For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందారం (హైబిస్కస్)టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

మందార టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ నుండి ఉపశమనం, అలాగే జీర్ణ, రోగనిరోధక వ్యవస్థ, మరియు శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాలేయ వ్యాధిని నయం చేయుటలో సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాక జీవక్రియను వేగవంతం చేసి ఆరోగ్యకరమైన మరియు క్రమపద్దతిలో బరువు నష్టంకు సహాయపడుతుంది. మందార టీ లో విటమిన్ సి, ఖనిజాలు మరియు వివిధ యాంటి ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు మరియు ఆందోళన చికిత్సలో సహాయం చేస్తుంది.

మందార టీని మందార మొక్క యొక్క భాగాలను మరిగించటం ద్వారా తయారుచేస్తారు. దాని శాస్త్రీయ నామము హైబిస్కస్ సబ్దరిఫ్ఫా. ముఖ్యంగా పువ్వును పిలుస్తారు. మందార టీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధ పానీయంగా ఉంది. అలాగే తరచుగా ఒక ఔషధ టీగా ఉపయోగిస్తారు. అయితే, మందార పువ్వు వివిధ ప్రాంతీయ పేర్లను కలిగి ఉంది. సాదారణంగా దీనిని "రొసెల్లి" అని పిలుస్తారు.

మందార టీ ఎరుపు రూబీ రంగులో ఉండి పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అందువలన,దీనిని పుల్లని టీ అని కూడా పిలుస్తారు. అంతేకాక ఇది క్రాన్బెర్రీ రుచిని పోలి ఉంటుంది. ఈ టీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. మీ ప్రాధాన్యతను బట్టి వేడిగాను లేదా చల్లగాను త్రాగవచ్చు. ఈ టీలో కేలరీలు తక్కువ మరియు కెఫిన్-ఫ్రీ గా ఉంటుంది. ఈ వ్యాసం మానవ శరీరాన్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచటానికి సహాయం చేసే మందార టీ యొక్క పలు ప్రయోజనాలను చర్చిస్తుంది.

మందార టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

1. రక్తపోటు నిర్వహణ

1. రక్తపోటు నిర్వహణ

నవంబర్ 2008 లో ప్రచురితమైన AHA (అమెరికన్ హార్ట్ అసోసియేషన్) ఒక నివేదికలో మందార టీ వినియోగించే వారిలో ప్రీ-రక్తపోటు మరియు కొద్దిగా రక్తపోటు ఉన్న పెద్దవారిలో రక్తపోటును తగ్గిందని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న పెద్దల్లో 1/3 మంది అధిక రక్తపోటుతో బాధ పడతారు. Odigie IP ద్వారా నిర్వహించబడిన ఒక అధ్యయనంలో యాంటీ అధిక రక్తపోటు మరియు హృదయ-రక్షిత లక్షణాలను కలిగి ఉండుట వలన హృదయ వ్యాధుల అధిక నష్టాలు మరియు రక్తపోటుతో బాధపడుతున్న ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిసింది.

బోస్టన్ లో టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధన ప్రకారం, మందార టీలో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన రక్తపోటును 10 పాయింట్లు తగ్గిస్తుందని కనుగొన్నారు. ఒక్కసారిగా అభివృద్ధి సంభవించదు. మీరు కొన్ని వారాల పాటు ప్రతి రోజు మూడు కప్పుల టీని త్రాగవలసిన అవసరం ఉంది. అంతేకాక మందార టీ ఒకే సమయంలో రక్తపోటు తగ్గించడం మరియు మూత్రవిసర్జన పెంచే మలబద్ధక లక్షణాలను కలిగి ఉంది.

2. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

2. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

మందార టీలో ఆకట్టుకునే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. తద్వారా ఇది గుండె వ్యాధులకు వ్యతిరేకంగా రక్షించడానికి సహాయం మరియు రక్త నాళాల నష్టం నుండి రక్షించటం మరియు శరీరం నుండి "చెడు" LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సహాయపడుతుంది.మందార టీలో ఉండే హైపోలిపిదేమిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు మధుమేహం వంటి చక్కెర రుగ్మతలతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. టైప్ II డయాబెటిస్ రోగులలో నిర్వహించిన ఒక పరిశోధనలో మందార పుల్లని టీ వినియోగం వలన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజెరైడ్స్ మరియు ఊహించలేని వ్యాధులను నిర్వహించడానికి సహాయపడుట మరియు తక్కువ సాంద్రత లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని తెలిసింది.

3. లివర్ ని రక్షిస్తుంది

3. లివర్ ని రక్షిస్తుంది

పరిశోధన అధ్యయనాలు మందార టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కాలేయ వ్యాధి చికిత్సలో సహాయపడతాయని సూచించాయి. యాంటీఆక్సిడాంట్లు వ్యాధుల నుండి మీ శరీరంను రక్షించేందుకు సహాయం చేస్తాయి. అవి శరీరంలో కణజాలం మరియు కణాలలో ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేస్తాయి. అందువలన, మేము ఆత్మవిశ్వాసంతో మందార టీ త్రాగటం వలన అనేక అవయవ వ్యవస్థల ఆరోగ్యాన్ని మంచిగా నిర్వహించడం ద్వారా మీ జీవితకాలం పెరుగుతుందని చెప్పగలం.

4. మందార టీలో యాంటీ-క్యాన్సర్ లక్షణాలు

4. మందార టీలో యాంటీ-క్యాన్సర్ లక్షణాలు

మందార టీలో యాంటీ కణితి మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన హైబిస్కస్ ప్రోతోకాతెచుక్ ఆమ్లం ఉంటుంది. టైచుంగ్ లో చుంగ్ షాన్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ లో బయోకెమిస్ట్రీ విభాగం మరియు ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక అధ్యయనం,హైబిస్కస్ కణ మరణాన్ని ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుందని సూచించింది. సాధారణంగా దీనిని ప్రోగ్రామ్ సెల్ మరణం అని పిలుస్తారు.

5. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు

5. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు

మందార టీలో విటమిన్ సి, ఆస్కార్బిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. మీ రోగనిరోధక వ్యవస్థ యొక్క కార్యకలాపాల ఉద్దీపన పెంచటానికి మరియు మీ శరీరంనకు అవసరమైన ఒక ముఖ్యమైన పోషకంగా ఉంటుంది. మందార టీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. అందువలన, జలుబు మరియు ఫ్లూ ఉపశమనానికి సహాయపడుతుంది. మందార టీని శీతలీకరణ ప్రభావం, జ్వరం వల్ల వచ్చే అసౌకర్య చికిత్సకు ఉపయోగిస్తారు.

6. రుతుసంబంధ నొప్పి

6. రుతుసంబంధ నొప్పి

మందార టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో తిమ్మిరి మరియు ఋతు నొప్పి నుండి ఉపశమనం వంటివి ఉన్నాయి. అలాగే ఇది హార్మోన్ సంతులనంనకు సహాయపడుతుంది. మానసిక కల్లోలం,నిస్పృహ, ఋతుస్రావం,మితిమీరి తినటం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.

యాంటిడిప్రెసెంట్ లక్షణాలు

మందార టీలో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు మరియు ఖనిజాలు,యాంటిడిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. మందార టీ వినియోగం వలన నాడీ వ్యవస్థ డౌన్ ఉధృతికి సహాయపడుతుంది.అలాగే శరీరం మరియు మనస్సు లో ఒక రిలాక్స్డ్ అనుభూతిని సృష్టించడం ద్వారా ఆందోళన మరియు వ్యాకులతను తగ్గిస్తుంది.

7. జీర్ణక్రియకు సహాయం

7. జీర్ణక్రియకు సహాయం

చాలా మంది జీర్ణక్రియ మెరుగుపరచడానికి మందార టీని సేవిస్తారు. ఇది మూత్రవిసర్జన మరియు ప్రేగు ఉద్యమాలు రెండింటిని పెంచుతుంది. ఇది మూత్రవిసర్జన లక్షణాలు కలిగి ఉన్నందున, మలబద్ధకం చికిత్సలో ఉపయోగిస్తారు. మీరు బరువు కోల్పోవటానికి మరియు మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపరచడానికి మరియు పురీషనాళ కాన్సర్ నివారించేందుకు సహాయపడుతుంది.

