For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాలకులలో దాగున్న అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్

|

లడ్డూ, పాయసం, బర్ఫీ.. ఎలాంటి స్వీట్ కైనా మంచి సువాసనను, రుచిని అందిస్తాయి యాలకులు. ఏ తీపిపదార్థానికైనా.. కాసిన్ని యాలకులు జోడిస్తేనే అమోఘమైన రుచి వస్తుంది. తీపి వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా వాడే యాలకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

READ MORE: బ్లాక్ ఏలకులలోని 15 ఉత్తమ ప్రయోజనాలు

యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్ శరీరంలో బీపీని అదుపులో ఉంటుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత యాలక్కాయ తీసుకుంటే ఈజీగా జీర్ణమవుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో దీన్ని మించిన సుగంధ దినుసులు మరొకటి లేవు. వీటిలో ఎంత సువాసన దాగి ఉందో అంతకు మించిన ఆరోగ్య రహస్యాలున్నాయి. ఇంకెందుకు ఆలస్య యాలకుల్లో ఇమిడిఉన్న ఆరోగ్య ప్రయోజనాలేంటో చూసేద్దాం...

రక్త శుద్ధికి

రక్త శుద్ధికి

యాలకుల్లో విటమిన్ ఏ, బి, సి, రైబో ఫ్లేవిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి.

మూత్రసంబంధ వ్యాధులు

మూత్రసంబంధ వ్యాధులు

మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు యాలకులు తీసుకోవడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉసిరికాయ రసంలో ఒక స్పూన్ యాలకుల పొడి కలుపుకుని రోజుకి మూడుసార్లు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను కొన్ని రోజులు కంటిన్యూగా వాడితే మంచిది.

ఆకలి పెంచడానికి

ఆకలి పెంచడానికి

యాలకుల గింజలను చప్పరిస్తూ ఉండటం వల్ల నోట్లో కొన్ని ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. అంతేకాదు నోట్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహకరిస్తాయి.

దగ్గు, జలుబు

దగ్గు, జలుబు

దగ్గు, జలుబు తగ్గించడంలో యాలకులు పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. అలాంటి సమయంలో యాలకులు తింటూ ఉంటే.. జలుబు, దగ్గు తగ్గడమే కాకుండా.. గొంతులో ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది.

అరుగుదలకు

అరుగుదలకు

ఆహారంను సక్రమంగా జీర్ణం చేయటంలో యాలకులు బాగా సహకరిస్తాయి. ఆహారం జీర్ణం కాకపోవుట వల్ల వచ్చే కడుపులో మంట, నొప్పి నివారణకు యాలకులు బాగా పనిచేస్తాయి. కొన్ని యాలకులను పొడిచేసి, రెండు, మూడు లవంగాలు కలిపి పాలల్లో వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఒత్తడి తగ్గడానికి

ఒత్తడి తగ్గడానికి

ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు బాగా సహకరిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.

ఎసిడిటీ

ఎసిడిటీ

శరీరానికి అవసరమయ్యే నూనెలు యాలకుల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ బారి నుంచి కాపాడటానికి ఉపయోగపడుతాయి. కాబట్టి రోజూ భోజనం చేసిన తర్వాత యాలకులు తింటే చక్కటి ప్రయోజనం ఉంటుంది.

శ్వాస సంబంధిత వ్యాధులు

శ్వాస సంబంధిత వ్యాధులు

యాలకులు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సరిగా జరిగి ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తాయి.

ప్రీరాడికల్స్ నివారణకు

ప్రీరాడికల్స్ నివారణకు

యాలకుల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో అందించి.. శరీరంలోని ప్రీరాడికల్స్ ని నాశనం చేస్తాయి.

మద్యం, దూమపానానికి చెక్

మద్యం, దూమపానానికి చెక్

కమ్మని సువానస, రుచిని అందించే యాలకుల గింజలను తరచుగా నోట్లో వేసుకోవడం వల్ల.. మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండవచ్చు. రోజూ తినడం అలవాటు చేసుకుంటే.. చెడు అలవాట్లను పక్కకనెట్టవచ్చు.

వ్యాధినిరోధక శక్తి

వ్యాధినిరోధక శక్తి

యాలకులు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తాయి. శరీరంలో మెబలిజం ప్రక్రియను, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి యాజకులు తోడ్పడతాయి.

వ్యర్థాలు తొలగించడానికి

వ్యర్థాలు తొలగించడానికి

నిత్యం యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలను కిడ్నీల ద్వారా తొలగించడానికి సహాయపడతాయి.

బీపీ

బీపీ

యాలకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. బీపీ ఉన్నవాళ్లు వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి.

English summary

Amazing Health Benefits Of Cardamom in telugu

Cardamom has many benefits in the kitchen. As an aromatic spice, it is one of the most useful flavours to add in various cuisines. In India, it is an integral part of the mixed spice called 'Garam Masala' that is used more or less in all Indian curries.
Desktop Bottom Promotion