For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్ ఫ్లవర్ సీడ్స్ లోని పోషకాలు: ఆరోగ్యప్రయోజనాలు

|

ప్రకృతిలో జనిస్తున్న పుష్పాలు మానవాళిని కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కంటికింపుగా ఉంటుంది. ఆర్నికా పుష్ప జాతికి చెందిన ఈ పొద్దు తిరుగుడు దాదాపు 30 ఉపజాతులుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది. హెర్బాసియస్‌ ప్రజాతికి చెందితీ పుష్పాలు మృదువైన పూల రెక్కలతో పాటు వైవిధ్య భరితం గా కాస్త జుత్తు తగుతున్నట్లుంటే పత్రాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత

అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ప్రధమంగా వినియోగించెది వంటనూనెగా.. సౌందర్య ద్రవాలు, లేపనాలలో, చర్మరక్షణ నూనెలలో వినియోగిస్తారు. అంతే కాదు ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి, డైట్ లో చేర్చుకోవడానికి అనుమతిస్తుంటారు. ముఖ్యంగా విటమిన్ సి సోర్స్ అద్భుతంగా ఉన్నటువంటి ఆహార పదార్థం ఇది.

ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ ఇ కోలన్ క్యాన్సర్ మరియు డయాబెటిక్ రిస్క్ నుండి కాపాడుతాయి. వీనిలో పాలీ అన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు, ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పురుషుల్లో వంద్యత్వాన్ని నివారిస్తాయి . హైపర్ టెన్షన్ తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . ఐడ్యామేజ్ ను అరికడుతాయి . మరి ఇంకా మరికొన్ని ప్రయోనాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

క్యాన్సర్ నివారణి:

క్యాన్సర్ నివారణి:

సన్ ఫ్లవర్ సీడ్స్ విటమిన్ ఇ, సెలీనియం మరియు కాపర్ ను కలిగి ఉంటాయి . ఇవి నేచురల్ యాంటీఆక్సిడెంట్స్ . ఈయాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు కారణం అయ్యే సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తాయి. మరియు కొలన్ క్యాన్సరును నియంత్రణలో ఉంచుతుంది.

ఎముకల ఆరోగ్యానికి :

ఎముకల ఆరోగ్యానికి :

సన్ ఫ్లవర్ సీడ్స్ మెగ్నీషియంకు ఒక ఉత్తమ మూలం. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా చాలా అవసరం అవుతుంది.పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. సలాడ్స్‌, సూప్స్‌, బ్రెడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు.

ఒత్తిడిని మాయం చేస్తాయి:

ఒత్తిడిని మాయం చేస్తాయి:

సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తాయి. నాడీవ్యవస్థను ప్రశాంతపరిచి స్ట్రెస్ తగ్గిస్తుంది దాంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

సన్ ఫ్లవర్ సీడ్స్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతే కాదు వీటిలో ఉండే హైఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీనిలో పాలీ అన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు, ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

 కార్డియో వ్యాస్కులార్ హెల్త్:

కార్డియో వ్యాస్కులార్ హెల్త్:

సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే విటమిన్ సి కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను తగ్గిస్తుంది మరియు ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడటం వల్ల హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ ను నివారిస్తుంది.

 మెంటల్ హెల్త్:

మెంటల్ హెల్త్:

సన్ ఫ్లవర్ సీడ్స్ డిప్రెషన్ తగ్గిస్తుంది. సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే సెరోటనిన్ టెన్షన్ తగ్గిస్తుంది మరియు విశ్రాంతి పరుస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

సన్ ఫ్లవర్ సీడ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బౌల్ మూమెంట్ ను మరింత సులభం చేస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు.

చర్మ కేశ సంరక్షణకు:

చర్మ కేశ సంరక్షణకు:

వీటిలో మంచి ఫ్యాట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇతర ఉత్పత్తులతో పోల్చితే ఇందులో ఉండే విటమిన్‌ ఇ చర్మాన్ని, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఇ చర్మ మరియు కేశ ఆరోగ్యానికి మరియు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఆస్త్మా మరియు ఆర్థరైటిస్ :

ఆస్త్మా మరియు ఆర్థరైటిస్ :

ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్త్మా మరియు ఆర్థరైటిస్ ను తగ్గిస్తాయి..కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది.

సెలీనియం అధికంగా ఉంటుంది:

సెలీనియం అధికంగా ఉంటుంది:

పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే సన్ ఫ్లవర్ సీడ్స్ థైరాయిడ్ కు గ్రేట్ గా పనిచేస్తుంది. ఇవి శరీరంలోని వాపు, మరియు రెడ్ నెస్ ను తొలగిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనబడినది. ముఖ్యంగా వీటిలో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోనులను మెటబలైజ్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హౌమియో మందుల్లోనూ పొద్దు తిరుగుడు తన ఔషధతత్వాన్ని చూపిస్తోంది.

హౌమియో మందుల్లోనూ పొద్దు తిరుగుడు తన ఔషధతత్వాన్ని చూపిస్తోంది.

హౌమియో మందుల్లోనూ పొద్దు తిరుగుడు తన ఔషధతత్వాన్ని చూపిస్తోంది. హౌమియోలో అత్యం త కీలక భూమిక పోషించే టించర్‌ చిక్కబడకుండా ఉండేందుకు పొద్దు తిరుగుడు నుండి తీసిన రసాయనాలే చూస్తుంటాయి. మానవ శరీరంలో అనేక ధోష పూరిత లవణాలను బైటకు పంపించడంలో ప్రత్యేక లక్షణాలు ఇది కలిగి ఉందని వైద్య శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఈ సన్‌ ఫ్లవర్‌ ఎంత ఉపయుక్తంగా ఉంటుందో తగు రీతిన జాగ్రత్తలు వహించక పోతే అంతే ప్రమాదకారి కూడా.. ఈ పూలను, ఆకుల్ని తాగినపుడు ఎంత ఆహ్లాదక రంగా ఉంటుందో తదుపరి శరీరానికి చికాకు పుట్టి స్తుంది. పూలలోని చిన్న చిన్న విత్తనాలను పొరపాటున నోటిలో వేసుకుంటే అది విషతుల్యమై ఉండటంతో ఆజీర్ణం, కడుపులో గ్యాస్‌ పెరగటం, అంతర్గత రక్తస్రావాలకు దారి తీస్తుంది. కొన్ని ఉప జాతు లు విషతుల్యం కాకపో యినా.. జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపిస్తాయి.

English summary

Unique Health Benefits Of Sunflower Seeds: Health Benefits in Telugu

Sunflower seeds are obtained from sunflower which are highly nutritious and health promoting snack Sunflower seeds are a healthy food option one should include in their diet. It is an excellent source of vitamin E which neutralizes the free radicals in the body. The anti-inflammatory property of these seeds reduce the symptoms of asthma and arthritis.
Story first published: Friday, October 16, 2015, 17:31 [IST]
Desktop Bottom Promotion