For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గారపళ్లతో నలుగురిలో నవ్వడానికి ఇబ్బంది పడుతున్నారా ?

By Nutheti
|

ముఖానికి అందం చిరునవ్వు... చిరునవ్వుకి ఆకర్షణ మెరిసే పళ్లు. అందంగా కనిపించాలన్నా.. ఆకట్టుకునేలా నవ్వాలన్నా.. పళ్ల వరుస ఎట్రాక్టివ్ గా ఉండాలి. మిళమిళ మెరిసే తెల్లటి పళ్లు ఉండాలి. నలుగురిలో హాయిగా నవ్వడానికి.. ఆకర్షణీయంగా కనపడటానికి పళ్ల పాత్ర చాలానే ఉంది. కాబట్టి పళ్లు అందంగా.. ఎట్రాక్టివ్ గా.. ఉండాలి.

READ MORE: ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్లకోసం టాప్ 10 హెల్తీ ఫుడ్స్

రోజూ బ్రష్ చేసినా.. కొంతమందికి పళ్లు పచ్చగా.. అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్లు గారపట్టింటాయి. గారపట్టిన పళ్ల వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గారపోగొట్టుకోవడానికి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా కొంతమందికి పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండే సహజ వస్తువులతో.. కొంతకాలంలోనే మీ పళ్లను తెల్లగా మార్చేసే అద్భుతాలున్నాయి. మెరిసే దంతాల కోసం ఈ ఈజీ అండ్ హెల్తీ టిప్స్ మీ కోసం...

డార్క్ చాకొలేట్

డార్క్ చాకొలేట్

మీరు విన్నది నిజమే. స్వీట్ ఎక్కువగా ఉండదు కాబట్టి డార్క్ చాకొలేట్ పంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే.. థియోబ్రొమైన్ దంతాల ఎనామిల్ ని ప్రొటెక్ట్ చేస్తూ.. పసుపుదనాన్ని, క్రిములను పోగొడుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా.. దంతాల సంరక్షణలో ఉపయోగపడుతుంది. సగం గ్లాస్ నీళ్లలో, సంగం టీ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. అందులో మీ బ్రష్ ముంచి.. దంతాలను శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల.. నెలరోజుల్లో మీ పళ్లు మెరిసిపోతాయి.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

మెరిసే, ఆరోగ్యమైన దంతాలకు స్ట్రాబెర్రీ చక్కటి పరిష్కారం. ఈ ఫ్రూట్ లో ఎసిడిక్ ఉంటుంది. ఇది పళ్లు మిళమిళ మెరవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వింటర్ యమ్మీగా ఉండే స్ట్రాబెర్రీస్ ని తింటూ ఉండండి.

అరటి తొక్క

అరటి తొక్క

ఇకపై అరటిపండు తిన్నాక తొక్కను పడేయకండి. తొక్కలో దంతాలకు మెరుపుతీసుకొచ్చే గుణం ఉంది. తొక్క లోపలి భాగాన్ని పళ్లపై రోజుకి ఒకసారి రుద్దుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ అరటితొక్కలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల అవి.. పళ్లు తెల్లగా మారడానికి సహకరిస్తాయి.

నారింజ తొక్క

నారింజ తొక్క

మెరిసే దంతాలకు నారింజ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. నారింజ తొక్కలో డి నెమనిన్ ఉంటుంది. ఇది స్మోకింగ్ వల్ల పళ్లపై ఏర్పడే క్రిములను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆరంజ్ తొక్కతో రోజుకి రెండుసార్లు పళ్లపై మసాజ్ చేసి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది.

తులసి

తులసి

దంతాల సంరక్షణకు, దంతాల తెల్లదనానికి తులసి సహజ ఔషధం. ఇది పళ్లపై పేరుకున్న బ్యాక్టీరియాని తొలగించి.. దంతాలు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడతాయి. కాబట్టి రోజూ తులసి ఆకులను నమలడం అలవరుచుకోండి.

పైనాపిల్స్

పైనాపిల్స్

మెరిసే పళ్ల కోసం.. పైనాపిల్స్ మంచి ఆప్షన్. ఇవి పళ్లు విరిగిపోవడాన్ని అరికడుతూ.. ఆరోగ్యంగా ఉండటానికి, మెరవడానికి ఉపయోగపడతాయి.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్ తినడం వల్ల టీత్ వైటెనింగే కాదు.. హెల్తీగానూ ఉంటాయి. ప్రధానంగా గ్రీన్ యాపిల్స్ లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పళ్లు తెల్లగా మారడానికి సహకరిస్తుంది.

English summary

8 Natural Foods For White Teeth in telugu

How good is your toothpaste? Does it work wonders in making your teeth sparkle? If no, then it time to turn to home remedies. There are a zillion kitchen ingredients you can use to make your teeth white.
Story first published: Thursday, October 29, 2015, 10:32 [IST]
Desktop Bottom Promotion