For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తుల ప్రక్షాళన కోసం 14 అత్యుత్తమ ఆహారాలు

By Super
|

మీ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కొన్ని ఉత్తమ ఆహారాలు ఉన్నాయి. మీరు వాటిని భాగస్వామ్యం చేసే ముందు, ఊపిరితిత్తుల గురించి ఒక అవగాహన కలిగి ఉండండి. మా శరీరంలో ఊపిరితిత్తులు యొక్క ప్రాముఖ్యత మాకు తెలుసు. అవి ఆక్సిజన్ తీసుకోవటానికి మరియు మొత్తం శరీరంనకు సరఫరా చేయటం మరియు అదే సమయంలో అవి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు విసర్జన చేయటానికి సహాయపడతాయి. శ్వాసలో ప్రేరణ (గాలి తీసుకోవడం), నిశ్వాసంలో (మా శరీరం నుండి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వదలటం) సహాయపడుతుంది. ఊపిరితిత్తుల విధులు మొత్తం అయిపోలేదు.ఇంకా ఉన్నాయి. ఇది రక్తంలో ఆక్సిజనేట్స్ వచ్చేలా చేస్తుంది. అంటే ఇది రక్తంలో ఆక్సిజన్ ను జతచేస్తుందని అర్థం. ఈ ఆక్సీకరణ రక్తం మొత్తం గుండె నుండి శరీర అన్ని భాగాలకు పంపింగ్ అవుతుంది.

ఊపిరితిత్తులు సరిగా లేకపోతే,మనం కేవలం ఆక్సిజన్ లేని కారణంగా మరణించటం జరుగుతుంది. కాబట్టి మన ఊపిరితిత్తుల పట్ల శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం.

ఊపిరితిత్తుల పట్ల కేర్ తీసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మొదట ఒక సాధారణ సలహా ధూమపానం మానివేయటం అని చెప్పవచ్చు. సిగరెట్లు పొగ మరియు నికోటిన్ అనేవి ఊపిరితిత్తుల యొక్క ఏ బాగాన్ని అయిన నష్టానికి గురి చేయవచ్చు. ఊపిరితిత్తులు దెబ్బతిని చివరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుంది.

ఊపిరితిత్తులకు న్యుమోనియా,ఫ్లూ రకాలు,ఉబ్బసం మొదలైన ఇతర శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. మీరు చేయటానికి నివారణ మార్గాలు ఉన్నాయి. శ్వాసకోశానికి అంటుకొనే వైరస్ లేదా బాక్టీరియా వ్యాధులు అనేకం ఉన్నాయి. మీరు మీ విలువైన ఊపిరితిత్తులను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

READ MORE:ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు

మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోని, బోల్డ్ స్కై మీ ఊపిరితిత్తులను శుభ్రంగా,ఆరోగ్యంగా ఉంచటానికి మరియు కాలుష్య పొగ ద్వారా వచ్చే విషాన్ని బయటకు తీయటానికి సహాయపడే ఉత్తమ ఆహారాలను మీతో భాగస్వామ్యం చెయ్యాలనుకుంటుంది.

మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

కెరోటినాయిడ్స్ ఉన్న ఆహారాలు

కెరోటినాయిడ్స్ ఉన్న ఆహారాలు

క్యారట్,చిలకడదుంప,ముదురు ఆకుపచ్చని కూరలు,టమాటా వంటి కొన్ని పండ్లు మరియు కూరగాయలలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. కెరోటినాయిడ్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఒక ఉత్తమ యాంటిఆక్సిడెంట్ ను కలిగి ఉంటుంది. ఉబ్బసం రోగులకు మంచి ఉపశమనంను కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం కెరోటినాయిడ్ ఉన్న కూరగాయలను తీసుకోవాలి.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలు

ఇవి ఊపిరితిత్తులకు ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెతో సహా అన్ని శరీర బాగాలకు ముఖ్యమైనవి. ఇవి చాలా మంచి చేస్తాయి. ఇవి శ్వాస వంటి ఆస్త్మా లక్షణాలు, గురక మొదలైన వాటికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న గొప్ప ఆహారాలను తీసుకోవడం వలన ఉబ్బస రోగుల పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. సాల్మన్, ట్యూనా, ట్రౌట్ వంటి చేపలు,నట్స్,అవిసె గింజలు వంటి ఆహారాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.

