెముక నిటారుగా ఉంచుకుని సమస్థితిలో కూర్చోవాలి. నిదానంగా రెండు అరచేతులను శరీరానికి ఇరువైపులా నేలపైన ఉంచి రెండు మోచేతులను ఒకదాని తర్వాత ఒకటి నేలపైన తాకిస్తూ శరీర బరువు మోచేతులపైన ఉంచుతూ వెనుకకు వంగాలి. ఇప్పుడు తలను నేల మీద ఆనించి రెండు చేతివేళ్లను ఇంటర్‌లాక్ చేసి తలకింద ఉంచుకోవాలి. తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద మడిచి రెండు అరిపాదాలను ఒకదానికి ఒకటి పూర్తిగా తాకించి ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్లు పరస్పరం వ్యతిరేక దిశలో పక్కకు వాలి ఉంటాయి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

శవాసన:

శవాసన:

ఈ ఆసనం వేయడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుత్తుకు బలం లభిస్తుంది. సైనస్, జలుబు వంటి సమస్యలున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది. మానసిక అలసట దూరమవుతుంది. డిప్రెషన్, ఇన్సోమ్నియా వంటి స్లీపింగ్ డిజార్డర్స్ దూరమవుతాయి.

Desktop Bottom Promotion