For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొటాషియం ఉండే ఆహార ప‌దార్థాలు తీసుకుంటే బీపీకి చెక్

By Nutheti
|

పొటాషియం ఉన్న ఆహారం తీసుకుంటున్నారా.. అవును రోజూ పొటాషియం ఉన్న ఆహారం డైట్ లో చేర్చుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకి 3వేల 5 వంద‌ల మిల్లీ గ్రాముల పొటాషియం శ‌రీరానికి అందాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.

రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా.. పొటాషియం ఎక్కువుండేలా చూసుకోవాలి. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో చెక్‌ చేసుకోవాలి. అలాంటి ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటే స‌రిపోతుంది.

banana

పొటాషియం శ‌రీరానికి కావాల్సిన స్థాయిలో అందితే గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం త‌క్కువ‌గా ఉంటుంది. కేవలం నాలుగువారాలు ఉప్పు వాడకం తగ్గించినా కూడా.. రక్తపోటు తగ్గుతుందని... పొటాషియం ఎక్కువ తీసుకోవడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.

alu

స‌రైన ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువ‌గా తీసుకోవాలి. అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరుసెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీరల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
milk

శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉన్నవారిలో రక్తపోటు సమస్య త‌క్కువ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి మామూలు వాడకం కన్నా కాస్త ఎక్కువ‌గా తీసుకున్నా మంచిదే.

oil

వేరుసెనగ, ఆలివ్, రైస్ బ్రాన్ నువ్వుల నూనెల‌ వాడకం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మైదాతో చేసిన పఫ్‌లు, కార్పొహైడ్రేట్లు అధికంగా ఉండే పదార్థాలు పూర్తిగా మానేయడం మంచిది.

English summary

Potassium Foods control blood pressure in telugu

Potassium Foods control blood pressure.
Story first published: Sunday, November 1, 2015, 13:59 [IST]
Desktop Bottom Promotion