For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ పొటాటో: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

|

పేరులో ఏముంది అంటారుగాని పేరులోనే ఉంది అంతా. కొందరికి స్వీట్ పొటాటో అంటే అర్థం కాదు. మరికొందరికి రత్నపురి గడ్డ అంటే అర్థం కాదు.
ఇంకొందరు మొరం గడ్డ అంటారు. అంటే ఏంటో? మరికొందరికి అది గెనుసు గడ్డ. చూశారా... పదార్థం ఒకటే అయినా పేర్లు ఎన్ని మారాయో. ఈ పేర్లన్నీ చిలగడదుంపవే. ఒక రకంగా పేదవాళ్ల బంగాళాదుంప అది. కాని, రేటుకు పేదే తప్ప రుచికి కాదు. పోషకాలకూ కాదు... వంటకు అంతకంటే కాదు.
ఇది చిలగడ దుంపల సీజన్. ఏ సీజన్ దుంపను ఆ సీజన్‌లో తినాలి.

స్వీట్ పొటాటోలు వైట్ పొటాటాలోకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. తెల్లపొటాటోలతో పోల్చినప్పుడు స్వీట్ పొటాటోలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. స్వీట్ పొటోటాలో అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి2,బి6, డి, సి,ఇ) ఉన్నాయి. ఇక చిలుగడదుంపలో కెరోటినాయిడ్స్‌ మరియు పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి.

ఒక్క దుంపలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

స్వీట్ పొటాటోలో కెరోటినాయిడ్స్ శరీరంలో డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్స్ ను నివారిస్తుంది. 124000 మంది మీద హార్ వార్డ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలు ప్రకారం 32శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్స్ తగ్గిస్తుంది. ముఖ్యంగా కెరోటినాయిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఇటువంటి ఈ క్యాన్సర్ ను తగ్గించుకోవచ్చు. స్వీట్ పొటాటోలో ఐరన్, కాపర్ మరియు మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.

ఈ సీజనల్ వెజిటేబుల్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో లోగ్లిజమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్వీట్ పొటాటో వల్ల మరి ప్రయోజనాలున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం..

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది:

స్వీట్ పొటాటోలో లోగ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందుకే స్వీట్ పొటాటోలు డయాబెటిక్ పేషంట్స్ కు మంచిది.

హార్ట్ అటాక్ ను నివారిస్తుంది:

హార్ట్ అటాక్ ను నివారిస్తుంది:

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

విటమిన్ సి:

విటమిన్ సి:

స్వీట్ పొటాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . ఇది జీర్ణక్రియకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే బ్లడ్ సెల్స్ మరియు ఎముకలు మరియు దంతాల ఫార్మేషన్ కు సహాయపడుతుంది.

 బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్:

బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్:

స్వీట్ పొటాటో తినడం వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది రెడ్ మరియు వైట్ కలర్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతుంది. మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది.

యాంటీ ఏజింగ్ :

యాంటీ ఏజింగ్ :

విటమిన్ ఇ(చర్మ సౌందర్యానికి): విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది. ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకత పెంచతుుంది మరియు కళ్ళపవర్ ను పెంచతుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఇందులో ఉండే పాంథోనిక్ యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండి విటమిన్ బి శరీరానికి కావల్సిన శక్తి సామార్థ్యాలను అంధిస్తుంది.

జనరల్ హెల్త్:

జనరల్ హెల్త్:

స్వీట్ పొటాటోలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. స్వీట్ పొటాటో మూడ్ ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. మరియు ఎముకలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది . ఎముకలను, గుండెను, నరాలను, చర్మంను మరియు దంతాలను బలోపేతం చేయడంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది .

Story first published: Friday, January 17, 2014, 17:54 [IST]
Desktop Bottom Promotion