8. దాహాన్ని తీరుస్తుంది

8. దాహాన్ని తీరుస్తుంది

మందార టీ దాహాన్ని తీర్చుట వలన క్రీడా పానీయాలలో ఉపయోగిస్తారు. సాదారణంగా ఈ ప్రయోజనం కోసం మందార టీని ఒక శీతల రూపంలో వినియోగిస్తారు. ఈ రకమైన టీ చాలా వేగంగా శరీరాన్ని చల్లబరిచే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల చాలా మంది వారి ఆహారంలో చేర్చుకుంటారు. దీనిలో ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మూత్రవిసర్జనను తగ్గిస్తుంది. ఇది శరీరం నుండి అదనపు ద్రవాలను మరియు విషాన్ని బయటకు పంపుతుంది.

9. బరువును తగ్గిస్తుంది

9. బరువును తగ్గిస్తుంది

మందార టీ బరువు కోల్పోవడం కోసం ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కార్బోహైడ్రేట్ల ఆహారంను సమృద్దిగా తింటే, చక్కెర మరియు పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండి మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే, పరిశోధన అధ్యయనాలు మందార జ్యూస్ స్టార్చ్ మరియు గ్లూకోజ్ శోషణను తగ్గించి బరువు నష్టంకు సహాయపడుతుందని సూచించాయి. మందార ఏమేలేస్ యొక్క ఉత్పత్తిని తగ్గించి కార్బోహైడ్రేట్లను మరియు స్టార్చ్ శోషణకు సహాయపడుతుంది. కాబట్టి మందార టీ త్రాగితే శోషణ జరగకుండా నిరోధిస్తుంది. అందువలన, మందార టీ అనేక బరువు నష్టం ఉత్పత్తులలో కనబడుతుంది.

10. వేసవి మరియు శీతాకాలం రెండింటికి మంచిది

10. వేసవి మరియు శీతాకాలం రెండింటికి మంచిది

మీరు వేడి టీగా లేదా చల్లటి టీగా గాని మందార టీని త్రాగవచ్చు. శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచటానికి కాయటం మరియు నేరుగా తాగాలి. ఇది చేయటానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. బహుశా వేసవిలో మీరు వేడి పానీయం వద్దని అనుకుంటే, మీరు చల్లబరిచిన మందార టీని త్రాగవచ్చు. దీనిని సిద్దం చేయటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. అప్పుడు ఇది ఒక ఆరోగ్యకరమైన మరియు రిఫ్రెష్ అయ్యే విధంగా మిమ్మల్ని చల్లబరుస్తుంది.

11. మంచి రుచి

11. మంచి రుచి

మందార టీ క్రాన్బెర్రీ జ్యూస్ ని పోలి ఒక మంచి రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఖచ్చితంగా టార్ట్ గా వర్ణించవచ్చు. కాబట్టి మీరు తీయదనాన్ని పెంచడానికి చక్కెర లేదా తేనెను జోడించవచ్చు. కాబట్టి మీరు మీ రుచి ప్రాధాన్యతలను బట్టి దాల్చిన చెక్క,లవంగాలు,జాజికాయ,అల్లం వంటి సుగంధ ద్రవ్యాలను జోడించటానికి ప్రయత్నించవచ్చు.

English summary

Health Benefits of Hibiscus Tea

Hibiscus tea is ruby red in color and has a sour taste. Therefore, it is also known as sour tea and has a flavor similar to cranberry. It is widely available on the market throughout the tea-drinking world, and can be consumed hot or cold depending on your preference. This tea is low in calories and caffeine-free. This article discusses the various benefits of hibiscus tea which would help in keeping the human body healthy and fit.
Desktop Bottom Promotion