For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల వ్యాధుల కోసం 15 రకాల హెర్బల్ టీలు

|

వ్యాధుల కోసం అనేక రకాల హెర్బల్ టీలు ఉన్నాయి. మీరు విసిగి మరియు అలిసిపోయి ఉన్నప్పుడు, ఓదార్పు ప్రభావం అనుభవించడానికి ఒక కప్పు మూలికా టీని త్రాగవచ్చు. మీరు రిఫ్రెష్ అవుతారు. మూలికా టీలు చాలా ఎక్కువ చేస్తాయి. వీటివల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయా? అవును,ఉన్నాయి. కొన్ని మూలికలలో నయం చేసే లక్షణాలు ఉంటాయి. మీరు ఆ టీని త్రాగితే అద్భుతమైన ప్రభావాలను అనుభవించవచ్చు. హెర్బల్ టీలు నిద్రలేమి, అజీర్ణం సమస్యలను నివారిస్తుంది.

ఒక మూలికా టీలో ఏమీ ఉండదు. కానీ నీటిలో కలిపితే ఒక మూలిక యొక్క సారం ఉంటుంది. సాధారణంగా, మూలికలు లేదా విత్తనాలను నీటిలో ఉడికిస్తారు. అప్పుడు హెర్బ్ గుణాలు నీటిలోకి సేకరించబడతాయి. అప్పుడు ఆ నీటిని టీగా సేవిస్తారు. ఈ మార్గంలో,మూలిక యొక్క ఆరోగ్య ప్రయోజనాలను వినియోగించవచ్చు. ఇప్పుడు వ్యాధుల కోసం అనేక రకాల మూలికా టీల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

మాకు గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు లో సమృద్దిగా ఉంటాయని తెలుసు. గ్రీన్ టీ త్రాగితే మరో అనుకూలత ఏమిటంటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ టీ ఆరోగ్యకరమైన కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. అలాగే,ఈ టీ మీకు విశ్రాంతి మరియు ఉధృతిని తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన మూలికా టీలలో ఒకటి.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

మాకు బ్లాక్ టీలో శోథ నిరోధక ఎజెంట్ సమృద్దిగా ఉన్నదనే వాస్తవం గురించి తెలియదు. బ్లాక్ టీ మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది. అంతేకాక ఈ టీ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఊలాంగ్ టీ

ఊలాంగ్ టీ

ఈ టీ మీ చర్మం కోసం మంచిగా ఉంది. అంతేకాక ఇది కొన్ని చర్మ సమస్యల చికిత్సలో బాగా పని చేస్తుంది.అలాగే ఈ టీ మీ బరువు నియంత్రణలో సహాయం చేస్తుంది.

వైట్ టీ

వైట్ టీ

వైట్ టీని ఇతర టీలతో పోలిస్తే కెఫిన్ యొక్క స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి,దీనిలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మీరు అధిక బిపితో బాధపడుతూ ఉంటే,అప్పుడు బిపి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి మీరు ఈ టీని ప్రయత్నించవచ్చు.అంతే కాకుండా అన్ని లక్షణాలు నుండి,యాంటి బ్యాక్టిరియాల్ లక్షణాలు ఉన్నాయి.

రూఇబోస్

రూఇబోస్

ఈ టీలో దాదాపు కెఫిన్ ఉండదు. మీరు చర్మ దురదలతో బాధపడుతూ ఉంటే, దానికి కొంత ఉపశమనం కలగటానికి మీరు ఈ టీని ప్రయత్నించవచ్చు.అలాగే, ఈ టీ క్యాన్సర్ పోరాట ఏజెంట్లను కలిగి ఉంది.

పిప్పరమింట్

పిప్పరమింట్

ఈ మూలిక యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. అలాగే దీనిలో ఆకలి అణచివేసే లక్షణాలున్నాయి. ఈ మూలిక ఒక మంచిగా శ్లేష్మ పొర శోధమును నివారించే మందుగా ఉంది. ఇది ఆరోగ్యకరమైన మూలికా టీలలో ఒకటి.

