For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తులసి సర్వరోగ నివారిణి

By Nutheti
|

ప్ర‌తి ఇంట్లో ఉండే తుల‌సి మొక్క ఆధ్యాత్మికంగానే కాదు.. ఆరోగ్య ప్ర‌దాయినిగానూ ఎంతో మేలు చేస్తుంది. తుల‌సి ఆకును ప్ర‌కృతి ప్ర‌సాదించిన‌ త‌ల్లిగా.. ఆయుర్వేద నిపుణిగా చెప్ప‌వ‌చ్చు.

ఒక‌ప్పుడు తుల‌సి కోట లేని ఇల్లు ఉండేది కాదు. కానీ ఇప్పుడు తుల‌సి కోట‌లు క‌నుమ‌రుగైపోయాయి. మారుతున్న కాలం.. సంప్ర‌దాయాల‌నూ దూరంగా తీసుకెళ్తోంది. అపార్ట్‌మెంట్లు, కాంక్రీట్ జంగిల్స్‌లో తుల‌సి కోట‌కు చోటు క‌రువైంది.

అయితే తుల‌సి ఆకుకు ఎన్నో ర‌కాల వ్యాధులతో పోరాడే అద్భుత‌మైన‌ శ‌క్తి ఉంది. తులసి ఆకు ఆరోగ్యంతోపాటు.. చర్మ సంరక్షణకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా దివ్య ఔషధంలా పనిచేస్తుంది కాబట్టే పెద్దలు తులసిని సర్వరోగ నివారిణిగా పిలిచారు. తులసి ఆకుతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

తులసి ఆకు చేసే అద్భుతం

తులసి ఆకు చేసే అద్భుతం

తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టిపొడి చేసి తేనెతోగానీ, పెరుగుతోగానీ కలిపి తీసుకుంటే.. అనేక రోగాలను నివారించవచ్చు. ఉదయాన్నే పరగడపున తులసి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకి మూడుసార్లు తీసుకుంటే.. మరీ మంచిది.

తులసి ఆకు చేసే అద్భుతం

తులసి ఆకు చేసే అద్భుతం

మలేరియా వచ్చిందంటే.. ఎన్ని మందులు వాడినా.. ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు 5 నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాల పొడితో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు. తులసి రసం.. అల్లం రసం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజూ 5 నుంచి 25 గ్రాముల నల్ల తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే.. ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.

తులసి ఆకు చేసే అద్భుతం

తులసి ఆకు చేసే అద్భుతం

పిల్లలకు పదే పదే మెడిసిన్స్ వాడటం అంత మంచిది కాదు. కాబట్టి సాధారణ పద్ధతుల్లోనే వ్యాధులను నయం చేయడం మంచిది. పిల్లలను వాంతులు వేధిస్తుంటే.. కొద్దిగా తులసి విత్తనాలకు పెరుగు లేదా తేనెతో కలిపి ఇస్తే.. వాంతులు తగ్గుతాయి. తులసి ఆకులను నీళ్లలో మరిగించి.. ఆ నీటిని సేవిస్తే చెవి నొప్పి నుంచి బయటపడవచ్చు.

తులసి ఆకు చేసే అద్భుతం

తులసి ఆకు చేసే అద్భుతం

ఈ మధ్య అందరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ర్టిక్ ట్రబుల్. దీనికి తులసి మంచి పరిష్కారం. నల్ల తులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి ఆ మిశ్రమాన్నినూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ర్టిక్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

English summary

Health benefits of Tulsi : health tips in telugu

There are so many benefits of tulsi. That is the reason why it is also used in Ayurveda. Some believe that basil has anti-ageing properties apart from medicinal properties. The leaves of basil also help diabetics control their glucose levels.
Story first published: Monday, September 28, 2015, 16:35 [IST]
Desktop Bottom Promotion