క్రుసిఫెరూస్ కూరగాయలు

క్రుసిఫెరూస్ కూరగాయలు

మీ ఊపిరితిత్తులకు ఉత్తమ మరియు సమర్థవంతమైన, ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇది ఒకటి. ఈ కూరగాయలలో క్యాబేజీ, బ్రోకలీ, టర్నిప్ క్యాబేజీ మరియు బ్రోకలీ ఉన్నాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. మీ ఊపిరితిత్తుల నుండి అన్ని రకాల విషాలను తొలగించి నిర్విషీకరణ చేస్తుంది. ఈ కూరగాయలను సలాడ్ రూపంలో తీసుకోవటం ఉత్తమ మార్గం.

ఫోలేట్ ఉన్న ఆహారాలు

ఫోలేట్ ఉన్న ఆహారాలు

ఫోలేట్ మన శరీరంలో ఫోలిక్ అమ్లంగా మార్చబడుతుంది. బచ్చలికూర, బ్రోకలీ,బీట్ రూట్, ఆస్పరాగస్, సిట్రస్ పండ్లు,కాయధాన్యాలు మరియు అవెకాడో పండు వంటి వాటిలో ఫోలేట్ సమృద్దిగా ఉంటుంది. ఈ ఆహారాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కి కారణమయ్యే పదార్థాలను తొలగించడానికి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడతాయి. ఇవి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యకరమైన ఉత్తమ ఆహారాలలో ఒకటిగా ఉన్నాయి.

విటమిన్ సి ఉన్న ఆహారాలు

విటమిన్ సి ఉన్న ఆహారాలు

ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల ఆహారం అని ఎలా చెప్పగలరు? ఈ ఫలాలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఒక శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్ ని కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులలో శ్వాస మరియు అన్ని శరీర బాగాలకు ఆక్సిజన్ సరఫరాకు సహాయపడుతుంది. మనం తీసుకొనే ఆహారంలో విటమిన్ C సమృద్దిగా ఉండాలి. నారింజ,నిమ్మ,టమోటా, బెల్ పెప్పెర్ (కాప్సికమ్స్), కివీ ఫ్రూట్,స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, పైనాపిల్ మరియు మామిడి వంటి అన్నిరకాల సిట్రస్ పండ్లలో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. ఈ పండ్లు కూడా ఊపిరితిత్తుల నుండి విషాన్ని తొలగించటంలో సహాయపడతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

దీనిలో అల్లిసిన్ అనే ఒక క్రియాశీల పదార్ధం ఉంటుంది. ఈ పదార్ధం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అంటువ్యాధుల మీద పోరాటం చేయటానికి మరియు ఊపిరితిత్తుల మంటను తగ్గించటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో కూడా యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఊపిరితిత్తుల నుండి మరియు అన్ని శరీర బాగాల నుండి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ ని కూడా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఉబ్బసం రోగులు మరియు ఏవైనా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నవారి కోసం కూడా మంచిగా ఉంది.

