Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మీ బెల్లీ ఫ్యాట్ ఏ టైప్ ? దాన్ని ఎలా టార్గెట్ చేయాలి ?
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. అయితే మీ బెల్లీ ఫ్యాట్ ఎలాంటి టైపో తెలుసుకుని.. దానికి తగ్గట్టు వర్కవుట్ చేయడం వల్ల దాన్ని తగ్గించుకోవడం చాలా ఈజీ. బెల్లీ ఫ్యాట్ ఏ టైప్ కి చెందినదో తెలుసుకుని వర్కవుట్ చేస్తే.. ఒక నెలలోనే మీ పొట్టను సాధారణంగా మార్చుకోవచ్చు.
ముందుగా మీకు ఎలాంటి బెల్లీ ఫ్యాట్ ఉందో తెలుసుకోవాలి.. ఎందుకంటే.. చాలా బెల్లీ ఫ్యాట్స్ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఇలాంటి ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్, గ్యాస్ వంటి సమస్యలతో మొదలై.. పొట్టలో కొవ్వు చేరుకోవడానికి కారణమవుతుంది. ఇలాంటి పొట్టను బ్లోటెడ్ బెల్లీ ఫ్యాట్ అంటారు.
స్ర్టెస్ బెల్లీ ఫ్యాట్, లో బెల్లీ ఫ్యాట్, పంక్చర్డ్ బెల్లీ ఫ్యాట్ అనే మరికొన్ని ఉన్నాయి. ఒకసారి మీ బెల్లీ ఫ్యాట్ ఏ రకానికి చెందినదో తెలుసుకుంటే.. దానికి కారణాలు తెలుసుకోవడం వల్ల బెల్లీ కరిగించుకోవడం ఈజీ అవుతుంది. గుడ్డిగా ఏదో నచ్చినది ఫాలో అవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గేది అసాధ్యం. కాబట్టి.. మీకున్న పొట్ట ఎలాంటిదో తెలుసుకునే ఆ పద్ధతిలోనే వర్కవుట్ చేయడం మంచిది. ఎలాంటి బెల్లీ ఫ్యాట్ ని ఎలా టార్గెట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

లో బెల్లీ ఫ్యాట్
ఇలాంటి బెల్లీ ఫ్యాట్ పొట్ట కింది భాగంలో ఏర్పడుతుంది. రెగ్యులర్ గా ఫాస్ట్ ఫుడ్స్, వ్యాయామం చేయకపోవడం వల్ల ఇలాంటి బెల్లీ ఫ్యాట్ వస్తుంది.

లో బెల్లీ ఫ్యాట్ రెమిడీస్
సన్నగా ఉన్నవాళ్లు సరైన వ్యాయామం చేయకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశాలున్నాయి. ఇలా లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే.. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అలాగే.. రకరకాల ఆహారాలు అంటే పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. సిట్ అప్స్, సైక్లింగ్ వంటి వ్యాయామం మంచి ఫలితాన్నిస్తుంది.

బ్లోటెడ్ బెల్లీ ఫ్యాట్
వ్రాంగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లోటెడ్ బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అది కూడా సరిగా జీర్ణంకాకపోవడం వల్ల ఈ పొట్ట వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి ఆహారాలు పొట్టలో కొవ్వు చేరడానికి మాత్రమే కాదు.. గ్యాస్ర్టిక్ సమస్యలకు కూడా కారణమవుతాయి. పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు పడకపోయినా.. ఇలాంటి బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

బ్లోటెడ్ బెల్లీ ఫ్యాట్ రెమిడీస్
బ్లోటెడ్ బెల్లీ ఫ్యాట్ టార్గెట్ చేయాలంటే.. మీ పొట్టకు అనుకూలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. క్యాబేజి, టర్నిప్స్, పల్సెస్, పాలు వంటివి గ్యాస్ కి కారణమవుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.

స్ర్టెస్ బెల్లీ ఫ్యాట్
ఇలాంటి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఒత్తిడిలోనయ్యే వాళ్లలో కనిపిస్తుంది. ఒత్తిడి కారణంగా కోర్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పొట్టలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. అలాగే పొట్టలో సమస్యలు ఉన్నవాళ్లకు ఇలాంటి స్ర్టెస్ బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్స్ ఉంది.

స్ర్టెస్ బెల్లీ ఫ్యాట్ నివారణా మార్గాలు
ఇలాంటి బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే.. తక్కువ భోజనం చేయాలి. ఎక్కువసార్లు తక్కువ ఆహారం తీసుకోవడం అలవరుచుకోవాలి. దీనివల్ల మెటబాలిజం పెరిగి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది. అలాగే ఫ్రూట్స్, వెజ్జీస్, కార్బ్స్, ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి.

పంక్చర్డ్ బెల్లీ ఫ్యాట్
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఇలాంటి బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఇది ఎక్కువగా ఆఫీసులలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వాళ్లలో కనిపిస్తుంది. కంటిన్యూగా కూర్చోవడం వల్ల కండరాలు ఉత్తేజాన్ని కోల్పోవడం వల్ల ఫ్యాట్ చేరుతుంది.

పంక్చర్డ్ బెల్లీ ఫ్యాట్ రెమిడీస్
సాయంత్రంవేళ వాకింగ్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అలాగే నూట్రియంట్స్, ఫైబర్స్ ఉన్న ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి. బయటి ఆహారానికి స్వస్తి చెప్పాలి. కూరగాయలు, పండ్లు ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి. అలాగే.. బిజీ షెడ్యూల్ లో కాస్తైనా.. వ్యాయామానికి సమయం కేటాయించాలి.
చూశారుగా.. మీకున్న బెల్లీ ఫ్యాట్ ఏదో తెలుసుకుని.. దానికి తగ్గ వర్కవుట్ చేసుకుంటే.. నెలలోనే మీ పొట్ట కరిగిపోయి.. స్లిమ్ గా, అందంగా కనిపించవచ్చు.



Click it and Unblock the Notifications
