For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోంగూరలో దాగున్న అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్

By Nutheti
|

వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటే.. ఆహా ఏమి రుచిలే. గోంగూర పచ్చడి అంటే.. తెలుగువాళ్లకు ఏంతో ప్రీతికరం. పుల్లపుల్లగా.. నోరూరించే రుచి గోంగూర సొంతం. పచ్చడి చేసినా, ఊరగాయపట్టినా, పప్పు చేసినా, కూరల్లో జోడించినా, మటన్ లో గోంగూర తగిలించినా.. ఆ రుచి అమోఘంగా ఉంటుంది. గోంగూర ఇష్టపడని వాళ్లు బహుషా ఉండరేమో. ఏ కూరగాయల్లో వేసిన మంచి రుచినిచ్చే గోంగూరలో ఎన్నో పోషక విలువలున్నాయి.

READ MORE: పొట్ట ఉదర భాగంలో మసాజ్ చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

చీప్ దొరికే.. అందరికీ అందుబాటులో ఉండే గోంగూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా గోంగూరలో దాగుంది. ఇందులో విటమిన్ సి, ఎ, బి6 తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. రకరకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే శక్తి పుల్లపుల్లని గోంగూరలో ఉన్నాయి. గోంగూరలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న గోంగూర చాలా పవర్ ఫుల్. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

డైజెషన్

డైజెషన్

గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో జీర్ణశక్తి పెరిగి, డైజెస్టివ్ సమస్యలు దూరమవుతాయి.

ఎముకల ఆరోగ్యానికి

ఎముకల ఆరోగ్యానికి

గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజు వారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే.. ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది.

రక్తప్రసరణ

రక్తప్రసరణ

శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది. గోంగూరను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు కూడా గోంగూర అలవాటు చేయాలి.

మధుమేహానికి

మధుమేహానికి

రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు.

గుండె, కిడ్నీ, క్యాన్సర్

గుండె, కిడ్నీ, క్యాన్సర్

గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది.

విటమిన్ ఎ

విటమిన్ ఎ

గోంగూరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోంగూరను తరచుగా తీసుకోవడం వల్ల కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

రక్తహీనత

రక్తహీనత

రక్తహీనతను దూరం చేసుకోవాలంటే.. శరీరానికి విటమిన్ కె చాలా అవసరం. విటమిన్ కె గోంగూరలో పుష్కలంగా లభిస్తుంది.

ఔషధం

ఔషధం

దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే.. సహజ ఔషధంలా పనిచేస్తుంది.

English summary

Health Benefits of Sorrel in telugu

Some of the health benefits of sorrel include its ability to boost eyesight, strengthen the immune system, improve digestion, build strong bones, increase circulation, increase energy levels, help prevent cancer, protect against diabetes, strengthen heart health, and improve kidney health.
Story first published: Wednesday, November 4, 2015, 16:49 [IST]
Desktop Bottom Promotion