బెర్రీస్

బెర్రీస్

బెర్రీస్ ఊపిరితిత్తులు కోసం సూపర్ ఆహారాలుగా ఉన్నాయి. వీటిలో అనేక యాంటి ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్ సమృద్దిగా ఉంటాయి. వాటిలో ప్రదానంగా లుటీన్ మరియు శెఅక్షన్థిన్ అనే యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి ఊపిరితిత్తుల నుండి కార్సినోజెన్స్ తొలగించి ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇవి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గించటానికి మరియు ఉబ్బసం కొరకు మంచిగా ఉన్నాయి. మీరు నీలం బెర్రీ, రాస్బెర్రి మరియు బ్లాక్బెర్రీస్ వంటి ముదురు బెర్రీలను తీసుకోవాలి. ఇవి మీ ఊపిరితిత్తుల కోసం ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో ఒకటిగా ఉన్నాయి.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్ ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల ఉత్తమ పండ్లుగా ఉన్నాయి. వాటిలో అనేక పోషకాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్ మరియు అనేక విటమిన్లు ఉన్నాయి. యాపిల్స్ తినటం వలన ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు.ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధిని నిరోధిస్తాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యమైన ఉత్తమ సహజ ఆహారాలలో ఒకటిగా ఉన్నాయి.

అల్లం

అల్లం

ఈ మసాలా అదనపు రుచి మరియు ఆరోగ్యాన్ని పెంచటానికి మీ భోజనంలో దీనిని పొందుపరచటం చాలా సులభం. శోథ నిరోధక చర్య ద్వారా మీ ఊపిరితిత్తులను క్లియర్ చేయటం మరియు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే కాలుష్యంను నిదానింపచేస్తుంది. అలాగే మీరు కూడా గొప్ప ఆరోగ్యం కోసం ఒక ఔషధం గా అల్లం ఎలా ఉపయోగించాలో నా వ్యాసం చదవితే ఆసక్తి కలగవచ్చు.

పసుపు

పసుపు

ఇది ఊపిరితిత్తుల వాపును తగ్గించడానికి మరియు ఆస్త్మా రోగులకు చాలా మంచిగా ఉంటుంది. దీనిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కి కారణమయ్యే పదార్థాలను తొలగించటానికి సహాయపడే కుర్సుమిన్ అనే పదార్దం ఉంటుంది.

దానిమ్మ

దానిమ్మ

ఇది క్యాన్సర్ అభివృద్ధి నుండి మీ ఊపిరితిత్తులను రక్షిస్తుంది. దీనిలో ఊపిరితిత్తుల నుండి విష పదార్థాలు తొలగించి రక్త సరఫరా పెంచడానికి సహాయపడే యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.

ద్రాక్ష

ద్రాక్ష

ఊపిరితిత్తులు మంచి ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేసే ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఊపిరితిత్తులను అనేక వ్యాధుల నుండి రక్షించటానికి అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి ఊపిరితిత్తుల నిర్విషీకరణ మరియు వాటిని శుభ్రంగా ఉంచుతాయి.

మెగ్నీషియం ఉన్న ఆహారాలు

మెగ్నీషియం ఉన్న ఆహారాలు

మెగ్నీషియం ఉబ్బసం రోగులకు ఒక మంచి మినరల్ గా ఉంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచటానికి మరింత ఆక్సిజన్ ని అందిస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల సమర్థత పెరుగుతుంది. నట్స్, బీన్స్, అవెకాడో పండు, అరటి పండు, చేపలు మరియు డ్రై ఫ్రూట్స్ వంటి వాటిలో మెగ్నీషియం సమృద్దిగా ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారంను తీసుకోవాలి.

నీరు

నీరు

తగినంత నీరు తీసుకొంటే మీ ఊపిరితిత్తులను హైడ్రేట్ గా ఉంచటానికి మరియు ఊపిరితిత్తులతో సహా అన్ని అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఊపిరితిత్తుల నుండి విషాన్నితొలగించటానికి సహాయపడి, వాటిని ఆరోగ్యకరముగా ఉంచుతుంది.

English summary

14 Best Foods For Lung Cleansing

There are some best foods for your lung health. Before sharing them with you, let's have an understanding of lungs. As we all know lungs the importance of lungs in our body. They take oxygen and supply it to the whole body and at the same time they excrete out carbon dioxide.
Desktop Bottom Promotion