For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల వ్యాధులకు తమలపాకు వంటకాలు

By Super
|

తమలపాకు చాలా ప్రయోజనకరంగా ఉండే ఒక ఔషధ మొక్క. దీని అన్ని భాగాల్లోను క్రిమినాశక పదార్థాలు ఉంటాయి. ఈ ఆకులను బిగ్గర స్వరానికి, ముక్కు నుండి రక్తము కారుట,ఎరుపు కళ్ళు,డిచ్ఛార్జ్ చికిత్సకు మరియు అంగస్తంభనతో సహా అనేక సమస్యలకు విస్తృతంగా ఉపయోగిస్తారు.

READ MORE: లేలేత తమలపాకుతో ఆరోగ్యానికి చాలా లాభాలు!

శతాబ్దాలుగా మా పూర్వీకుల కాలం నుండి తమలపాకు ఒక సమర్థవంతమైన ఔషధ మొక్కగా ఉంది. ఇది ఔషధ మొక్కగానే కాకుండా, ఇండోనేషియా వంటి కొన్ని ప్రాంతాల్లో ఆచార వ్యవహారాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది.

READ MORE: నోరు పండించమే కాదు, బరువు తగ్గించడంలోనూ తమలపాకు బేష్

తమలపాకులు వివిధ రకాల వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్ని వ్యాధులకు తమలపాకును ఉపయోగించి చేసిన కొన్ని వంటకాలు ఉన్నాయి.

 దగ్గు

దగ్గు

మూడు గ్లాసుల నీటిలో 15 తమలపాకులను వేసి బాగా మరిగించాలి. ఆ నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తేనే కలిపి త్రాగాలి.

బ్రాంకైటిస్

బ్రాంకైటిస్

రెండు కప్పుల నీటిలో 7 తమలపాకులు, రాక్ చక్కెర ముక్క వేసి బాగా మరిగించాలి. ఒక కప్పు నీరు అయ్యేవరకు మరిగించాలి. ఈ పానీయాన్ని ప్రతి రోజు ఒక గ్లాస్ చొప్పున మూడు సార్లు త్రాగాలి.

శరీర దుర్వాసన తొలగించడానికి

శరీర దుర్వాసన తొలగించడానికి

రెండు గ్లాసుల నీటిలో 5 తమలపాకులను వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఈ పానీయాన్ని మధ్యాహ్నం త్రాగాలి.

 కాలిన గాయాలు

కాలిన గాయాలు

తమలపాకులను శుభ్రంగా కడిగి రసాన్ని తీసి దానికి తేనే కలిపి కాలిన గాయాల మీద రాయాలి.

 ముక్కు నుండి రక్తము కారుట

ముక్కు నుండి రక్తము కారుట

ఒక లేత తమలపాకును తీసుకోని మెత్తగా చేసి ఉపయోగిస్తే ముక్కు నుండి రక్తం రావటం ఆగిపోతుంది.

అల్సర్

అల్సర్

మంచి తమలపాకు ఆకులను తీసుకోని శుభ్రంగా కడిగి,వాటిని ఉడికించి ఆ ముక్కలను ఆ ప్రాంతంలో అద్దాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.

దురద మరియు ఎరుపు కన్ను

దురద మరియు ఎరుపు కన్ను

ఒక గ్లాస్ లో 5 లేత తమలపాకులను వేసి మరిగించండి. ఆ నీరు చల్లబడిన తర్వాత ఆ నీటితో కళ్ళను రోజులో మూడు సార్లు కడగాలి.

 వ్రణోత్పత్తి - దురద

వ్రణోత్పత్తి - దురద

రెండు కప్పుల నీటిలో 20 తమలపాకులను వేసి బాగా మరిగించాలి. ఈ నీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కురుపులు మరియు దురద ఉన్న ప్రాంతంలో కడగటానికి ఉపయోగించండి.

చిగుళ్ళ బ్లీడింగ్ ఆపటం

చిగుళ్ళ బ్లీడింగ్ ఆపటం

రెండు కప్పుల నీటిలో నాలుగు తమలపాకులను వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలించాలి.

 పేగువ్యాధి

పేగువ్యాధి

రెండు తమలపాకులను తీసుకోని శుభ్రంగా కడిగి బాగా నమిలి రసాన్ని మింగి పిప్పిని పారవేయాలి.

నోటి వాసన తొలగించడానికి

నోటి వాసన తొలగించడానికి

రెండు తమలపాకులను శుభ్రంగా కడిగి రసాన్ని పిండి, ఆ రసాన్ని వేడి నీటిలో కలిపి పుక్కిలించి ఊయాలి.

మొటిమలు

మొటిమలు

7 నుంచి 10 తమలపాకులను శుభ్రంగా కడిగి గుజ్జు చేసి రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని ముఖం కడగటానికి ఉపయోగించాలి. ప్రతిరోజు రెండు సార్లు ఈ విధంగా చేయాలి.

వైట్ డిచ్ఛార్జ్

వైట్ డిచ్ఛార్జ్

పది తమలపాకులను 2.5 లీటర్ల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీరు వేడిగా ఉన్నప్పుడే యోనిని కడగటానికి ఉపయోగించాలి.

ఎక్కువ మొత్తంలో ఉన్న తల్లిపాలను తగ్గిస్తుంది

ఎక్కువ మొత్తంలో ఉన్న తల్లిపాలను తగ్గిస్తుంది

కొన్ని తమలపాకులను తీసుకోని శుభ్రంగా కడిగి కొంచెం కొబ్బరి నూనె రాసి,కొంచెం వేడి చేసి ఛాతీ చుట్టూ పెట్టి కొంచెం సేపు అలా ఉంచాలి.

English summary

Betel leaf Recipes for various diseases: Health tips in Telugu

Betel is a medicinal plant which is very beneficial. It containing antiseptic substances in all its parts. The leaves are widely used to treat a nosebleed, red eyes, discharge, making a loud voice, and many more, including erectile dysfunction.
Desktop Bottom Promotion