For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకొంటే పొందే గొప్ప ప్రయోజనాలు

|

మనలో చాలా మంది బరువు తగ్గించే డైట్ ను అనుసరిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే న్యూట్రీషినల్ ఫుడ్స్ ఎంపిక చేసుకుంటుంటారు. మీరు ఫర్ ఫెక్ట్ శరీర ఆకరంను కలిగి ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది. కానీ, మీరు తీసుకొనే న్యూట్రీషియన్స్ సరిగా తీసుకోకపోతే మీరు చూడటానికి అందంగా కనబడరు. ఎందుకంటే, శరీర ఆరోగ్యమే, అందానికి పునాది. అందువల్ల అధిక ఫైబర్స్ కలిగిన ఆహారాలు మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మనకు చాలా అవసరం.

మన రెగ్యులర్ డైట్ లో ఎంత మేరకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను చేర్చుకుంటామో అంతకు పదింతలు ప్రయోజనం పొందవచ్చు. అందవల్లనే మీ రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఫుడ్స్ చేర్చుకోవడం చాలా అవసరం. ఈ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఒకే సమయంలో అనే ప్రయోజనాలను అందిస్తుంది. మీ బరువును కంట్రోల్లో ఉంచుకోవడం, గుండెను సురక్షితంగా ఉంచుకోవడం, క్రొవ్వును కరిగించడంలో మరియు హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ పొందడానికి ఇది ఒక గొప్ప మూలం. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ ను చేర్చుకోవాలి.

మీ రెగ్యులర్ డైట్ లో అవసరమయ్యే ఫైబర్ రిచ్ ఫుడ్స్: క్లిక్ చేయండి

మీ దిన చర్యను ప్రారంభించడానికి ఒక ఉత్తమ మార్గం, అత్యధికంగా ఫైబర్ కలిగిన ఒక కప్పు ఓట్స్ తో మొదలుపెట్టండి. భోజన సమయంలో కొన్ని వెజిటేబుల్స్ మరియు సలాడ్స్ ను తీసుకోవడం ఉత్తమం. ఎప్పుడూ బ్రౌన్ రైస్ మరియు మిల్లెట్ వంటి అన్ రిఫైండ్ ధాన్యాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ తృణధాన్యాల మీ ఆహారంలో డైటరీ ఫైబర్ ను జోడిస్తుంది. ఇవే కాకుండా మరికొన్ని ఫైబర్ కలిగి ఆహారాలు కూడా ఉన్నాయి వాటిని మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకొని, ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోండి.

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పొందే ముఖ్యమైన ప్రయోజనాలను తెలుసుకోండి.

బరువును కంట్రోల్లో ఉంటుంది:

బరువును కంట్రోల్లో ఉంటుంది:

అత్యధిక పైబర్ కలిగిన ఆహారాలను తినడం వల్ల బరువు తగ్గించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం. ఫైబర్ మీకు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. మరియు ఇది శరీరంలో కొవ్వు ఏర్పడకు కుండా జీవక్రియలను నిధానం చేస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

మీ రెగ్యులర్ డైట్ లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల రక్తనాళాల్లో శోషణ చెందుతుంది. డయాబెటిక్ పేషంట్స్ ఫిట్ గా ఉండటానికి అద్భుతంగా సహాయపడుతుంది.

బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది.

బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది.

ఫైబర్ తిన్న ఆహారంను చాలా తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. దాంతో మలబద్దకాన్ని నివారించవచ్చు.

గుండె కు రక్షణ కల్పిస్తుంది:

గుండె కు రక్షణ కల్పిస్తుంది:

హైఫైబర్ కలిగిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. దాంతో చిన్న వయస్సులో వచ్చే హార్ట్ అటాక్ ను 40శాతం తగ్గించుకోవచ్చు.

చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది:

చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది:

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలతో మరో అడ్వాంటేజ్ శరీరంలో ఫంగల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. దాంతో మొటిమలు మరియు మచ్చలను చెక్ పెట్టి, చర్మ సౌందర్యాన్ని ఇనుమడిపం చేసుకోవచ్చు . చర్మాన్ని క్లియర్ చేస్తుంది మరియు మెరిసేటి చర్మ ఛాయను పెంచుతుంది.

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్:

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్:

కొంత మంది ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడుతుంటారు. ఫలితంగా క్రోనిక్ ఇన్ డైజన్ కు దారితీస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల క్రోనిక్ పెయిన్ నివారించడంతో పాటు, అజీర్తి సమస్యలను నివారించవచ్చు .

గాల్ స్టోన్ మరియు కిడ్నీ స్టోన్ నివారిస్తుంది:

గాల్ స్టోన్ మరియు కిడ్నీ స్టోన్ నివారిస్తుంది:

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారంను తీసుకోవడం వల్ల అది రక్తంలో షుగర్ చిక్కులను నివారిస్తుంది, దాంతో గాల్ స్టోన్ (పిత్తాశయంలో రాళ్ళు) మరియు కిడ్నీ స్టోన్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది:

చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది:

ఇన్ సోలుబుల్ ఫైబర్ (కరిగేటటువంటి ఫైబర్) మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అది రక్తకణాలు, నాళాల్లో మరియు గుండెలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. హై బ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ డిసీజ్ ల నుండి మనల్ని రక్షిస్తుంది.

కోలన్ క్యాన్సర్:

కోలన్ క్యాన్సర్:

మన శరీరంలోని మలినాలన్నింటి బయటకు విసర్జించే ప్రధాన అవయవం పెద్ద ప్రేగు. అటువంటి పెద్ద ప్రేగు క్యాన్సర్ కు గురికాకుండా ఉండాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమమైన మార్గం.

English summary

Health Benefits Of A Fibre-Rich Diet

Most of us follow a diet only to lose weight. Very few actually look at the nutritional angle to dieting. You have the perfect figure you wanted, but if your nutrition is not proper, you would never look beautiful. This is because health is the most basic source of beauty. That is why the benefits of a high fibre diet are relevant to us.
Desktop Bottom Promotion