For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామోద్దీపన కలిగించే లవ్లీ ఫ్రూట్స్: వాలెంటైన్స్ డే స్పెషల్

|

ఫిబ్రవరి 14 వాలెంటైన్ డే. మరి మీరు ప్రేమికుల రోజు సెలబ్రెట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారా? ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన రోజు వాలెంటైన్స్ డే. ఈ రోజు ప్రేమికులు ఒకరి నొకరు కలుసుకొని వారి మనస్సులోని భావాలను వ్యక్త పరచుకొనే ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజుకు కోసం ప్రతి జంట ఎంతో ఆత్రుతగా సంవత్సరం పాటు ఎదురుచూస్తుంటుంది. ఈ రోజును హెల్తీగా, గ్లామరస్ గా ప్రత్యేకంగా కనబడాలని కోరుకుంటారు. వాలెంటైన్ డే రోజుకు మరో ప్రత్యేకత ఆరోగ్యకరంగా తినడం. ఆరోగ్యకరంగా మనస్సుకు ఉల్లాసాన్ని ఉత్సహాన్ని కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆటోమాటిక్ గా మూడ్ మారుతుంది. మంచి మూడ్ తో రోజంతా సంతోషంగా గడపవచ్చు. ఈ ప్రేమికుల రోజున ఎవరైతే ఎక్కువగా లవ్లీ ఫ్రూట్స్ ఇష్టపడుతారో వారికోసం కొన్ని కామోద్దీపను పెంచే పండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఈ హెల్తీ ప్రూట్స్ ను వాలెంటైన్స్ డే న కపుల్స్ తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. మనస్సును ఉత్సహాంగా...ఉల్లాసంగా ఉంచడం మాత్రమే కాదు, కామోద్దీపనను నేచురల్ గా పెంచుతాయి. ఈ రుచికరమైన ఆప్రొడిసియాక్ ఫ్రూట్ కామోద్దీపన పెంచుతుంది మరియు మంచి మూడ్ ను ప్రోత్సహిస్తుంది. ఈ స్పెషల్ డేన తీసుకొనే ఇతర ఆహారాలతో ఈ ఆప్రొడిసియాక్ ఫ్రూట్స్ ను పోల్చినప్పుడు, వీటిలో ఎక్కువ ప్రోటీనులు మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

READ MORE: లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్

ముఖ్యంగా ఈ ప్రూట్ టమ్మీని తేలికపరుస్తాయి కాబట్టి, వీటిని పోస్ట్ లైట్ డిన్నర్ గా వీటిని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల వాలెంటైన్ స్పెషల్ డేన మంచి మూడ్ పొందడానికి సహాయపడుతాయి. మరి అలాంటి హెల్తీ ఆప్రొడిసియాక్ ఫ్రూట్స్ ఈ క్రింది విధంగా...

అవొకాడో:

అవొకాడో:

ఈ గ్రీన్ ఫ్రూట్ లో ఎక్కువ క్యాలరీలున్నాయి. కాబట్టి, క్యాలరీలను తగ్గించుకోవాలనుకొనే వారు వీటికి దూరంగా ఉండవచ్చు,. అయితే ఒక్కరోజుకు తీసుకోవడంలో ఎలాంటి పెద్ద మార్పు ఉండదు కాబట్టి, ఈ కామోద్దీపన కలిగించే ఫ్రూట్ ను వాలెంటైన్ డే స్పెషల్ గా తీసుకోవచ్చు.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో ఎక్కువ పొటాషియం కలిగి ఉంటుంది. ఈ పండ్లు మనకు అవసరం అయ్యే ఎనర్జీని మరియు విటమిన్ బి ని పుష్కలంగా అందిస్తుంది. దాంతో మంచి మూడ్ ను ప్రోత్సహిస్తుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ ఒక హెల్తీ ఆప్రొడిసియాక్ (కామోద్దీపన)పెంచే పండ్లు. ఇది మన మొత్తం శరీరానికి ఒక వయాగ్రాలా పనిచేస్తుంది. వాటర్ మెలోన్ తినడం వల్ల బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి మరియు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.

 ఫిగ్స్:

ఫిగ్స్:

ఫిగ్స్ ఫ్రూట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది మరియు ఇది ఒక యాంటీబయోటిక్ పుష్కలంగా ఉండే పవర్ హౌస్ వంటిది. ఇది కామోద్దీపనను ప్రోత్సహిస్తుంది . అంతే కాదు, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

కపుల్స్ కు స్ట్రాబెర్రీస్ ఒక హెల్తీ ప్రోడిసియాక్ ఫ్రూట్ . వాలెంటైన్ డే న వీటిని హ్యాపీగా తినవచ్చు . ఈ చిన్న పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ జ్యూస్ లో ఐరన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ అంశాలు అంగస్తంభన సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందువల్లే వీటిని వాలెంటైన్ స్పెషల్ గా తీసుకోవచ్చు.

చెర్రీస్:

చెర్రీస్:

చెర్రీస్ లో ఉండే మెలటోనిన్ అనే అంశం హార్ట్ ను క్రమబద్దీకరించి, తగిన ఎనర్జిని అందిస్తుంది. అందువల్ల గుప్పెడు చెర్రీస్ ను తీసుకోవడం వల్ల మీలో లిబిడో పెరుగుతుంది.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . దీన్ని రాత్రుల్లో తీసుకోవడం వల్ల ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది.

మస్క్ మెలోన్:

మస్క్ మెలోన్:

కామేచ్చను పెంపొందించే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మస్క్ మెలోన్ బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. దాంతో మీ వాలెంటైన్ డేను మరింత ఉత్సాహాంగా జరుపుకోవచ్చు.

 ద్రాక్ష:

ద్రాక్ష:

గ్రీన్ గ్రేప్స్ తో పోల్చినప్పుడు బ్లాక్ గ్రేప్స్ ను చాలా ఆరోగ్యకరమైనవి. బ్లాక్ గ్రేప్ యొక్క జ్యూస్ ను తీసుకోవడం ద్వారా మంచి ఎనర్జీని పొందవచ్చు.

బ్లాక్ రాస్బెర్రీ:

బ్లాక్ రాస్బెర్రీ:

బ్లాక్ రాస్బెర్రీలో ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. కామోద్దీపనను పెంచడంలో ఇది ఒక ఉత్తమ ఆహారం.

పీచెస్:

పీచెస్:

పీచెస్ స్పెర్మ్ కౌంట్ ను మరియు స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుంది. అందువల్ల ఇది ఒక బెస్ట్ ఆప్రొడిసియాక్ ఫ్రూట్ గా తీసుకుంటారు.

English summary

12 Healthy Fruits To Boost Lovemaking On Valentine's Day

Healthy Fruits To Boost Lovemaking On Valentine's Day:Valentine's day is around the corner and couples are getting ready to celebrate this special day of love. Eating healthy should be the first thing on your mind. Secondly, indulging in foods that will get you in the mood is important.
Story first published: Friday, February 13, 2015, 17:49 [IST]
Desktop Bottom Promotion