ఎండిన అల్లం

ఎండిన అల్లం

అల్లం నయం చేసే లక్షణాలతో నిండిపోయింది. అంతేకాక అల్లం టీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మూలిక యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు వ్యతిరేక హిస్టామిన్ లక్షణాలను కలిగి ఉంది. ఈ మూలికా టీ జీర్ణక్రియ కోసం బాగా పనిచేస్తుంది.

నేట్టేల్ టీ

నేట్టేల్ టీ

ఈ టీ నిర్దిష్ట కాలానుగుణ అలెర్జీలకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది మీ శక్తి స్థాయిలను పెంచడానికి మంచిది.సాధారణంగా కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆర్థరైటిస్ కోసం ఒక ఔషధంగా ఈ టీని ఉపయోగిస్తారు.

యెర్బా మెట్

యెర్బా మెట్

ఈ మూలిక మీ కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు రక్తపోటును తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంది.ఇది మీ శ్వాస వ్యవస్థను నయం చేయటంలో ఒక మంచి పాత్రను పోషిస్తుంది.

నిమ్మ ఔషధతైలం

నిమ్మ ఔషధతైలం

మీరు మీ ఉధృతిని తగ్గించి ఆనందంగా ఉండాలంటే ఈ టీని ప్రయత్నించవచ్చు. అలాగే ఈ టీ కోల్డ్ వంటి కొన్ని శ్వాస సమస్యలను పరిష్కరిస్తుంది. మీకు జీర్ణ సమస్యలు ఉంటే, మీరు ఈ టీని ప్రయత్నించవచ్చు. ఈ మూలికా టీ తలనొప్పిని తగ్గిస్తుంది.

సీమ చామంతి

సీమ చామంతి

మీరు నిద్ర రుగ్మతలతో బాధపడుతూ ఉంటే, మీరు ఈ టీని ప్రయత్నించవచ్చు. అలాగే బాక్టీరియల్ లక్షణాలను తొలగించి బాక్టీరియా అంటువ్యాధులు రాకుండా ఈ టీ సహాయం చేస్తుంది.

మందార

మందార

మందార సారం నుండి తయారుచేసే ఈ టీ నిజంగా రిఫ్రెష్ గా ఉంటుంది. ఈ టీ లో చాలా విటమిన్లు ఉంటాయి. అలాగే,ఇది బిపి తగ్గించడంలో సహాయపడుతుంది.

రెడ్ క్లోవర్

రెడ్ క్లోవర్

ఋతుక్రమ లక్షణాలతో బాధపడే మహిళలకు కొంత మేర ఉపశమనం కలగటానికి ఈ టీని ప్రయత్నించవచ్చు. ఈ మూలిక కొన్ని హృదయ సమస్యలను నుండి కూడా రక్షణ అందిస్తుంది.

డాండెలైన్

డాండెలైన్

ఈ మూలికా టీ జీర్ణక్రియ కోసం బాగా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో,ఈ మూలికను కామెర్లు మరియు హెపటైటిస్ చికిత్సకు ఒక ఇంటి ఔషధంగా ఉపయోగిస్తారు.అంతేకాక ఈ టీ మూత్రపిండాల్లో రాళ్లకు ఒక ఔషధంగా ప్రయత్నించవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మీ శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్ల మీద పోరాటం చేయటానికి సహయపడుతుంది. అంతేకాక మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని ప్రదేశాలలో,దాల్చిన చెక్కను ఆర్థరైటిస్ యొక్క లక్షణాలను చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

English summary

15 Herbal Teas For Every Ailment

There are various herbal teas for every ailment. When you are tired and exhausted, taste a cup of herbal tea to experience its soothing effect. Of course, apart from refreshing you, herbal teas can do a lot more. Do they have health benefits? Yes, they do.
Desktop Bottom Promotion