Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి గల 6 ముఖ్య కారణాలు
ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ఆరోగ్యం మీద మరియు బరువు మీద ఏకాగ్రతపెట్టడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం చాలా తక్కువ. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే వరకూ దిన చర్యల్లో మునిగితేలుతు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, హార్ట్ సమస్యలు, కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారు.
ఆరోగ్యంతో పాటు, నడుము చుట్టు కొలత పెరిగే కొద్ది, శరీరంలో ఆరోగ్య సమస్యలు ఒకటి వెనుక మరొకొట ప్రారంభమవుతాయి. కాబట్టి, ఆరోగ్యంతో పాటు బరువును కంట్రోల్ చేసుకోవాలి.
అధిక బరువుకు కారణం జన్యుపరమైన కారణాలు మరియు జీవనశైలిలో మార్పులే ప్రధాణ కారణం. అయితే బరువు తగ్గించుకోగలుగుతున్నారు కానీ, బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగకపోవడానికి కారణాలు తెలియదు. బరువ తగ్గించుకోవడం తేలికే కానీ, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా కష్టం. అందుకు మీరు రెగ్యులర్ గా చేసే పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ కంట్రోల్ చేసుకొన్నట్లైతే బెల్లీ కరిగించుకోవడం సాద్యం అవుతుంది.

ఎన్ని వ్యాయామాలు, యోగాలు, జిమ్ లు చేసిన బరువు తగ్గుతున్నారు కానీ, బెల్లీ ఎందుకు తగ్గుట లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ లోని కారణాలును మీరు తెలుసుకోవాల్సిందే...

చేసే వ్యాయామాల్లో తప్పిదాలు:
మీరు ఇప్పటికీ వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తున్నా మీ బరువులో కానీ లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడంలోని కానీ ఎలాంటి మార్పులు కనబడకుంటే అందుకు మీరు చేసే వ్యాయామాలు తప్పువై ఉంటాయి. ఇలా రెగ్యులర్ వ్యాయాలు హార్ట్ కు మంచిదే అయినా, మీ నడుము లేదా పొట్ట తగ్గించుకోవడంలో ఎలాంటి మార్పులను చూపించదు.

ప్రొసెస్డ్ ఫుడ్స్:
తరచూ ప్రొసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఖచ్చితంగా నడుము సైజు పెరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ నుండి ప్రొసెస్డ్ ఫుడ్స్ ను తినకుండా నివారించాలి.

మంచి ఫ్యాట్స్ కాకుండా:
ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. కాబట్టి, హెల్తీ ఫ్యాట్స్ ను తీసుకోవడం మంచిది . హెల్తీ ఫ్యాట్స్ అయినా మితంగా తీసుకోవడం మంచిది.

ఒత్తిడితో ఉన్నా:
మీరు ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నాయ అనసవరంగా బరువు పెరుగుతారు. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోను ఉత్పత్తి వల్ల శరీరంలో ఫ్యాట్ పెంచేస్తుంది.

నిద్రలేమి:
నిద్రలేమి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు బరువును కూడా అమాంతం పెంచేస్తుంది. కాబట్టి ప్రతి రోజై కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి.

చురుకు దనం లేకపోవడం
మీరు ఎప్పుడూ లేజీగా ఉండటం మరియు యాక్టివ్ గా లేకపోవడం వల్ల బెల్లీ మరింత తీవ్రంగా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి, యాక్టివ్ మరియు హెల్తీగా ఉండాలి.



Click it and Unblock the Notifications