For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు చూయింగ్ గమ్ నమలడం అలవాటా ? ఐతే బీ అలర్ట్

By Nutheti
|

ఒత్తిడిగా అనిపించినా.. ఏం తోచకపోయినా.. పని చేస్తున్నప్పుడు నిద్రవచ్చినా.. వెంటనే గుర్తొచ్చేది చూయింగ్ గమ్. ఆకలిగా అనిపించినా.. చూయింగ్ గమ్ నమిలేస్తుంటారు. చూయింగ్ గమ్ అనేది ప్రస్తుతం నిత్యజీవితంలో పార్ట్ లా మారిపోయింది. మరికొందరైతే.. చూయింగ్ గమ్ లేకుండా అసలు ఉండలేరు.

చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల పంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. వీటిల్లో ఎక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది. కాబట్టి పళ్లకు హాని కలిగిస్తాయి. అందుకే షుగర్ లేని చూయింగ్ గమ్ అయితే మంచిదని డెంటిస్ట్ లు సూచిస్తున్నారు.

READ MORE: దంతాలను దృడంగా ఉంచే 7 ఆహారాలు...

చక్కెరలేని చూయింగ్ గమ్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. చక్కెరలేనిదే అయినా.. అందులో స్వీట్ నెస్ కోసం కలిపే క్సైలిటాల్ అనే స్వీటనర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది తలనొప్పి నుంచి ఉపశమనం కోసం చూయింగ్ గమ్ తీసుకుంటారు.. కానీ దీనివల్ల బ్రెయిన్ కి సైడ్ ఎఫెక్ట్ తగులుతుంది. అంతేకాదు డయాబెటీస్, ఒబేసిటీ వచ్చే ప్రమాదముంది. ఎక్కువగా చూయింగ్ గమ్ తినడం వల్ల వచ్చే సమస్యలేంటో ఓ లుక్కేయండి.

పంటికి

పంటికి

చూయింగ్ గమ్ ను ఎక్కువగా నమలడం వల్ల పళ్లకు హాని కలుగుతుంది. ఇందులో ఉండే చక్కెర స్థాయిలు దంతక్షయానికి కారణమవుతాయి. ఎసిడిక్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ చూయింగ్ గమ్ లో ఉంటాయి. ఇవి పళ్లు కోతకు గురవడానికి కారణమవుతాయి.

తలనొప్పికి

తలనొప్పికి

ఎక్కువగా చూయింగ్ నమలడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. నరాలపై నిర్వరామంగా ఒత్తిడి పెరుగుతుంది. దీనికారణంగా తలనొప్పి బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మైగ్రేన్ కి దారితీస్తుంది.

గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్స్

గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్స్

చూయింగ్ గమ్ పొట్టలో గాలి చేరడానికి కారణమవుతుంది. దీనివల్ల పొట్ట నొప్పి, పొట్ట ఉబ్బడం, ప్రేగులలో సమస్యలు ఇబ్బందిపెడతాయి. కాబట్టి చూయింగ్ గమ్ నమిలేటప్పుడు నోటిని ఎక్కువగా తెరవకపోవడం మంచిది.

దవడ సమస్యలు

దవడ సమస్యలు

చూయింగ్ గమ్ దవడ సమస్యలకు కారణమవుతుంది. ఎక్కువగా వీటిని నమలడం వల్ల దవడ కండరాలపై ఒత్తిడి పెరిగి.. చెవి, తలనొప్పులకు అవకాశముంది.

ఒబేసిటీ

ఒబేసిటీ

చూయింగ్ గమ్ కి ఒబేసిటీకి కారణముంది. కొంతమంది ఆకలిని తగ్గించుకోవడానికి చూయింగ్ గమ్ అలవాటు చేసుకుంటారు. కానీ.. వీటిలో ఆకలిని ప్రేరేమించే గుణాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో చిప్స్, కోక్, క్యాండీ వంటి స్నాక్స్ తీసుకుంటారు. వీటికి బదులు తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. చాలా సమయం వరకు లాలాజలం ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల జీర్ణ ప్రక్రియ నిలిచిపోతుంది. దీంతో సమస్యలు పెరుగుతాయి.

గర్భస్థ శిశువుకి

గర్భస్థ శిశువుకి

గర్భిణీ స్ర్తీలకు చూయింగ్ గమ్ అనారోగ్యకరం. ఇందులో ఉండే సింథటిక్ ఇంగ్రిడియెంట్స్ కడుపులో పెరుగుతున్న బిడ్డపై ప్రభావం చూపిస్తాయి. చిన్నపిల్లలకు కూడా చూయింగ్ అలవాటు చేయడం మంచిది కాదు.

English summary

Is Chewing Gum Bad For Health? in telugu

Stressed? Chew a couple of sticks of chewing gum. Feeling hungry? Chomp on some chewing gum, while thinking about other food options. Chewing gum has become a part and parcel of our everyday life, and some of us can't seem to live without it.
Story first published: Wednesday, November 18, 2015, 9:24 [IST]
Desktop Bottom Promotion