Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
మిగిలిపోయిన ఆహారాలను వేడిచేస్తున్నారా ? ఐతే జాగ్రత్త
ప్రస్తుతమున్న లైఫ్ స్టైల్ లో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. వండటానికి ఈజీగా ఉండే.. ఆహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది సింపుల్ రెడీమేడ్ ఫుడ్ తీసుకొచ్చి.. కాస్త వేడిచేసుకుని లాగించేస్తున్నారు. కానీ ఇలాంటి అలవాట్లు భవిష్యత్ లో కాలేయంపై దుష్ర్పభావం చూపుతాయి.
ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేయడం, పిల్లలతో చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తుండటంతో.. హెల్తీ డైట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. మరికొన్ని సందర్భాల్లో రాత్రి మిగిలిన ఆహారాన్నే ఉదయం కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా కర్రీస్ ఎక్కువగా వాడుతుంటారు. రెండోసారి తినాలనుకున్నప్పుడు ఆహారాన్ని వేడిచేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇలాంటి అలవాట్ల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
అసలు ఆహార పదార్థాలు ఎందుకు మళ్లీ వేడి చేయకూడదో మీకు తెలుసా ? ఎందుకంటే.. ఇందులో ఉండే పదార్థాలు మళ్లీ వేడిచేయడం వల్ల హానికరంగా మారతాయి. రీ ప్రాసెసింగ్ ఫుడ్స్ దానిలో ఉండే.. సహజ పోషకాలు, ఎంజైమ్స్ ని కోల్పోతాయి. కాబట్టి ఎలాంటి ఆహారాలు రీహీట్ చేయకూడదు ? అనే విషయం తెలుసుకుందాం..

చికెన్
చికెన్ చాలా సాధారణంగా ప్రతి ఒక్కరూ రీహీట్ చేస్తుంటారు. చికెన్ లో ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి. దీన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చికెన్ ఎప్పుడూ వేడిచేయకండి.

బచ్చలికూర
స్పినాచ్ లేదా బచ్చలికూరలో ఐరన్, నైట్రేట్స్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే రీహీట్ చేస్తామో.. ఇందులో ఉండే నైట్రేట్స్ నైట్రిట్స్ లా మారిపోతాయి. కాబట్టి బచ్చలికూరను అస్సలు రీహీట్ చేసి తీసుకోకూడదు.

ఎగ్స్
కోడిగుడ్లలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకోవడం మంచిది. కానీ దీన్ని మళ్లీ, మళ్లీ అస్సలు వేడి చేయకూడదు. కోడిగుడ్లను రీహీట్ చేయడం వల్ల టాక్సిక్ లా మారిపోయి, జీర్ణవ్యవస్థపై దుష్ర్పభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మష్రూమ్స్
మష్రూమ్స్ లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని వండిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా వేడిచేయకూడదు.

రైస్
అందరూ తరచుగా రీహీట్ చేసేవాటిలో రైస్ ఒకటి. వండని రైస్ లో బ్యాక్టీరియా ఉంటుంది. మనం వండిన తర్వాత అందులో ఉండే బ్యాక్టీరియా నాశనమవుతుంది. కానీ రైస్ ని మళ్లీ రీహీట్ చేయడం వల్ల అది విషపూరితంగా మారుతుంది.

బంగాళాదుంప
రీహీట్ చేయకూడని వాటిలో బంగాళదుంప ఒకటి. బంగాళ దుంపలు టాక్సిక్ ఫుడ్. వీటిని వేడిచేయడం వల్ల అందులో ఉండే పోషకవిలువలు కోల్పోతాయి. బంగాళదుంపలను ఎప్పుడూ ఉడకబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

సెలరీ
సెలరీని సూప్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే సూప్ తో కలిపి సెలరీని వేడి చేస్తామో అప్పుడు అవి నైట్రిట్స్ గా మారుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి.. సూప్ వేడి చేయాలి అనుకున్నప్పుడు సెలరీ తీసి.. వేడి చేయడం మంచిది.



Click it and Unblock the Notifications
