For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేరుశెగలోని టాప్ 12 ఆరోగ్య ప్రయోజనాలు

|

వేరుశెనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే.ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చివి. లేదా వేయించినవి. లేదా ఉప్పుపట్టిం చినవి తినవచ్చు. రోజుకో గుప్పెడు పల్లీలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీల్లో బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. పల్లీల్లో మోనోశాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇందులోని మోనో శాచ్యురేటెడ్‌ కొవ్వు గుండెకు మంచిది. శరీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్‌ ఇ, నియాసిన్‌, ప్రోటీన్‌, మాంగనీసు వేరుశెనగల్లో అధికం. అలాగే అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. యాంటీఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండే ప్రోటీనలు కణాలు, కణజాల మర్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా కాపాడుతుంది.

వంటింట్లో తప్పనిసరిగా వుండేవి పల్లీలు అంటే వేరుశెనగలు. ఇవిలేకుండా పొద్దున్న ఇడ్లీలోకి చట్నీ రాదు. వేపుడు కూరల్లో అందం, రుచి రాదు. బగారా బేంగన్‌లో కమ్మదనం రాదు. సాయంత్రం పిల్లలకు చిక్కీ, కాలక్షేపం అసలే కాదు! ఇవికాక పిల్లలంతా ఇష్టపడే స్నిక్కర్స్‌ వంటి చాకొలెట్లకు ఆ రుచి పల్లీల వల్లనేగా వచ్చింది. విదేశాల్లో పీనట్‌ బటర్‌, బ్రెడ్‌ బెస్ట్‌ కాంబినేషన్‌. రోజుకో గుప్పెడు తింటే చాలు... మీ ఆరోగ్యం పదిలంగా కాపాడతామని కమ్మగా చెప్పే పల్లీ కబుర్లేమిటంటే ...

గుండె:

గుండె:

వేరుశెనగలోని అన్ శాచురేటెడ్ ఫ్యాట్ మీ గుండెను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. హార్ట్ స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది. వేరుశెనగపప్పులు వారంలో రెండు సార్లు కొద్దిగా కొద్దిగా తింటు గుండె సంబంధిత జబ్బులను దూరం చేయవచ్చు.

గాల్ స్టోన్ నివారిస్తుంది:

గాల్ స్టోన్ నివారిస్తుంది:

వేరుశెనగులు మన శరీర ఆరోగ్యం మీద బహుముఖంగా పనిచేస్తుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే పిత్తాశయంలో రాళ్ళు అభివ్రుద్ది చెందకుండా కాపాడుతుంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

వేరుశెనగపప్పులోని అవసరం అయ్యే అమినో యాసిడ్స్ మెదుడు నాడీకణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. అది మన మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

వేరుశెనగపప్పులో అధిక న్యూట్రీషియంట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

పల్లీల్లోని విటమిన్స్ మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పల్లీల్లోని ఫ్యాట్ శక్తిగా మార్పు చెందుతుంది మరియు మెటబాలీజంను మెరుగుపరుస్తుంది. మానవ శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇది బాగా సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి :

ఎముకల ఆరోగ్యానికి :

పల్లీల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలోని కేల్షియమ్‌, విటమిన్‌ డిలు ఎముకపుష్టికి దోహదపడతాయి.

సెల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది:

సెల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది:

శరీరంలో సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులను బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.

జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది:

జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది:

శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరం అయ్యే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. వేరుశెనగలో విటమిన్ బి పుష్కలంగా ఉండి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్‌ అనే పాలిఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసే శక్తి వుంటుంది. ప్రతి వందగ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్‌ 'ఇ' ఉంటుంది.

చర్మానికి హాని కలగకుండా ఫ్రీరాడికల్స్ ను నిరోధిస్తుంది:

చర్మానికి హాని కలగకుండా ఫ్రీరాడికల్స్ ను నిరోధిస్తుంది:

ఇది చర్మానికి హాని కలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీల్లో రెబోఫ్లేవిన్‌, నియాసిన్‌, థయామిన్‌, విటమిన్‌ బి6, ఫొలేట్లు అధికంగా ఉంటాయి.

ఎదిగే పిల్లల ఆరోగ్యానికి:

ఎదిగే పిల్లల ఆరోగ్యానికి:

వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని మంచి పోషకాలుగా అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్‌ కారకాలు పేరుకోకుండా వాటిని అదుపులో ఉంచుతాయి.

వ్యాధినిరోధక శక్తి:

వ్యాధినిరోధక శక్తి:

ఇవన్నీ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్‌ను పల్లీలే అందిస్తాయి. కాబట్టి రోజుకో గుప్పెడు పల్లీలను తినడం అలవాటు చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.

English summary

Top 12 Health Benefits of Peanut

Peanuts are also known as groundnuts. Peanuts are of different varieties with good taste. Peanuts consist of proteins, minerals, vitamins and essential amino acids. Peanuts have anti-oxidant properties that lower the risk of heart disease.
Desktop Bottom Promotion